గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుంటూరు:ప్రత్యేక హోదా కోసం...టిడిపి నేత వినూత్న నిరసన!

|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం శాప్ మాజీ ఛైర్మన్...టిడిపి నాయకుడు పీఆర్ మోహన్ వినూత్న నిరసన చేపట్టారు. గుంటూరు కు చెందిన పీఆర్ మోహన్ లక్ష్మీపురంలోని మదర్ థెరిస్సా జంక్షన్ వద్ద క్రేన్ నుంచి 20 అడుగుల ఎత్తున తలకిందులుగా వేలాడుతూ కేంద్ర ప్రభుత్వానికి తన నిరసన తెలిపారు.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

అయితే ఈ ప్రదర్శనకు ముందు కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భధ్రత రీత్యా మొదట ఈ నిరసన ప్రదర్శనకు అంగీకరించలేదు. అయితే టిడిపి నేత మోహన్ తన కోసం అంబులెన్సు, వైద్య సహాయం ఏర్పాటు చేసుకోవడంతో ఆ తర్వాత ఆందోళనకు అనుమతించారు.

TDP leaders innovative protest for special status

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

విభజనతో అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ఈ సందర్భంగా మోహన్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విభజనతో కుదేలైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అహర్నిశలు శ్రమిస్తుంటే...ప్రధాని నరేంద్ర మోడీ మొండిచేయిు చూపడం ఆంధ్ర ప్రజలను దారుణంగా ఆవమానించడమేనన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన హామీల నెరవేర్చడం చేయాలని టిడిపి నేత మెహన్ డిమాండ్ చేశారు.

English summary
A TDP leader in Guntur demanded for a special status to Andhra Pradesh with an innovative protest. Hanging from crane at the height of 20 he casts his protest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X