వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి పరిటాల సునీత వర్సెస్ ఎంఏల్ఏ సూరి

By Narsimha
|
Google Oneindia TeluguNews

ధర్మవరం :అనంతపురం టిడిపిలో వర్గపోరు ముదిరిం. అనంత జిల్లాలో మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఎంఏల్ఏ వరదాపురం సూరి వర్గీయుల మద్య నిపురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు రచ్చకెక్కాయి,.ధర్మవరం పట్టణంలో పరిటాల సునీ వర్గీయులు, సూరి వర్గీయులు బాహాబాహీకి దిగారు.

టిడిపిలోనే ఉన్న వీరి మద్య సత్సంబందాలు లేవు. ఒకరిపై మరోకరు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుంటారు.ధర్మవరం పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రెండు గ్రూపుల మద్య వివాదానికి కారణమయ్యాయి.పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రెండు గ్రూపుల మద్య ఆదిపత్య పోరును మరింత పెంచిపోషించాయి.

TDP Leaders Fight On Flexi Issue

అనంతపురం జిల్లా బత్తలపురం మండలం ఘంటాపురం గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు జగ్గు ధర్మవరం పట్టణంలో దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.ఈ ఫ్లెక్సీలో మంత్రి పరిటాల సునీత,ఆమె తనయుడు శ్రీరామ్ ఫోటోను ఏర్పాటు చేశారు.కాని, స్థానిక ఎంఏల్ఏ వరదాపురం సూరి ఫోటో వేయలేదు.తమ నాయకుడి ఫోటో లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడానిని సూరి వర్గీయులు జీర్ణించుకోలేదు.జగ్గు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించేందుకు సూరి వర్గీయులు ప్రయత్నించడంతో వివాదం ప్రారంభమైంది.

జగ్గు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించేందుకు సూరి వర్గీయులు చేసిన ప్రయత్నాన్ని పరిటాల సునీత వర్గీయులు అడ్డుకిొన్నారు. ఇరు వర్గాలు వాగ్వావాదానికి దిగారు. బాహాబాహీకి పాల్పడ్డారు. సూరి వర్గీయులు ఫ్లెక్సీని కొంత చింపారు.దీంతో ఫ్లెక్సీ వద్దే సునీత వర్గీయులు బైఠాయించారు.పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకుగాను పోలీసులు పట్టణంలో 144 సెక్షన్ ను విధించారు.సునీత ఫ్లెక్సీకి పోలీసులు కాపల ఉంచారు.

English summary
tdp group clashes in dharmavaram town. jaggu a tdp leader establish a flexi in dharvaram town recently. in that flexi diwali wishes from minister paritala sunita, her son sriram,local mla tdp leader varadapuram suri photo not publish the jaggu. so two groups supporters clash wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X