వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్ కారణంగానే పవన్ టీడీపీకి దూరమయ్యారన్న టిడిపి నేత సంచలనం

|
Google Oneindia TeluguNews

Recommended Video

లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బుచ్చయ్య చౌదరి || TDP Leader Butchaiah Chowdary Comments On Lokes

తెలుగుదేశం పార్టీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ మధ్య చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల పార్టీ వీడి వెళ్ళిన సొంత పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బుచ్చయ్య చౌదరి తాజాగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండటానికి కారణం లోకేష్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు బుచ్చయ్య చౌదరి .

పవన్ కళ్యాణ్ టీడీపీకి దూరం అవటానికి కారణం చెప్పిన టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి

పవన్ కళ్యాణ్ టీడీపీకి దూరం అవటానికి కారణం చెప్పిన టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి


రాజ్యసభ ఎంపీలు పార్టీ మారడం, ప్రజావేదిక కూల్చివేతపై సంచలన వ్యాఖ్యలు చేసిన బుచ్చయ్య చౌదరి జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై తెల్ల ఏనుగులకు టీడీపీలో స్థానం ఉండదని ఆయన పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. ప్రజావేదిక కూల్చివేతపై మాట్లాడిన ఆయన అవినీతి కేసుల ఆరోపణలు ఎదుర్కొంటోన్న జగన్ అవినీతి వ్యతిరేకమని ప్రకటనలు చేయడం హాస్యస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.ఇక రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరడం దారుణమన్నారు. ఇక తాజాగా టిడిపి సీనియర్ నాయకుడు బుచ్చయ్య చౌదరి 2019 ఎన్నికలకు ఏడాది ముందు టిడిపికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ చేసిన తిరుగుబాటుకు వెనుక గల కారణాలను సైతం విశ్లేషించారు.

పవన్ , బీజేపీ నేత రామ్ మాధవ్ ల రహస్య భేటీ .. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ పవన్ , బీజేపీ నేత రామ్ మాధవ్ ల రహస్య భేటీ .. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్

భవిష్యత్ సిఎంగా నారా లోకేష్ ను ప్రొజెక్ట్ చేయడం వల్లనే పవన్ కళ్యాణ్ టీడీపీకి దూరమని వ్యాఖ్య

భవిష్యత్ సిఎంగా నారా లోకేష్ ను ప్రొజెక్ట్ చేయడం వల్లనే పవన్ కళ్యాణ్ టీడీపీకి దూరమని వ్యాఖ్య

భవిష్యత్ సిఎంగా నారా లోకేష్ ను ప్రొజెక్ట్ చేయడం వల్లనే పవన్ కళ్యాణ్ టీడీపీకి దూరం అయ్యారని ఆయన షాకింగ్ కామెంట్ చేశారు . లోకేష్‌ సీఎం అన్న అంశంపై విబేధించిన పవన్ ప్రజలు లోకేష్ కు వ్యతిరేకంగా ఇచ్చిన నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ను ఆయన విశ్వసించారని పేర్కొన్నారు . అప్పటి నుండి, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ టిడిపికి వ్యతిరేకంగా యుద్ధం చేశాడని బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఇది కుల సమీకరణ మార్పుకు దారితీసింది అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు .

 చంద్రబాబు రాజకీయ వారసుడిగా లోకేష్ ను ప్రకటించటమే పవన్ పార్టీకి దూరం అవటానికి కారణం అన్న బుచ్చయ్య చౌదరి

చంద్రబాబు రాజకీయ వారసుడిగా లోకేష్ ను ప్రకటించటమే పవన్ పార్టీకి దూరం అవటానికి కారణం అన్న బుచ్చయ్య చౌదరి


ఒక చానల్ కు ఇచ్చిన ఇంటర్ వ్యూలో ఆయన ఇలా ప్రస్తావించారు. ఏపీలో బిసి కమ్యూనిటీ టిడిపికి వెన్నెముకగా ఉండేదని కానీ టీడీపీ 35 ఏళ్ల పాత పార్టీకి వ్యతిరేకంగా ఈ సారి బీసీలు వైసీపీని ఆదరించారని పేర్కొన్నారు. నారా లోకేష్ టిడిపి పగ్గాలు చేపట్టడాన్ని చూడాలనుకున్న చంద్రబాబు నాయుడు తన రాజకీయ వారసుడిగా లోకేష్ ను ప్రకటించటమే కొంప ముంచిందని బుచయ్య చౌదరి స్పష్టం చేశారు . సీనియర్ నాయకుడు అయిన బుచ్చయ్య చౌదరి వ్యక్తం చేసిన అభిప్రాయాలు సొంత పార్టీ నేతల్లో కూడా వున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

English summary
TDP Senior Leader Butchaiah Chowdary analysed the reasons behind the revolt of Pawan Kalyan against TDP an year before the 2019 Elections. 'Projecting Nara Lokesh as the future CM hasn't gone down well with Pawan Kalyan. He trusted the negative feedback given against Lokesh. Ever since then, Jana Sena Chief waged a war against TDP and this led to change of caste equation,' he opined.The Legislator told BC Community which used to be the backbone of TDP turned against the 35-Year-Old Party due to high priority given by the State Government to the Kapu Community. He cited Reservations and Rs 1,000 crore fund for Kapus distanced majority of the BCs from TDP.Butchaiah Chowdary has to clarify whether he wishes to see Nara Lokesh take over the reins of TDP or someone else must be the political successor of Chandrababu Naidu. The views expressed by the Senior Leader doesn't rule out the fact that majority of the TDP Leaders aren't okay with the prominence Lokesh has been receiving in the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X