
లోకేష్ సైలెంట్ ఆపరేషన్ : నాని - వంశీపై టార్గెట్ ఫిక్స్ : లెక్క తేల్చాల్సిందే...!!
నారా లోకేష్. అనూహ్య మార్పు. ప్రసంగాలు ..పంచ్ లు.. ఎదురుదాడి.. సవాళ్లు..ఇలా గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తూ..ఇప్పుడు 2024 ఎన్నికల కోసం కొత్త అస్త్రాలతో..వ్యూహాలతో సిద్దం అవుతున్నారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి లో ఓటమి.. పార్టీ అనూహ్యంగా 23 సీట్లకు పడిపోవటం...తొలి సారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిన తనను వైసీపీ నేతలు అవహేళన చేయటం లోకేష్‌లో కసిని పెంచాయి. దీంతో..చంద్రబాబు వారుసుడిగా ఏ అంశంలోనూ వెనుకబడకూడదనే ఉద్దేశంతో పూర్తిగా మారిపోయారు. ప్రసంగాల నుంచి వ్యవహార శైలి వరకు అన్నింటా మార్పు కనిపిస్తోంది. కొంత కాలంగా పార్టీ అధినేత చంద్రబాబు పూర్తిగా పార్టీని 2024 ఎన్నికలకు సమాయత్తం చేసే పనిలో నిమగ్నమయ్యారు. లోకేష్ అధికార వైసీపీని టార్గెట్ చేసే బాధ్యతలు తీసుకున్నారు.

రూటు - మాట మార్చిన లోకేష్
ప్రభుత్వ నిర్ణయాలు.. వైసీపీ నేతల వ్యవహార శైలి పై లోకేష్ తక్షణమే స్పందిస్తున్నారు. ఎక్కడ కార్యకర్తల పై దాడులు జరిగినా.. కార్యకర్తల కుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్నా వెంటనే అక్కడ ప్రత్యక్షమవుతున్నారు. 2024 ఎన్నికల కోసం చంద్రబాబు ఇప్పటికే ఒక పక్కా స్ట్రాటజీతో సిద్దమయ్యారు. అయితే, పొత్తులు - తుది నిర్ణయాల విషయంలో మాత్రం ఆచి తూచి వ్యవహరించనున్నారు. 2024 ఎన్నికల వేళ..ఏ విధంగా వైసీపీకి ఛాన్స్ ఇవ్వకూడదనే బలమైన అభిప్రాయంతో ఉన్నారు. ఇక, లోకేష్ వచ్చే ఎన్నికల్లో యవతను రంగంలోకి దింపాలనే లక్ష్యంతో ఉన్నారు. సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తూనే..క్షేత్ర స్థాయిలో మాత్రం యువతకు ప్రాధాన్యత ఇచ్చేలా పార్టీ సీనియర్లను ఒప్పించే క్రమంలో వ్యూహాత్మకంగా ముందు నుంచే పావులు కదుపుతున్నారు. దీని ద్వారా వైసీపీతో సై అంటే సై అనే విధంగా పార్టీ యంత్రాంగం సిద్దంగా ఉంటుందనేది లోకేష్ వ్యూహం. అందులో భాగంగానే 40 శాతం టిక్కెట్లు యువతకే ఇచ్చేందుకు చంద్రబాబు సైతం ఇప్పటికే ప్రకటన చేసారు.

మంగళగిరిలో గెలవాలనే పట్టుదలతో
తాను 2019 ఎన్నికల్లో ఎక్కడైతే ఓడి తడబడ్డారో..అక్కడే నిలబడి వచ్చే ఎన్నికల్లో గెలిచి చూపిస్తానంటూ కార్యకర్తల సమక్షంలో లోకేష్ టీడీపీ అధినేత కు హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో కార్యకర్తలతో కొత్త కార్యక్రమాలతో మమేకం అవుతున్నారు. ఇక, తన ప్రసంగాల పైన గతంలో ఉన్న విమర్శలు ఇప్పుడు లేవు. లోకేష్ విమర్శల పైన వైసీపీ నేతలు స్పందించక తప్పటం లేదు. దీంతో పాటుగా.. టీడీపీ అధినేత చంద్రబాబు - తనను..తన తల్లి గురించి వ్యాఖ్యలు చేసిన వైసీపీ వాళ్లను వదిలేది లేదని స్పష్టం చేసిన లోకేష్ ఇప్పుడు దాని కోసం వ్యూహకర్తలతో కలిసి ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ప్రత్యేకించి గుడివాడలో కొడాలి నాని..గన్నవరంలో వల్లభనేని వంశీ పైన ఈ సారి కొత్త స్కెచ్ సిద్దం చేస్తున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది.

ఆ ఇద్దరినీ ఓడించాలనే లక్ష్యంతో
ఆ రెండు నియోజకవర్గాల్లో అసలు టీడీపీకి అభ్యర్ధులే లేరంటూ వైసీపీ ప్రచారం చేస్తున్న వేళ..ఊహించని విధంగా కొత్త అభ్యర్ధులను తెర మీదకు తెచ్చేందుకు రంగం సిద్దం అవుతోందని తెలుస్తోంది. పార్టీ నేతలను ఆ రెండు నియోజకవర్గాల్లో ముందు నుంచే మోహరించి.. పూర్తిగా పోలింగ్ బూత్ నుంచి ప్రజల్లో మమేకం అయ్యేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. గన్నవరంలో వంశీకి వ్యతిరేకంగా వైసీపీలో ఉన్న నేతలు సైతం ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీకి సహకరించమని చెబుతున్నారు. వీటన్నింటినీ తమకు అనకూలంగా మలచుకొనేందుకు స్కెచ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, కొద్ది రోజుల క్రితం గుడివాడలో జరగాల్సిన పార్టీ మినీ మహానాడు వాయిదా వెనుక వ్యూహం ఉందని తెలుస్తోంది.

కొత్త వ్యూహాలతో ముందుకు
గుడివాడ
నుంచి
నందమూరి
కుటుంబానికి
చెందిన
వారినే
పోటీలోకి
దించే
అంశం
పైన
పార్టీలో
చర్చ
వినిపిస్తోంది.
అయితే,
పొత్తుల
అంశం
పైన
క్లారిటీ
రాకుండా
ఎక్కడా
అధికారికంగా
అభ్యర్దులను
ప్రకటించకూడదనేది
పార్టీ
అభిప్రాయంగా
కనిపిస్తోంది.
కానీ,
ఈ
రెండు
నియోజకవర్గాల్లో
అనేక
కోణాల్లో
సర్వేలు
-
సమాచారం
ఎప్పటికప్పడు
తెప్పించుకుంటూ..
సూక్ష్మ
స్థాయిలో
లోకేష్
ప్రత్యేకంగా
ఫోకస్
చేసినట్లు
సమాచారం.
దీంతో..అక్టోబర్
లో
రాష్ట్ర
వ్యాప్తంగా
మీకోసం
యాత్రకు
సిద్దం
అవుతున్న
లోకేష్..
ఈ
రెండు
నియోజకవర్గాల
బాధ్యతను
మాత్రం
ప్రత్యేకంగా
తన
భుజస్కందాలపై
వేసుకున్నట్లు
తెలుస్తోంది.
మరి..
లోకేష్
ఆ
రెండు
నియోజకవర్గాల్లో
ఆ
ఇద్దరికీ
ఎలాంటి
కౌంటర్
ఇస్తారు..సక్సెస్
అవుతారా
అనేది
ఇప్పుడు
ఆసక్తి
కరంగా
మారుతోంది.