'వైసిపి నేతలారా! వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించండి, కంచె ఐలయ్యకు జగన్‌కు తేడా లేదు'
సాగునీటి అంశంపై వైసిపి అధినేత జగన్ సాక్షి పత్రిక విషపూరిత రాతలు రాస్తోందని మంత్రి పత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఆ పత్రిక రాతలున్నాయన్నారు.
హైదరాబాద్: సాగునీటి అంశంపై వైసిపి అధినేత జగన్ సాక్షి పత్రిక విషపూరిత రాతలు రాస్తోందని మంత్రి పత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఆ పత్రిక రాతలున్నాయన్నారు.

రాయలసీమకు నీళ్లిస్తే జగన్ ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారు
రాయలసీమకు నీళ్లిస్తే జగన్ ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. రాయలసీమ ప్రజలకు జగన్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంటింటికీ టిడిపి వినతులకు మూడు నెలల్లో పరిష్కారం లభించనుందన్నారు.

జగన్‌ను వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించండి
వైసిపి అధినేత జగన్‌ను పిచ్చాసుపత్రిలో చేర్పించే సమయం ఆసన్నమైందని కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. వైసిపి నాయకులు చొరవ తీసుకొని ఆయనకు సకాలంలో చికిత్స అందించాలన్నారు.

జగన్‌ను ఎప్పుడు అరెస్టు చేస్తారో తెలియదు
ఏ రోజు జైలు నుంచి పిలుపు వస్తుందో, ఎప్పుడు అరెస్టు చేస్తారో తెలియక జగన్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని సోమిశెట్టి విమర్శలు గుప్పించారు. ప్రాంతీయ విభేదాలు, కులాల మధ్య చిచ్చుపెట్టడమే జగన్ పని అని, రాయలసీమవాసిగా సీఎం చంద్రబాబు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు శ్రమిస్తుంటే సీమద్రోహిగా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

జగన్‌కు, కంచ ఐలయ్యకు తేడా లేదు
కులాల మధ్య చిచ్చుపెట్టటంలో జగన్‌కు, కంచ ఐలయ్యకు పెద్ద వ్యత్యాసం లేదని సోమిశెట్టి అన్నారు. కంచ ఐలయ్యపై రాష్ట్రవ్యాప్తంగా అందే ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇంట్లో సోదాలు చేయమనడం సరికాదు
రాజ్యసభ సభ్యులు, టిడిపి నేత టీజీ వెంకటేష్ ఇంటిని సోదాలు చేయాలని కంచ ఐలయ్య డిమాండ్ చేయడం సమంజసంకాదని సోమిశెట్టి హితవు పలికారు.












Click it and Unblock the Notifications