వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కన్నుమూత

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Former AP Minister and TDP MLC Gali Muddukrishnama Naidu Lost Life

అమరావతి: టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు బుదవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని వెంకట్రామపురం గాలి ముద్దుకృష్ణమనాయుడు స్వగ్రామం. 1947 జూన్ 9వ, తేదిన గాలి ముద్దుకృష్ణమనాయుడు జన్మించారు.

Tdp leader Gali Muddu Krishnama Naidu demise

1983లో ఎన్టీఆర్ టిడిపిని ఏర్పాటు చేసిన సమయంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు ఎన్టీఆర్ పిలుపు మేరకు టిడిపిలో చేరారు. ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడుగా గాలి ముద్దుకృష్ణమనాయుడు ఉండేవాడు.ఎన్టీఆర్ మంత్రివర్గంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు అటవీ, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.

చిత్తూరు జిల్లా పుత్తూరు, నగరి అసెంబ్లీ స్థానాల నుండి గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.2014 ఎన్నికల్లో నగరి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి రోజా చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో గాలి ముద్దుకృష్నమనాయుడు ఓటమిపాలయ్యారు.

గత ఏడాదిలో ఎమ్మెల్సీగా గాలి ముద్దుకృష్ణమనాయుడికి టిడిపి అవకాశం కల్పించింది. నాలుగు మాసాల క్రితం గాలి ముద్దుకృష్ణమనాయుడు గుండె ఆపరేషన్ చేయించుకొన్నారు. ఆసుపత్రి నుండి ఇంటికి తిరిగి వచ్చారు.

అయితే నాలుగు రోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ గాలి ముద్దుకృష్ణమనాయుడు హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గాలి ముద్దుకృష్ణమనాయుడు బుదవారం తెల్లవారుజామున మరణించాడు

జి.రామానాయుడు, రాజమ్మ దంపతులకు ముద్దుకృష్ణమ నాయుడు జన్మించారు. బీఎస్సీ, ఎంఏతోపాటు న్యాయవాద డిగ్రీ పట్టా పొందారు. ఆయనకు భార్య సరస్వతి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పుత్తూరు నుంచి ఆరుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి రికార్డులకెక్కారు.

1995లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోయాక కొంత కాలం పాటు లక్ష్మీపార్వతి వర్గంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004 ఎన్నికల్లో ఆ పార్టీ శాసనసభ్యునిగా గెలుపొందారు. తిరిగి 2008లో తెదేపాలో చేరి 2009 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

English summary
TDP MLC Gali Muddukrishnamanaidu died on Wednesday morning in a private hospital.He was elected as MLA from Puttur and Nagari assebly segments six times.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X