విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చొక్కా చించుకొని, తన్నుకున్న టీడీపీ, గుడివాడలో...

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. బుధవారం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. కుర్చీలతో కొట్టుకున్నారు. పిడిగుద్దులు, దూషణలతో పార్టీ కార్యాలయం దద్దరిల్లింది. పలువురి చొక్కాలు కూడా చిరిగాయి.

గుడివాడ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి కోసం కొంతకాలంగా పార్టీలో నెలకొన్న అంతర్గతపోరు బుధవారం బహిర్గతమైంది. గుడివాడ ఏఎంసీ చైర్మన్‌ పదవి కోసం చాలామంది పోటీలో ఉన్నారు. ఇరువర్గాలుగా విడిపోయి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో నందివాడ మండలానికి చెందిన సీనియర్‌ టీడీపీ నాయకుడు సురేష్‌ గుడివాడ నియోజకవర్గంలో అధికార పార్టీ రాజకీయ సంక్షోభంలో చిక్కుకుందంటూ విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. దీంతో బుధవారం దీనిపై వివరణ కోరేందుకు సురేష్‌తో నియోజకవర్గ పార్టీ నాయకులు గుడివాడలోని పార్టీ కార్యాలయంలో భేటీ ఏర్పాటు చేశారు.

TDP leaders fight in Krishna district

సురేష్‌ గైర్హాజరయ్యారు. ఆయన వర్గం వారిని పత్రికలెక్కడంపై మండల అధ్యక్షులు హెచ్చరించారు. దీనిపై వారు పార్టీలోకి వేరే పార్టీ వ్యక్తులు వస్తే వారిని నెత్తినపెట్టుకుని పూజిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది. మిగతా వారు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

ఈ సమయంలో తోపులాట జరిగింది. ఒకరినొకరు కుర్చీలతో కొట్టుకోవడంతో వివాదం తారస్థాయికి చేరింది. ఈ లోగా గుడ్లవల్లేరు, గుడివాడ రూరల్‌, నందివాడ మండలాలకు చెందిన పలువురు నేతలు అక్కడికి చేరడంతో పార్టీ కార్యాలయమంతా అరుపులు కేకలతో దద్దరిల్లింది. దాదాపు అరగంట తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది.

పైలాన్ తరలింపుపై గొడవ

కంచికచర్ల మండలం పరిటాలలో ఏర్పాటు చేసిన టీడీపీ పైలాన్‌ను మార్చడంపై తెలుగు తమ్ముళ్ల మధ్య వివాదం ఏర్పడింది. పైలాన్‌ను మార్చేందుకు ఎంపి నాని అనుచరులు ప్రయత్నించారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. 2012 అక్టోబర్ 2న చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర 117 రోజుల్లో 1854.9 కిలోమీటర్లు సాగి.. జనవరి 26న పరిటాలకు చేరింది. అందుకు గుర్తుగా కోగంటి బ్రదర్స్‌కు చెందిన స్థలంలో 117 అడుగుల పైలాన్ నిర్మించారు.

ఎన్టీఆర్ ట్రస్టుకు ఆ స్థలాన్ని రిజిస్టర్ చేశారు. మరోచోట కూడా ఓ పార్టీ అభిమాని స్థలం ఇచ్చారు. అక్కడకు తరలించేందుకు ఎంపీ అనుచరులు ప్రయత్నించారు. దీంతో పైలాన్ తరలించవద్దని కోగంటి సోదరులు, ఆయన వర్గం కోరింది. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది.

English summary
Telugudesam Party leaders fight in Krishna district
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X