• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నిన్న సబ్బంహరి, ఇవాళ పట్టాభి - టీడీపీ అధికార ప్రతినిధి కారు ధ్వంసం - హైకోర్టు జడ్జి ఇంటి పక్కనే ఘటన

|

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష టీడీపీ నేతలపై అధికార వైసీపీ వరుస దాడులకు పాల్పడుతున్నదని, ప్రశ్నించిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టడంలేదని టీడీపీ అధికార ప్రతినిధి కొమర్రెడ్డి పట్టాభిరాం అలియాస్ పట్టాభి అన్నారు. విజయవాడలోని హైసెక్యూరిటీ జోన్ లో నివసిస్తోన్న పట్టాభి ఇంటిపై ఆదివారం అర్ధరాత్రి దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంట్లో ఉన్న కారు అద్దాలను పగులగొట్టారు. ఇది కచ్చితంగా అధికార వైసీపీ కిరాయి గుండాల పనే అని పట్టాభి ఆరోపించారు. అదీగాక..

చైనాలో కనీవినీ ఎరుగని దారుణం - ఒకేసారి 4వేల పెంపుడు జంతువులు బలి - తిండి, నీరు లేక..

హైకోర్టు జడ్జి ఇంటి పక్కనే..

హైకోర్టు జడ్జి ఇంటి పక్కనే..

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి బట్టు దేవానంద్ నివాసం పక్కనే తన ఇల్లు ఉందని.. హైకోర్టు జడ్జి ఇంటి ముందు 24 గంటలూ పోలీస్ పికెటింగ్ ఉంటుందని.. అలాంటి హైసెక్యూరిటీ జోన్ లో ఉన్న తన ఇంటిపైనే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ నేతలు కిరాయి గుండాలతో దాడిచేయించారని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. సాక్ష్యాత్తూ జడ్జిలు నివాసముందే ప్రాంతాల్లోనే బండరాళ్లతో దాడులు జరుగుతుంటే, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా అర్థమవుతున్నదని, ఏపీలో సామాన్యులకు కూడా రక్షణ లేదన్న సంగతి తేటతెల్లం అయిందని టీడీపీ నేత అన్నారు. అంతేకాదు..

నిన్న సబ్బంహరి.. ఇవాళ నాకు..

నిన్న సబ్బంహరి.. ఇవాళ నాకు..

‘‘ఏపీలో జరుగుతోన్న అఅవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే ప్రజల పక్షాన గట్టిగా వాణిని వినిపిస్తున్నందుకే.. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాకు బహుమానం ఇచ్చారు. నిన్ననే విశాఖపట్నంలో సబ్బంహరికి కూడా ఒక బహుమానాన్ని సీఎం అందించారు. ఈరోజు కొత్తగా నా కారును ధ్వంసం చేయించడం ద్వారా ఈ బహుమానాన్ని అందించారు. సబ్బంహరికి, నాకు మాత్రమే కాదు.. ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరికీ ఇలాంటి బహుమానాలే అందుతాయి..'' అని పట్టాభి వ్యాఖ్యానించారు. అయితే..

బీజేపీ అధ్యక్షుడి రాసలీలలు - కార్యకర్తతో నగ్న వీడియో - పోలీసుల బేరాలు - కరీంనగర్ ఘటనపై బండి ఫైర్

  Dubbaka By Elections 2020 : TRS ప్రభుత్వం దుబ్బాక కు చేసిందేమి లేదు, TDP కే గెలిచే హక్కు ఉంది : TTDP
  సీఎం జగన్‌, వైసీపీది పిరికి చర్య..

  సీఎం జగన్‌, వైసీపీది పిరికి చర్య..

  తెలుగుదేశం పార్టీ అడుగుతోన్న ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా లేకనే వైసీపీ దద్దమ్మలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇలాంటి దాడులు, బెదిరింపులకు దిగుతున్నారని పట్టాభి ఆరోపించారు. దమ్ముంటే సమాధానం చెప్పాలేకానీ, ఇలా ఇళ్లపై అర్ధరాత్రులు దాడులు చేయించి, బండరాళ్లతో కారును పగులగొట్టడం ద్వారా టీడీపీ నేతల నోరు మూయించాలనుకుంటే అది సాధ్యంకాదని సీఎం తెలుసుకోవాలన్నారు. ఈ దాడితో తనలో పట్టుదల పదింతలు పెరిగిందని, ప్రజల తరఫున ఇంకా గట్టిగా వైసీపీ సర్కారుపై పోరాడుతామని, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ ఇది చూడబోతున్నారని టీడీపీ నేత హెచ్చరించారు.

  English summary
  andhra pradesh Opposition Telugu Desam Party (TDP) spokesperson Kommareddy Pattabhiram alias Pattabhi's car was vandalized by unidentified persons. The car windows of his residence in Vijayawada were smashed at midnight on Sunday. Pattabhi alleged that it was an YSRCP act. He said that he was attacked for questioning the YSRCP's corrupt rule and that the same thing had happened to Sabbum Hari in Visakhapatnam yesterday. Pattabhi said it would have been better if Chief Minister Jagan had known that he could not keep his mouth shut by carrying out attacks.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X