వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి ఎంపి జీవీఎల్‌ కు సీఎం రమేష్‌ ఛాలెంజ్...మండిపడ్డ డొక్కా

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అమరావతి:ఎపి ప్రభుత్వం పిడి అకౌంట్ల కుంభకోణానికి పాల్పడినట్లు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు చేసిన ఆరోపణల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది.
తాజాగా జివిఎల్ ఆరోపణలపై ఇద్దరు టిడిపి నేతలు ఘాటుగా స్పందించారు.

పీడీ అకౌంట్స్‌పై జీవీఎల్‌ బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ ఎంపి సిఎం రమేష్ సవాలు విసిరారు. పిడి అకౌంట్లపై సిబిఐ విచారణ జరిపించాలని బిజెపి నేతలు ఎపి ప్రభుత్వాన్ని కోరడాన్ని ఆయన తప్పుబట్టారు. మరోవైపు ఏపీ ప్రభుత్వంపై ఎంపి జీవీఎల్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని టిడిపి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ దుయ్యబట్టారు.

TDP leaders challenge to BJP MP GVL

ఎంపి జివిఎల్ ఆరోపణల విషయమై న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన టిడిపి ఎంపి సిఎం రమేష్ పీడీ అకౌంట్స్‌పై జీవీఎల్‌ బహిరంగ చర్చకు సిద్ధమా?...అని ఛాలెంజ్ చేశారు. ఏపీలో అభివృద్ధిని చూసి ఓర్వలేక సీఎం చంద్రబాబుపై జీవీఎల్‌ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పీడీ అకౌంట్స్‌లో అవినీతి నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని, నిరూపించలేకపోతే ఏ శిక్షకైనా జీవీఎల్‌ సిద్ధమా? అని సిఎం రమేష్ ప్రశ్నించారు.

అయినా పిడి అకౌంట్లపై సిబిఐతో విచారణ చేయించాలనుకుంటే టీడీపీ అనుమతి కావాలా?...వారే అధికారం లోవున్నారు కదా అని ఆయన ప్రశ్నించారు. తాము బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతామని, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని అధికారంలోకి రానివ్వమని సిఎం రమేష్ స్పష్టం చేశారు.

మరోవైపు ఎంపి జీవీఎల్ నరసింహారావుపై టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వంపై జీవీఎల్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. దేశంలో ప్రతీ రాష్ట్రానికి పీడీ అకౌంట్స్ ఉంటాయని డొక్కా చెప్పారు. కానీ జీవీఎల్ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనే ఆరోపణలు చేయడం దురదృష్టకరమని అభివర్ణించారు.

పీడీ అకౌంట్స్‌పై కాగ్ ఎపికే కాక అన్ని రాష్ట్రాలకు తన అభిప్రాయాన్ని చెప్పిందన్నారు. అవసరమైతే పీడీ అకౌంట్స్‌పై కేంద్ర ప్రభుత్వం విచారణ చేసుకోవచ్చని డొక్కా చెప్పారు. ఎలాంటి విచారణకు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఏపీలో బీజేపీకి నూకలు లేవని...అందుకోసమే జివిఎల్ ప్రతిపక్షానికి అనుకూలంగా పనిచేస్తున్నారని డొక్కా ఆరోపించారు.

కేరళలో విపత్కర పరిస్థితులు ఏర్పడితే కేంద్రం దానిపై కూడా దుష్ప్రచారం చేస్తోందని డొక్కా దుయ్యబట్టారు. ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్‌ నాయర్ మరణంపై తీవ్ర సంతాపం తెలియజేస్తున్నామని...ఎమర్జెన్సీ సమయంలో నాయర్ తన ఆర్టికల్స్‌తో దేశానికి ఎన్నో మంచి విషయాలు తెలియజేశారని డొక్కా గుర్తుచేశారు.

English summary
Amaravathi: The TDP leaders are blaming BJP MP GVL for his alligations over AP Government about PD accounts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X