కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిత్య పెళ్లికొడుకు: పవన్‌పై 'సీఎం' తీవ్రవ్యాఖ్యలు, 'బెడ్రూంలో కూర్చోబెట్టి మాట్లాడటం వెనుక..'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

పవన్ పై విరుచుకుపడ్డ సి ఎం రమేష్

కడప: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు రాగానే పవన్ పచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నారన్నారు. జీలకర్రలో కర్రలేనట్లుగా పిచ్చి ప్రేలాపణలు పేలుతున్నారన్నారు.

పవన్ కళ్యాణ్ పేరులో ఉన్న కళ్యాణ్‌ ఉంటే నిత్య పెళ్ళి కుమారుడని ఎద్దేవా చేశారు. బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆయన మండిపడ్డారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల ఆగ్రహం ముందు మసి కాక తప్పదన్నారు. పిచ్చి ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

నేను చెప్పినట్లు అతిపెద్ద స్కాం బయటకొస్తుంది, పవన్ కళ్యాణ్‌ను చూసి నేర్చారు: కుటుంబరావునేను చెప్పినట్లు అతిపెద్ద స్కాం బయటకొస్తుంది, పవన్ కళ్యాణ్‌ను చూసి నేర్చారు: కుటుంబరావు

 బెడ్రూంలో కూర్చోబెట్టుకొని మాట్లాడటం ఏమిటి?

బెడ్రూంలో కూర్చోబెట్టుకొని మాట్లాడటం ఏమిటి?

హేతుబద్దత లేకుండా విభజన చేసి కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని, రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని శ్రీవేంకటేశ్వరస్వామి సాక్షిగా హామీ ఇచ్చిన బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం మోసం చేసిందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, నిజాయితీపాలన అందించే చంద్రబాబుకు మోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడని, 11 కేసుల ఆర్థిక నేరగాడు జగన్‌ను బెడ్రూంలో కూర్చోబెట్టుకుని మాట్లాడడం వెనుక ఉన్న చీకటి ఒప్పందం బహిర్గతమైందన్నారు.

చంద్రబాబు పిలుపుతో కర్ణాటక తెలుగు ప్రజల గుణపాఠం

చంద్రబాబు పిలుపుతో కర్ణాటక తెలుగు ప్రజల గుణపాఠం

చంద్రబాబు కేంద్రం నికంకుశ వైఖరిని ఎండగడుతూ ధర్మపోరాటం చేస్తున్నారని సోమిరెడ్డి అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, సహకరించకపోయినా ప్రజల సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నవ నిర్మాణ దీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు పిలుపుతో కర్ణాటక ఎన్నికల్లో తెలుగువారు బీజేపీకి గట్టిగా గుణపాఠం చెప్పారన్నారు.

ఉప ఎన్నికలు రాకుండా జాప్యం

ఉప ఎన్నికలు రాకుండా జాప్యం

ఉప ఎన్నికలు రాకుండా ఉండేలా జాప్యం చేస్తూ రాజీనామాల వ్యవహారాన్ని నడిపిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజరూపం ప్రజలకు అర్థమైందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వవమని 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ చెప్పిందని బీజేపీ నేతలు చెప్పడం హాస్యాస్పదం అన్నారు. రాష్ట్ర ప్రజలు ఓటు వేసింది.. నీకా, కమిషన్‌కా అని మోడీని ప్రశ్నించారు. మోడీ, అమిత్ షాల వికృత రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడనున్నారన్నారు.

రాజధాని లేకుండా వచ్చాం, ఆదుకోవడం లేదు

రాజధాని లేకుండా వచ్చాం, ఆదుకోవడం లేదు

రాజధాని లేకుండా అప్పుతో నిలబడిన రాష్ట్రాన్ని ఆదుకోవడం లేదని, పైగా టీడీపీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కేంద్రంపై శాసన మండలి విప్ రామసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాలుగేళ్లు చూసి బయటకు వచ్చారన్నారు. విభజన హామీలను, కడప ఉక్కు కర్మాగారాన్ని సాధించుకుంటామని చెప్పారు.

English summary
Telugudesam Party leaders CM Ramesh, Somireddy Chandramohan Reddy fired at Jana Sena chief Pawan Kalyan and YS Jagan Mohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X