వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉండవల్లిలోని బాబు ఇంటి విషయంలో కేసీఆర్ చెప్పిందే నిజమా..? అదే కొంప ముంచిందా..? టీడీపీ నేతల్లో చర్చ

|
Google Oneindia TeluguNews

చంద్రబాబునాయుడు నివాసం గురించి తర్జన భర్జనలు జరుగుతున్న వేళ టీడీపీ శ్రేణుల్లో గతంలో కేసీఆర్ చంద్రబాబు నివాసం గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కేసీఆర్ ఏ ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేశారో అప్పుడు అర్ధం చేసుకోలేకపోయిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు ఇదే విషయమై పదే పదే గుర్తు చేసుకొంటున్నారు. అప్పుడు కేసీఆర్ మాటలను వింటే అయినా ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని టీడీపీశ్రేణులు చర్చించుకుంటున్నాయి. అసలు ఇంతకీ ఫ్లాష్ బ్యాక్ లో కేసీఆర్ ఏం చెప్పారు తెలుసుకోవాలంటే ఈ కథనం చదివెయ్యండి .

58కి బదులు 74 మందితో భద్రత, చంద్రబాబుకు భద్రత తగ్గించలేదన్న ఏపీ సర్కార్..58కి బదులు 74 మందితో భద్రత, చంద్రబాబుకు భద్రత తగ్గించలేదన్న ఏపీ సర్కార్..

చంద్రబాబు ఇంటికి వస్తు లేదని ఎప్పుడో చెప్పిన కేసీఆర్ .. ఇప్పుడు గుర్తు చేసుకుంటున్న టీడీపీ నేతలు

చంద్రబాబు ఇంటికి వస్తు లేదని ఎప్పుడో చెప్పిన కేసీఆర్ .. ఇప్పుడు గుర్తు చేసుకుంటున్న టీడీపీ నేతలు

తెలంగాణ సీఎం కేసీఆర్ తన వ్యవసాయక్షేత్రంలో నిర్వహించిన ఆయుత చంఢీయాగంలో పాల్గొనాలని గతంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ఆహ్వానించేందుకు అమరావతికి వెళ్ళారు . అక్కడ చంద్రబాబు ఇంటిని చూసారు. ఆ ఇంట్లోనే కేసీఆర్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంఢీయాగానికి రావాలని కేసీఆర్ చంద్రబాబును ఆహ్వానించారు. కేసీఆర్‌కు టీడీపీ నేతలు కొందరు సాగనంపేందుకు వెళ్లారు. ఆ సమయంలో టీడీపీ నేతలతో కేసీఆర్ కొద్దిసేపు మాట్లాడారు. ఇల్లంతా పరికించి చూసి ఎందుకు చంద్రబాబునాయుడు ఈ భవనంలో ఉంటున్నాడని ఆయన ప్రశ్నించారు. గుంట ఉన్న ప్రదేశంలో చంద్రబాబు నివాసం ఉంటున్నాడని... ఇది సరికాదనే అభిప్రాయాన్ని కేసీఆర్ నాడు వ్యక్తం చేశారని తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు గుర్తు చేసుకుని లబోదిబో మంటున్నారు. వాస్తు సరిగా లేని కారణంగానే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అప్పుడు అనుకున్నా , ఇప్పుడు మాత్రం ఆ వాస్తు ప్రభావమే చంద్రబాబు కొంప ముంచిందని టీడీపీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.

Recommended Video

తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్న మాజీ సీఎం
ప్రజావేదిక నిర్మాణం కూడా చంద్రబాబు నివాసానికి వాస్తు దోషమే .. వాస్తు వల్లే బాబు కొంప మునిగిందనే భావన

ప్రజావేదిక నిర్మాణం కూడా చంద్రబాబు నివాసానికి వాస్తు దోషమే .. వాస్తు వల్లే బాబు కొంప మునిగిందనే భావన

ఇక చంద్రబాబు ఇంటికి పక్కనే నిర్మించిన ప్రజా వేదిక వల్ల కూడ వాస్తుపరంగా బాబుకు ఇబ్బందులేనని కొందరు టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. అయితే ఈ అభిప్రాయాలను చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదని చెప్తున్నారు. వాస్తు పై చంద్రబాబు పెద్దగా దృష్టి పెట్టలేదని టీడీపీ నేతలు వాపోతున్నారు. అప్పుడు కేసీఆర్ మాటలు పరిగణనలోకి తీసుకుంటే బాగుండేదని వారు ఇప్పుడు అనుకొంటున్నారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చింది. దీనంతటికీ కారణం వాస్తు లేని బాబు ఇలె అన్న అభిప్రాయం వుంది.

లింగమనేని ఇల్లు ఖాళీ చేస్తే బాధలు పోతాయని కొందరు నేతల భావన .. డైలమాలో చంద్రబాబు

లింగమనేని ఇల్లు ఖాళీ చేస్తే బాధలు పోతాయని కొందరు నేతల భావన .. డైలమాలో చంద్రబాబు

చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్దంగా నిర్మించారని , అది అక్రమ కట్టడం అని వైసీపీ సర్కార్ ప్రజా వేదికను కూల్చేసింది.. చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ ఇల్లు కూడ నిబంధనలకు విరుద్దంగా నిర్మించారని నోటీసులు పంపి వారం సమయం ఇచ్చారు . అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని సీఎం స్పష్టం చేశారు.అయితే చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ ఇల్లును గ్రామ పంచాయితీ అనుమతితో నిర్మించినట్టుగా చెప్తూ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో నిర్మించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అయినా కూల్చివేత తప్పదని వైసీపీ సర్కార్ చెప్తున్న నేపధ్యంలో లింగమనేని ఇల్లు ఖాళీ చేస్తే చంద్రబాబుకు పట్టిన పీడా విరగడ అవుతుందని కొందరు టీడీపీ నేతలు భావిస్తున్నారు. వాస్తు దోషం ఉన్న ఇంట్లో ఉండటం వల్లే బాబు ఇన్ని బాధలు పడ్డారని వారి అభిప్రాయం .మరి చంద్రబాబు ఇంటి విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.మరే నిర్ణయం తీసుకుంటారో అన్న ఆసక్తి ప్రస్తుతం అటు టీడీపీ వర్గాల్లోనూ, వైసీపీ లోనూ , రాష్ట్ర ప్రజల్లోనూ కనిపిస్తుంది.

English summary
The comments of KCR about Chandrababu's residence in the TDP series have become a hot topic of debate in the recent days. Telugu desham leaders who could not understand the purpose of KCR's comments, are now realizing and recalling the same thing. Even if they listen to the words of the KCR, now the situation is not like this .What is KCR said in the Flashback. KCR said that chandrababu is living in the house of Lingamaneni which was not in vasthu. Why he is living in a vasthu problem house . now these comments are circulating in tdp circles .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X