వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి టిడిపి బస్సు యాత్ర: మహిళ కంటతడి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

నల్గొండ: తెలంగాణ సిఎం కెసిఆర్ అసమర్థత వల్లే రాష్ట్రంలో కరెంట్ కష్టాలతో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ దశలో రైతులకు అండగా ఉండి వారిలో ఆత్మస్థైర్యం కల్గించేందుకే బస్సుయాత్ర చేపట్టామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. టిడిపి ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్రకు శుక్రవారం నల్గొండ జిల్లా నుండి శ్రీకారం చుట్టారు.

టిడిపి ఎంపి, ఎమ్మెల్యేలతో పాటు రాష్టప్రార్టీ ముఖ్యనాయకులు తొలుత చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం, చిట్యాల మండలం వెలిమినేడు గ్రామాల్లో కరెంట్ కోతలతో ఎండిన పంట పొలాలను పరిశీలించారు. ఆ తర్వాత నార్కట్‌పల్లి మండలం కొండపాకానిగూడెంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు సత్తిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం సూర్యాపేట పాత బస్టాండ్ వద్ద రైతు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్‌ కోతలతో పంటలు ఎండిపోయి టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన మూడు మాసాల్లోనే 200మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. ఇందుకు చలించి తాము ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బస్సుయాత్రకు స్వీకారం చుట్టామన్నారు. తాము ఆందోళనకు పూనుకోవడంతో ప్రజల్లో వ్యతిరేకత అధికమవుతుందని భావించి సిఎం కెసిఆర్ విద్యుత్ సమస్యపై డిల్లీకి వెళ్లారన్నారు.

టిడిఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. తాము రాజకీయం చేసేందుకు దీక్ష చేయడం లేదని ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు భరోసా ఇచ్చేందుకు ఆందోళన చేపడుతున్నామన్నారు. ప్రభుత్వానికి చేతకాకపోతే విద్యుత్ సంస్థను తమకు అప్పగిస్తే పక్క రాష్ట్రాల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసి రైతాంగానికి 9గంటల విద్యుత్‌ను అందిస్తామని లేనిపక్షంలో తామంతా రాజకీయ సన్యాసం చేస్తామని సవాల్ విసిరారు.

టిడిఎల్పీ ఉప నేత రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరెంట్‌ కోతలతో రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతూ, కన్నీళ్లు పెట్టుకుంటుంటే కెసిఆర్ మాత్రం కళ్ల పరీక్షల కోసం ఢిల్లీకి వెళ్లాడని విమర్శించారు. రైతులు సమస్యలతో అల్లాడుతుంటే కెటిఆర్ మాత్రం సినీతారలతో క్యాట్ వాక్ చేస్తుండడం సిగ్గుచేటన్నారు.

నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి పటేల్ రమేష్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో ఎంపీలు గుండు సుధారాణి, మల్లారెడ్డి, గరికెపాటి మోహన్‌రావు, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, సాయన్న, గాంధి, మాగంటి గోపి, అరవింద్‌ కుమార్, ప్రకాశ్, మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్‌కుమార్ గౌడ్, రమేష్ రాథోడ్, సండ్ర వెంకటవీరయ్య, రాజేందర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు ఉమా మాధవరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు బిల్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

వెలిమినీడులో రైతుతో..

వెలిమినీడులో రైతుతో..

తెలంగాణ సిఎం కెసిఆర్ అసమర్థత వల్లే రాష్ట్రంలో కరెంట్ కష్టాలతో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ దశలో రైతులకు అండగా ఉండి వారిలో ఆత్మస్థైర్యం కల్గించేందుకే బస్సుయాత్ర చేపట్టామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు.

కొండపాకగూడెంలో మహిళా రైతుకు సాయం

కొండపాకగూడెంలో మహిళా రైతుకు సాయం

నార్కట్‌పల్లి మండలం కొండపాకానిగూడెంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు సత్తిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.

కంటతడి పెట్టిర మహిళా రైతు

కంటతడి పెట్టిర మహిళా రైతు

టిడిపి ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్రకు శుక్రవారం నల్గొండ జిల్లా నుండి శ్రీకారం చుట్టారు.

కొయ్యలగూడెంలో..

కొయ్యలగూడెంలో..

టిడిపి ఎంపి, ఎమ్మెల్యేలతో పాటు రాష్టప్రార్టీ ముఖ్యనాయకులు తొలుత చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం, చిట్యాల మండలం వెలిమినేడు గ్రామాల్లో కరెంట్ కోతలతో ఎండిన పంట పొలాలను పరిశీలించారు.

సూర్యాపేటలో ధర్నా

సూర్యాపేటలో ధర్నా

అనంతరం తెలుగుదేశం నేతలు సూర్యాపేట పాత బస్టాండ్ వద్ద రైతు ధర్నా నిర్వహించారు.

సూర్యాపేటలో ధర్నా

సూర్యాపేటలో ధర్నా

ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్‌ కోతలతో పంటలు ఎండిపోయి టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన మూడు మాసాల్లోనే 200మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు.

సూర్యాపేటలో ధర్నా

సూర్యాపేటలో ధర్నా

ఇందుకు చలించి తాము ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బస్సుయాత్రకు స్వీకారం చుట్టామన్నారు. తాము ఆందోళనకు పూనుకోవడంతో ప్రజల్లో వ్యతిరేకత అధికమవుతుందని భావించి సిఎం కెసిఆర్ విద్యుత్ సమస్యపై డిల్లీకి వెళ్లారన్నారు.

సూర్యాపేటలో ధర్నా

సూర్యాపేటలో ధర్నా

టిడిఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. తాము రాజకీయం చేసేందుకు దీక్ష చేయడం లేదని ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు భరోసా ఇచ్చేందుకు ఆందోళన చేపడుతున్నామన్నారు.

English summary
Telangana TDP leaders have launched bus yatra from NTR trust bhavan in Hyderabad on Oct 10, Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X