వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.2 వేల కోట్లు కాదు.. రూ.51 వేలే, శ్రీనివాసరావు వద్ద మొత్తం ఇదేనంటోన్న జ్యోతుల నెహ్రూ

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ఓ రేంజ్‌లో ఫైరయయారు. ఐటీ దాడులు గురించి ప్రధానంగా నెహ్రూ ప్రస్తావించారు. ఐటీ దాడులు అభూత కల్పన అని కొన్ని కథనాలు రాస్తున్నారని పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

సత్యదూరం...

సత్యదూరం...

టీడీపీ, చంద్రబాబు నాయుడుపై జగన్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా 40 చోట్ల ఐటీ రైడ్స్ జరిగాయని.. కానీ తెలుగురాష్ట్రాల్లో జరిగినట్టు మీడియాలో చూపిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ శ్రీనివాస్ వద్ద దొరికింది రూ.51 వేలు అని క్లారిటీ ఇచ్చారు. కానీ రూ.2 వేల కోట్లు శ్రీనివాస్ వద్ద పట్టుబడినట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు. మొత్తం వ్యవహారంలో వైసీపీ నేతలు తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ఒక్కటి కూడా నిలవలేదు..

ఒక్కటి కూడా నిలవలేదు..

ఈడీ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న జగన్ వాటిని పారదర్శకంగా వ్యవహరించాలని జ్యోతుల నెహ్రూ సూచించారు. వైఎస్ హయాంలో తానేమి తప్పు చేయలేదని నిరూపించుకోవాలని సూచించారు. చంద్రబాబుపై అధికార పార్టీ 26 ఆరోపణలు చేశారని.. ఏ ఒక్కటి నిరూపించలేకపోయిందని చెప్పారు. కొన్ని కేసులను జగన్ వెనక్కి తీసుకున్నారని గుర్తుచేశారు. కానీ వైసీపీ మాత్రం నిరాధార ఆరోపణలతో టీడీపీ పేరు బాదనం చేసే ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ముఠా

ముఠా

కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతిపరులకే కాంట్రాక్టులు ఇస్తున్నారని జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతో రూ.750 కోట్లు మిగిలాయని చెబుతున్నారు.. ఇసుక పేరుతో రూ.500 కోట్లు దోచారని జ్యోతుల ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు జాప్యానికి జగనే కారణం అని విమర్శించారు. వైసీపీ రాజకీయ పార్టీ కాదని అదో ముఠా అని.. వైసీపీ నేతలు నీతులు వల్లించే ముందు.. తమ నోటిని శుద్ది చేసుకోవాలని సూచించారు.

English summary
tdp leader jyotula nehru fire on cm jagan mohan reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X