andhra pradesh visakhapatnam tdp vangalapudi anitha ys jagan tweet controversy comments ysrcp విశాఖపట్నం టీడీపీ వంగలపూడి అనిత వివాదం వ్యాఖ్యలు వైఎస్సార్సీపీ politics
ఆ ఒక్క ట్వీట్‌తో జగన్ పరువంతా తీసిన అనిత- పులివెందుల పులి టైటిల్‌పై
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. ప్రత్యర్ధులను కించపరిచేలా తీవ్రమైన భాష వాడుతూ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, ట్వీట్లు పరాకాష్టకు చేరుతున్నాయి. ఇదే క్రమంలో సీఎం జగన్‌ను ఉద్దేశించి టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత చేసిన ట్వీట్‌లోనూ ఇలాంటి భాషా ప్రయోగాలే చోటు చేసుకున్నాయి. దీంతో ఈ ట్వీట్ వివాదాస్పదంగా మారింది.
సీఎం జగన్ వైఫల్యాలను ప్రస్తావిస్తూ టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత చేసిన ట్వీట్లో పలు అంశాలను ప్రస్తావించారు. ఇందులో తాజాగా ఏబీఎన్, టీవీ5 వంటి ఛానళ్లను ప్రభుత్వం ఎంఎస్‌వోలపై ఒత్తిడి చేసి ఆపించడం, అమరావతిలో జగన్ కాన్వాయ్ వెళ్లే సమయంలో వాడుతున్న భద్రత, ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు చేస్తున్న సోషల్ మీడియా పోస్టులు, ప్రెస్ మీట్లు పెట్టేందుకు జగన్ ఆనాసక్తత, దళితులపై దాడులు, విశాఖ ఉక్కుపై కేంద్రాన్ని నిలదీయలేని నిస్సహాయత ఇలా పలు అంశాలు ఉన్నాయి. ఇవన్నీ ఓ ఎత్తయితే చివర్లో అనిత ఇచ్చిన ఫినిషింగ్ డైలాగ్ మరీ దారుణంగా ఉంది.

సీఎం జగన్‌ను వైసీపీ నేతలు, కార్యకర్తలు పులివెందుల పులి అంటూ ప్రస్తావిస్తుంటారు. పులివెందులలో వైఎస్ కుటుంబం హవా, వరుస విజయాల నేపథ్యంలో జగన్ ప్రస్తావన వచ్చినప్పుడు పులివెందుల పులిగా అభివర్ణిస్తుంటారు. ఇప్పుడు అదే అంశాన్ని పట్టుకుని రాష్ట్రంలో ఇన్ని వైఫల్యాలు పెట్టుకుని దాక్కుంటున్న జగన్‌కు పులివెందుల పులి అంటూ జాకీలు వేసి లేపుతారా అని వైసీసీ నేతలను ప్రశ్నించేలా అనిత ట్వీట్ ఉంది. పులివెందుల పులి టైటిల్‌నే టార్గెట్ చేసేలా ఉన్న అనిత ట్వీట్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.