prathipati pulla rao tdp Road accident guntur ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీ రోడ్డు ప్రమాదం నరసరావుపేట గుంటూరు politics
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు తప్పిన ప్రమాదం
గుంటూరు: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆదివారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి కారులో చిలకలూరిపేట బయలుదేరారు. నరసరావుపేట దాటిన తర్వాత ఓ ఇంజినీరింగ్ కాలేజీ మలుపులో ఉన్న పెట్రోల్ బంకు వద్ద లోపలికి వెళుతున్న బయటకు వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి.
కాగా, ఆ రెండు వాహనాలు ప్రత్తిపాటి వాహనాలు వాహనంపై పడ్డాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును పక్కకు తిప్పడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనాలో కారు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో స్వల్పంగా గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తనకు ఎలాంటి గాయాలూ కాలేదని మాజీ మంత్రి పుల్లారావు తెలిపారు.

టీడీపీ వాహనం దగ్ధం
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి ద్విచక్ర వాహనాలను
కృష్ణా జిల్లా నందిగా మండలం కంచెలలో కొందరు దుండగులు దగ్ధం చేశారు. గుర్తు తెలియని పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన పెన్న వెంకటలక్ష్మీ, ఆమె భర్త రమణ ద్విచక్ర వాహనాలను నిప్పంటించి దగ్ధం చేశారు.
శనివారం ఎన్నికల ప్రచారం ముగించుకుని ఇంటికి వచ్చిన దంపతులు వాహనాలను ఇంటి ముందు పార్కింగ్ చేశారు. అర్ధరాత్రి తర్వాత పెద్ద శబ్ధంతోపాటు మంటలు రావడంతో బయటికి వచ్చి చూసేసరికి వాహనాలు కాలిపోయి ఉన్నాయని బాధితులు తెలిపారు. ఘటనపై బాధితురాలు వెంకటలక్ష్మీ ఘటనపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.