వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాలలో కలకలం: టిడిపి నేత గన్‌మెన్ కాల్పులు, శిల్పాపై హత్యాయత్నమని..

ఉప ఎన్నికల మరుసటి రోజైన గురువారం నంద్యాలలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ మైనార్టీ నేత అంత్యక్రియల్లో టిడిపి, వైసిపి వర్గీయుల మధ్య మాటల యుద్ధం, ఆ తర్వాత కాల్పులు చోటు చేసుకున్నాయి.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: ఉప ఎన్నికల మరుసటి రోజైన గురువారం నంద్యాలలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ మైనార్టీ నేత అంత్యక్రియల్లో టిడిపి, వైసిపి వర్గీయుల మధ్య మాటల యుద్ధం, ఆ తర్వాత కాల్పులు చోటు చేసుకున్నాయి.

ఉద్రిక్తత.. అభిరుచి మధు భూమా వర్గీయుడు

ఉద్రిక్తత.. అభిరుచి మధు భూమా వర్గీయుడు

నంద్యాలలోని సూరజ్ గ్రాండ్ హోటల్ వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మైనార్డీ నేత భాషా అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో టిడిపి నేత అభిరుచి మధు పాల్గొన్నారు. అభిరుచి మధు భూమా వర్గీయుడు

Recommended Video

Nandyal Bypoll : Cases Registered Against YS Jagan | Oneindia Telugu
గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు

గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు

హోటల్ వద్ద శిల్పా సోదరుల వర్గీయులు.. అభిరుచి మధు కారుపై రాళ్ల దాడి చేసినట్లుగా చెబుతున్నారు. దీంతో అభిరుచి మధు గన్‌మెన్ గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు.

హత్యాయత్నమని వైసిపి ఆరోపణలు

హత్యాయత్నమని వైసిపి ఆరోపణలు

శిల్పా వర్గీయులు అడ్డుకోవడం, టిడిపి నేత గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపిన సమయంలో శిల్పా చక్రపాణి రెడ్డి అక్కడే ఉన్నారు. దీంతో శిల్పా చక్రపాణి రెడ్డిని టార్గెట్‌గా కాల్పులు జరిపారని జగన్‌కు చెందిన సాక్షిలో ఆరోపణలు చేస్తున్నారు. చక్రపాణి రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని, ఆయన తృటిలో తప్పించుకున్నారని చెబుతోంది.

ఎన్నికల సమయంలో గన్‌మెన్

ఎన్నికల సమయంలో గన్‌మెన్

భూమా వర్గీయుడైన అభిరుచి మధుకు ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రభుత్వం గన్‌మెన్‌ను ఇచ్చిందని చెబుతున్నారు. రౌడీషీట్ ఉన్న అభిరుచి మధుకు గన్‌మెన్లను ఇవ్వడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.

ఏం జరిగిందంటే..!?

ఏం జరిగిందంటే..!?

మైనార్టీ నేత భాష అంత్యక్రియల్లో పలువురు పాల్గొన్నారు. ఆ సమయంలో అక్కడికి శిల్పా చక్రపాణి రెడ్డి కూడా వచ్చారని తెలుస్తోంది. ఆయనను వైసిపి నేతలు అడ్డుకున్నారు. ఈ సమయంలో శిల్పా వర్గీయులు.. మధు కారుపై రాళ్ల దాడి చేశారు. దీంతో మధు గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు.

English summary
Telugu Desam Party leader Abiruchi Madhu's gunmen fired five rounds into air in Nandyal on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X