వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రివర్గం చిచ్చు: మెట్టుదిగని సీనియర్లు , అమీతుమీకి సిద్దం, బాబు వ్యూహమిదే

మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. మంత్రివర్గంలో చోటు దక్కని పార్టీ సీనియర్లు అలకమానలేదు. అధినేతతో అమీతుమీ తేల్చుకొంటామని సీనియర్లు సిద్దమయ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. మంత్రివర్గంలో చోటు దక్కని పార్టీ సీనియర్లు అలకమానలేదు. అధినేతతో అమీతుమీ తేల్చుకొంటామని సీనియర్లు సిద్దమయ్యారు.అయితే అసంతృప్తులను బుజ్జగిజ్జేందుకు పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు.

వైసీపి నుండి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కించడంతో పాటు పార్టీనే నమ్ముకొన్న వారిని విస్మరించడం పట్ల పార్టీ సీనియర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

మంత్రివర్గం నుండి తప్పించడం పట్ల మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామా చేశారు.మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

11 మందిని మంత్రివర్గంలోకి తీసుకొన్నా ....ఇంత కాలంపాటు పార్టీని నమ్ముకొన్నవారికి న్యాయం జరగలేదనేది అసంతృప్త నాయకుల అభిప్రాయం.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి మౌనానికి అర్థమేమిటి?

గోరంట్ల బుచ్చయ్య చౌదరి మౌనానికి అర్థమేమిటి?


చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే సమయంలోనే తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి బాబును కోరారు.అయితే ఆ సమయంలో గోరంట్లకు మంత్రివర్గంలో చోటుదక్కలేదు.పునర్వవ్యవస్థీకరణలో కూడ తనకు చోటు దక్కుతోందని భావించిన బుచ్చయ్య చౌదరికి నిరాశే మిగిలింది.దీంతో ఆయన బాబుపై తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు.

రాజకీయాలంటే వ్యాపారంగా మారిందని ఆరోపణలు చేశారు.పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి కూడ రాజీనామా చేశారు.డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప బుచ్చయ్య చౌదరిని బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.బాబు నుండి బుచ్చయ్య చౌదరికి పిలుపు కోసం అనుచరులు ఎదురుచూస్తున్నారు.

టిక్కెట్టు కేటాయింపులో కూడ బుచ్చయ్యకు నిరాశే

టిక్కెట్టు కేటాయింపులో కూడ బుచ్చయ్యకు నిరాశే


2014 అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్టు కేటాయింపు విషయంలో కూడ బుచ్చయ్య చౌదరికి చివరి వరకు నిరాశే మిగిలింది. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానాన్ని టిడిపి ఆయనకు కేటాయించింది. చాలా కాలం పాటు ఆయన రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుండి ప్రాతినిథ్యం వహించారు.కాని, బిజెపితో పొత్తు కారణంగా రాజమండ్రి స్థానాన్ని బిజెపికి కేటాయించి రాజమండ్రి రూరల్ స్థానాన్ని గోరంట్లకు కేటాయించారు.చివరి నిమిషం వరకు టిక్కెట్టు కేటాయింపు విషయమై స్పష్టత రాకపోవడంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసహనాన్ని వ్యక్తం చేశారు.గోరంట్లకు మద్దతుగా పార్టీ నాయకులు నిలిచారు.

బండారు సత్యనారాయణమూర్తికి బుజ్జగింపులు

బండారు సత్యనారాయణమూర్తికి బుజ్జగింపులు


విశాఖ జిల్లా పెందుర్తి అసెంబ్లీ స్థానం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి మంత్రిపదవి దక్కలేదు.అనకాపల్లి ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాస్ బండారు సత్యనారాయణమూర్తితో చర్చలు జరిపారు.పార్టీలో సీనియర్లకు సముచిత స్థానం కల్పిస్తారని ముత్తంశెట్టి శ్రీనివాస్ చెప్పారు.బండారు సత్యనారాయణమూర్తిని బుజ్జగించారు.

ధూళిపాళ్ళ నరేంద్రకు లోకేష్ ఫోన్

ధూళిపాళ్ళ నరేంద్రకు లోకేష్ ఫోన్

మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకకపోవడంతో గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ నరేంద్ర అసంతృప్తితో ఉన్నారు.అయితే ఈ విషయమై నరేంద్రకు లోకేష్ ఫోన్ చేశాడు.విజయవాడకు పిలిపించుకొని దూళిపాళ్ళ నరేంద్రతో చర్చించారు.భవిష్యత్ లో పార్టీ న్యాయం చేస్తోందని హమీ ఇచ్చారు.

బొజ్జలతో నియోజకవర్గ నేతల సమావేశం

బొజ్జలతో నియోజకవర్గ నేతల సమావేశం

మంత్రి వర్గం నుండి అర్థాంతరంగా తప్పించడం పట్ల మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. బాబు తీరుపట్ల ఆగ్రహనికి గురైన బొజ్జల ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామా చేశారు.శ్రీకాళహస్తికిచెందిన పార్టీకి చెందిన ముఖ్య నాయకులు మంగళవారం నాడు బొజ్జలను కలిశారు. ఇటీవల జరిగిన పరిణామాల పట్ల నాయకులతో చర్చించారు.పార్టీ మారనని ఆయన పార్టీ నాయకులకు హామీ ఇచ్చారని నాయకులు చెబుతున్నారు. రెండు రోజుల్లో ఆయన శ్రీకాళహస్తికి వెళ్ళనున్నారు.

నామినేటేడ్ పదవులు

నామినేటేడ్ పదవులు


మంత్రివర్గంలో చోటు దక్కని ఎమ్మెల్యేలకు నామినేటేడ్ పదవులను కట్టబెట్టనున్నట్టుగా టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నాయకులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు.అయితే అసంతృప్తులను సంతృప్తి పర్చేందుకు బాబు అన్ని రకాల ప్రయత్నాలను చేస్తున్నారు.ఒక్కొక్కరుగా అసంతృప్తులను బుజ్జగించేందుకు అన్ని రకాల ప్రయత్నాలను పార్టీ అధిష్టానం చేస్తోంది.

English summary
Tdp leaders dissatisfied on chandrababu naidu.anakapally mp avanti srinivas discussed with bandaru satyanarayana murthy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X