వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంప పెట్టు .. ఇకనైనా బుద్ధి తెచ్చుకో .. గోరంట్ల బుచ్చయ్య చౌదరి

|
Google Oneindia TeluguNews

నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు జగన్ సర్కార్ ను ఇరకాటంలో పడేసింది. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు కారణంగా మారింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా తొలగిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంప పెట్టు అని టిడిపి సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు.

 జగన్ తో పాటు గవర్నర్ , మాజీ న్యాయమూర్తి కనగరాజ్ కూడా టార్గెట్ ..కోర్టు తీర్పు ప్రతిపక్షాలకు అస్త్రం జగన్ తో పాటు గవర్నర్ , మాజీ న్యాయమూర్తి కనగరాజ్ కూడా టార్గెట్ ..కోర్టు తీర్పు ప్రతిపక్షాలకు అస్త్రం

నియంతలాగా పాలన సాగిస్తాం అంటే కుదరదని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అయినా సరే చట్టానికి, రాజ్యాంగ వ్యవస్థకు తలొగ్గాల్సిందే అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రాష్ట్రం సీఎం జగన్ జాగీర్దార్ కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా 58 కోట్ల తీర్పులు వచ్చాయని గోరంట్ల పేర్కొన్నారు.

TDP leader gorantla buchaiah chowdary criticised Jagans government on High Court verdict

ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. అంతేకాదు జగన్ అక్రమాస్తుల కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఆయన నియంత పోకడల వల్లే అధికారులు కోర్టు బోనులో నిలబడాల్సి వస్తుందని గోరంట్ల వ్యాఖ్యానించారు. ఇకనైనా సీఎం జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలని, తన పద్ధతి మార్చుకోవాలని గోరంట్ల హితవుపలికారు.

English summary
Senior leaders of the TDP, Gorantla Buchaiah Chowdhary, said that the high court verdict on the ordinance issued by removing Nimmagadda Ramesh Kumar as the state election commissioner should be a insult to the Jagan government. He said that it is not possible to rule as a dictator.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X