వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చినజీయర్‌ను జగన్ ఎందుకు కలిశాడంటే: పవన్ కళ్యాణ్‌పై టిడిపి నేత తీవ్రవ్యాఖ్యలు

చినజీయర్ స్వామిని వైసిపి అధినేత వైయస్ జగన్ కలవడం ఆయన వ్యక్తిగతమని మంత్రి పితాని సత్యనారాయణ గురువారం అన్నారు. సూచనలు, సలహాల కోసం వెళ్లి ఉండవచ్చునని చెప్పారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: చినజీయర్ స్వామిని వైసిపి అధినేత వైయస్ జగన్ కలవడం ఆయన వ్యక్తిగతమని మంత్రి పితాని సత్యనారాయణ గురువారం అన్నారు. సూచనలు, సలహాల కోసం వెళ్లి ఉండవచ్చునని చెప్పారు.

జేసీ రాజీనామా: మూడో డిమాండ్-కమిషన్.. జగన్ పత్రిక సంచలనం?జేసీ రాజీనామా: మూడో డిమాండ్-కమిషన్.. జగన్ పత్రిక సంచలనం?

ఎన్నికలకు 2019 మే నెల వరకు గడువు ఉందని, అయితే కేంద్రం 2018 నాటికే ఎన్నికలకు వెళ్దామని సంకేతాలను ఇస్తోందని చెప్పారు. ఈసీ ఎప్పుడు ఎన్నికలు ప్రకటిస్తే అప్పుడు పోటీ చేసేందుకు తాము సిద్ధమన్నారు.

మానసికస్థైర్యం కోసమే

మానసికస్థైర్యం కోసమే

వైయస్ జగన్మోహన్ రెడ్డి మానసిక ప్రశాంతత, మానసిక స్థైర్యం కోసమే చినజీయర్‌ స్వామిని కలిశారని, రాజకీయాల కోసం వెళ్లలేదని భావిస్తున్నామని మంత్రి పితాని అన్నారు.

Recommended Video

Ys Jagan Seeks Blessings From Godmen Chinna Jeeyar Swami చినజీయర్‌ స్వామి తో జగన్ | Oneindia Telugu
జెండా కట్టిన పాపాన పోలేదు

జెండా కట్టిన పాపాన పోలేదు

పవన్ కళ్యాణ్ ఇంతవరకు పార్టీ పెట్టలేదని, జెండా కట్టిన పాపాన పోలేదని, బయటకు రాకుండా సమస్యలమీద మాట్లాడుతున్నారని పితాని సత్యనారాయణ అన్నారు. ఇప్పటి వరకు జెండా పట్టుకున్న కార్యకర్తను గానీ, నాయకుడిని కానీ చూడలేదన్నారు.

 వైసిపియే ప్రధాన ప్రతిపక్షం

వైసిపియే ప్రధాన ప్రతిపక్షం

పార్టీ నిర్మాణమే లేనప్పుడు జనసేన గెలుస్తుందని ఎలా అనుకుంటున్నారని పితాని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టిడిపికి, వైసిపికి మధ్యనే ప్రధానమైన పోటీ అని ఆయన అభిప్రాయపడ్డారు. వైసిపియే తమకు ప్రధాన ప్రతిపక్షమన్నారు.

 పవన్ గురించి ఆలోచించే టైం లేదు

పవన్ గురించి ఆలోచించే టైం లేదు

ఇంతవరకు కార్యకర్తలు, నాయకులతో నిర్మాణబద్ధమైన కార్యక్రమాన్ని తలపెట్టని పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి దిగితే అప్పుడు ఆ పార్టీ గురించి ఆలోచిస్తామని, మాట్లాడుతామని పితాని చెప్పారు. అసలు పవన్ గురించి మాట్లాడే సమయం తనకు లేదని హేళనగా అన్నారు.

English summary
TDP leader and minister Pitani Satyanarayana on Thursday said that YS Jaganmohan Reddy not met Chinajeeyar Swamy for politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X