వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆలయాలపై దాడులపై డీజీపీ వ్యాఖ్యలతో టీడీపీ నేతలు ఫైర్ ; వారిని అరెస్ట్ చెయ్యటం చేతకాలేదని ఎద్దేవా

|
Google Oneindia TeluguNews

ఆలయాలపై దాడుల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ రాజకీయ పార్టీల ప్రమేయం ఉందని చేసిన వ్యాఖ్యలపై టిడిపి నేతలు మండిపడుతున్నారు . ఆలయాలపై దాడుల వెనుక టిడిపి, బిజెపి ఉందన్న డిజిపి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప గతంలో మతిస్థిమితం లేని వాళ్ళు, పిచ్చి వాళ్ళు ఈ దాడులు చేశారని తప్పించుకునే ప్రయత్నం చేసిన డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇప్పుడు టిడిపి, బిజెపి వాళ్లు దాడులు చేశారని అంటున్నారని మండిపడ్డారు.

నిన్నటిదాకా మతి స్థిమితం లేని వాళ్ళు చేశారన్న డీజీపీ ఒక్కసారి మాట మార్చారు : చినరాజప్ప

నిన్నటిదాకా మతి స్థిమితం లేని వాళ్ళు చేశారన్న డీజీపీ ఒక్కసారి మాట మార్చారు : చినరాజప్ప

పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన నిమ్మకాయల చినరాజప్ప ఆలయాల్లో దాడులకు పాల్పడిన ఒక్క నిందితుడిని కూడా అరెస్టు చేయలేకపోయారని మండిపడ్డారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుందని ముందుగానే చంద్రబాబు చెప్పారని అయినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు చినరాజప్ప.

డీజీపీ చేసిన వ్యాఖ్యలపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసహనం వ్యక్తం చేశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

 చేతకాని స్థితిలో పోలీసులు ఉన్నారు : గోరంట్ల బుచ్చయ్య చౌదరి

చేతకాని స్థితిలో పోలీసులు ఉన్నారు : గోరంట్ల బుచ్చయ్య చౌదరి

గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యలను గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఖండించారు. టిడిపి, బిజెపి కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. సంక్రాంతి సమయంలో కోడిపందాలు ఆడుతున్న, అశ్లీల నృత్యాలు చేస్తున్న వారిపై డీజీపీ ఎందుకు కేసులు పెట్టడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. హిందూ దేవాలయాలపై దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయలేని, చేతగాని స్థితిలో పోలీసులు ఉన్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.

డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యలు సిగ్గుచేటు : టీడీపీ నేత వర్ల రామయ్య

డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యలు సిగ్గుచేటు : టీడీపీ నేత వర్ల రామయ్య

డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యలు సిగ్గుచేటు అని టీడీపీ నేత వర్ల రామయ్య ఫైర్ అయ్యారు. విగ్రహాల విధ్వంసం ఘటనల విషయంలో పార్టీల ప్రమేయం ఉందని డిజిపి ఏ సమాచారంతో చెప్పారని ప్రశ్నించారు వర్ల రామయ్య. డీజీపీ గౌతమ్ సవాంగ్ సిఐడి, సిట్ ఇచ్చిన సమాచారంతో ఈ విషయాన్ని నిర్ధారించారా లేక సజ్జల ఇచ్చిన సమాచారంతో మాట్లాడారా అంటూ నిలదీశారు. మొన్నటికి మొన్న ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పిన డీజీపీ ఒక్కసారిగా మాట మార్చారని, ఇప్పుడు పార్టీలకు సంబంధం ఉందని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు.

జగన్ నిర్లక్ష్యం వల్లే ఆలయాలపై దాడులు : వెలగపూడి రామకృష్ణ బాబు

జగన్ నిర్లక్ష్యం వల్లే ఆలయాలపై దాడులు : వెలగపూడి రామకృష్ణ బాబు

డీజీపీ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ స్థాయి వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి నిందితులను అరెస్టు చేయాలని వెలగపూడి రామకృష్ణబాబు డిమాండ్ చేశారు.

డీజీపీ తీరుపై టీడీపీ నేతల తీవ్ర అసహనం

డీజీపీ తీరుపై టీడీపీ నేతల తీవ్ర అసహనం


మొన్నటి వరకు ఏ రాజకీయ పార్టీల ప్రమేయం ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలలో లేదని చెప్పిన డిజిపి, నిన్నటికి నిన్న విగ్రహ ధ్వంసం ఘటనల వెనుక రాజకీయ పార్టీల ప్రమేయం ఉందని, టీడీపీ బీజేపీ నేతలను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుత ఏపీలో ప్రతిపక్ష పార్టీలకు ఆగ్రహం తెప్పిస్తుంది. దీంతో డీజీపీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

English summary
TDP leaders are angry over remarks made by Andhra Pradesh DGP Gautam Sawang saying that political parties were involved in the attacks on temples. Outraged over the DGP's remarks that the TDP and BJP were behind the attacks on temples, former Home Minister Nimmakayala Chinarajappa, TDP leaders Varla Ramaiah, Gorantla Butchaiah Chowdary and Velagapudi Ramakrishna Babu demanded the immediate arrest of the perpetrators of the attacks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X