వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ గెలిస్తేనే ఈవీఎంలను అనుమానించాలి.. లేదంటే అంతా ఓకే.. టీడీపీ హ‌రి ప్ర‌సాద్ వింత వాద‌న‌..!

|
Google Oneindia TeluguNews

ఈ ఎన్నిక‌ల్లో టిడిపి గెలుపు ఖాయం. ఇవియం లోపాల గురించే మా పోరాటం. ఏపి ఎన్నిక‌ల్లో వైసిపి గెలిస్తే ఇవియం ల‌ను అనుమానించాల్సిందే..ఇదీ టిడిపి సాంకేతిక స‌ల‌హాదారుడు వేమూరి హ‌రి ప్ర‌సాద్ వాద‌న‌. తాజాగా ఓ టివి ఛాన‌ల్ లో చ‌ర్చ‌లో భాగంగా ఏపి ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు..ఇవియం ల ప‌నితీర‌కు లింకు పెడుతూ ఆయ‌న మాట్లాడిన విధానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వైసిపి గెలిస్తే..ఇవియంల పైనే అనుమానాలు..

వైసిపి గెలిస్తే..ఇవియంల పైనే అనుమానాలు..

ఇవియంల పైన చంద్ర‌బాబు చేస్తున్న ఆరోప‌ణ‌ల పై ఓ టివి ఛాన‌ల్ లో చ‌ర్చ నిర్వ‌హించారు. అందులో టిడిపి అధినేత చంద్ర‌బాబుకు సాంకేతిక స‌ల‌హాదారుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న వేమూరి హ‌రి ప్ర‌సాద్ చేసిన వాద‌న ఇప్పుడు పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజులుగా టిడిపి అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల సంఘం పైనా ..ఇవియంల నిర్వ‌హ‌ణ పైనా ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఇవియంలు ఎవ‌రైనా మేనేజ్ చేయ‌వ‌చ్చ‌ని..వీవీ ప్యాట్స్‌ను 50 శాతం లెక్కించాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విష‌యంలో కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌తో స‌మావేశం స‌మ‌యంలోనూ చంద్ర‌బాబు స్ప‌ష్టం చేసారు. దీంతో..ఎన్నిక‌ల సంఘం ఇవియంల పైన చ‌ర్చ‌కు సిద్ద‌మ‌ని..అయితే, అందులో టిడిపి నుండి హ‌రి ప్ర‌సాద్ కాకుండా మ‌రో నిపుణుడిని పంపాల‌ని సూచించింది. హ‌రి ప్ర‌సాద్ పైన ఇవియం చోరీ కేసు ఉన్నందున అత‌నితో చ‌ర్చించ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది.

టిడిపి ఖ‌చ్చితంగా గెలుస్తుంది..

టిడిపి ఖ‌చ్చితంగా గెలుస్తుంది..

ఏపి లో టిడిపి తిరిగి ఖ‌చ్చితంగా అధికారంలోకి వ‌స్తుంద‌ని చ‌ర్చ‌లో పాల్గొన్న హ‌రి ప్ర‌సాద్ చెప్పుకొచ్చారు. ఇవియంను హ్యాక్ చేయ‌టం సుల‌భ‌మ‌ని..సాంకేతికంగా సాధ్య‌మేన‌ని వాదించారు. అయితే, ఇవియంను ట‌చ్ చేయ‌కుండా హ్యాక్ చేయ‌టం సాధ్యం కాద‌ని ఆ చ‌ర్చ‌లో తేల్చారు. అయితే, మ‌హారాష్ట్ర లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఆర్టీఐ చ‌ట్టం ప్ర‌కారం ఇవియంలు హ్యాక్ అయ్యాయా అనే ప్ర‌శ్న‌కు అక్క‌డి క‌లెక్ట‌ర్ అవును ఇవియంలు హ్యాక్ అయ్యాయంటూ అంగీక‌రించిన విష‌యం ప్ర‌చురించిన ఓ అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. వీవీప్యాట్స్ 50 శాతం లెక్కించాల‌నేది త‌మ డిమాండ్ అని చెబుతూనే..ఏపిలో మాత్రం గెలుపు పై ఢోకా లేద‌న్నారు. అయితే, ఏపిలో ఇవియంల‌ను మేనేజ్ చేసారా అనే ప్ర‌శ్న‌కు ఆ అవ‌స‌రం లేద‌ని చెప్పుకొచ్చారు.

వైసిపి గెల‌వ‌దు..ఇవియంల‌ను మేనేజ్ అయిన‌ట్లే..

వైసిపి గెల‌వ‌దు..ఇవియంల‌ను మేనేజ్ అయిన‌ట్లే..

ఏపిలో వైసిపి గెలిచే అవ‌కాశ‌మే లేద‌ని..టిడిపి తిరిగి అధికారంలోకి వ‌స్తుంద‌ని హ‌రి ప్ర‌సాద్ ధీమా వ్య‌క్తం చేసారు. ఏపి లో వైసిపి అధికారంలోకి వ‌స్తే మాత్ర ఇవియం ల‌ను మేనేజ్ చేసిన‌ట్లు భావించాల్సి ఉంటుంద‌నే అభిప్రాయం వ్య‌క్తం చేసారు. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లే పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ చ‌ర్చ‌లు ప్రారంభించాయి. ఇవియం మేజేన్ చేయ‌వ‌చ్చ‌ని స్ప‌ష్టంగా చెబుతున్న టిడిపి తాము గెలిస్తే ఇవియంలు మేనేజ్ కాలేద‌ని..వైసిపి గెలిస్తే మాత్రం ఇవియంలు మేనేజ్ అయిన‌ట్లు భావించాల్సి ఉంటుంద‌ని చెప్ప‌టం ద్వారా ప్ర‌జ‌ల‌కు ఏం సంకేతం ఇవ్వాల‌నుకుంటున్నార‌నే దాని పైన చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌ట‌పికే టిడిపి అధినేత ఓట‌మికి కార‌ణాలు వెతుక్కోవ‌టంలో భాగంగానే ఇవియంల పైన రాద్దాంతం చేస్తున్నార‌ని వైసిపి నేత‌లు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఏపి ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇవియంల చుట్టూ తిరుగుతున్నాయి.

English summary
AP Elections Results rounding EVM's contradiction. TDP Technical adviser Vemuru Hari Prasad says in TV discussion that if YCP win in AP elections then to be suspect EVM's working. Now this comments became hot topic in AP political circles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X