వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోజా ఉంటే మహిళలు చెడిపోతారు, పైనా కిందా ఎక్కడ కొట్టాలి: అమర్నాథ్ సంచలనం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా లాంటి వాళ్లు రాష్ట్రంలో ఉంటే ఇక్కడ మహిళలు చెడిపోతారని టిడిపి నేత, మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Kakinada Municipal Corporation Elections : Chandrababu Naidu Strategy Planning

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా లాంటి వాళ్లు రాష్ట్రంలో ఉంటే ఇక్కడ మహిళలు చెడిపోతారని టిడిపి నేత, మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు.

నంద్యాలలో టిడిపి గెలిచిన తర్వాత జగన్ మాట్లాడారని, మాకు టైం వచ్చినప్పుడు కొడతామని, మాకు సమయం వస్తే ఇంకా కొడతామని అన్నారని, చంద్రబాబును గుద్దుతావా అని ప్రశ్నించారు.

రోజా కూడా బాగా మాట్లాడుతోందని, అప్ అండ్ డౌన్ అదరగొట్టాలని అంటున్నారని, పైనా కిందా కొట్టాలంటే తనకు తెలియదని, ఆమె నేర్పిస్తే నేర్చుకుంటానని అన్నారు. పైనా కిందా కొట్టు.. ఏం కొట్టాల పైనా కిందా.. ప్రజలు అప్ అండ్ డౌన్ కొట్టారన్నారు. కాకినాడలో అప్, నంద్యాలలో డౌన్.. అప్ అండ్ డౌన్ కొట్టారన్నారు.

నాలుగేళ్లకు జగన్ ఈ కారణం కనుగొన్నారు: హైకోర్టు తీవ్రంగా.., పాదయాత్రపై షాక్నాలుగేళ్లకు జగన్ ఈ కారణం కనుగొన్నారు: హైకోర్టు తీవ్రంగా.., పాదయాత్రపై షాక్

మా బాధ్యత పెరిగింది

మా బాధ్యత పెరిగింది

కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో టిడిపికి ప్రజలు పట్టం కట్టారని అమర్నాథ్ అన్నారు. ఈ విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వరుస విజయాలతో తమపై మరింత బాధ్యత పెరిగిందని ఆయన చెప్పారు.

టిడిపి గెలుస్తుందని ముందే చెప్పా

టిడిపి గెలుస్తుందని ముందే చెప్పా

కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి విజయం సాధిస్తుందని, మేయర్ అభ్యర్థి టిడిపి నేత అవుతారని తాను ముందుగానే చెప్పానని ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర రావు అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల ముందుకు వెళ్లామని, వాళ్లు దీవించారన్నారు.

అందుకే టిడిపిని గెలిపించారు

అందుకే టిడిపిని గెలిపించారు

మూడున్నరేళ్లలో కాకినాడ ఎంతో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర రావు అన్నారు. అలాగే భవిష్యత్తులో ఏం చేయబోతున్నామో చెప్పామని తెలిపారు. మరోవైపు స్మార్ట్ సిటీ వచ్చిందని, మంచి పరిపాలన అందుతుందని, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయని, అందుకే గెలిపించారన్నారు.

కాంగ్రెస్‌కు దారుణ పరాభవం

కాంగ్రెస్‌కు దారుణ పరాభవం

నంద్యాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కనీసం రెండు వేల ఓట్లు రాలేదు. ఇప్పుడు కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లోను కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురయింది. కాకినాడలో 48 డివిజన్లలో కలిసి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు కేవలం 602 మాత్రమే.

English summary
Telugu Desam Party leader Amarnath on Friday make hot comments on YSR Congress Party Nagari MLA Roja. He make controversial comments on woman MLA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X