అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీతో జగన్, పవన్! బాబు, లోకేష్‌పై దుష్ప్రచారం: జీవీఎల్‌పై టీడీపీ నేతలు నిప్పులు

|
Google Oneindia TeluguNews

అమరావతి/విజయనగరం: బీజేపీతో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఏపీ మంత్రి, టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. విజయనగరం ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.

జగన్, పవన్‌లకు అవే ముఖ్యం

జగన్, పవన్‌లకు అవే ముఖ్యం

జగన్, పవన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యయ్యాయని కళావెంకట్రావు దుయ్యబట్టారు. శ్రీకాకుళం జిల్లాను టిట్లీ తుఫాను అతలాకుతలం చేస్తే.. బాధితులను పరామర్శించేందుకు ప్రతిపక్ష నేత జగన్‌కు సమయమే లేదని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ తీరు అయోమయంగా ఉందని కళావెంకట్రావు మండిపడ్డారు.

గొప్ప పని! గర్వపడుతూనే ఉంటా: పవన్ కళ్యాణ్, రాంచరణ్‌పై మంచు మనోజ్ ప్రశంసలుగొప్ప పని! గర్వపడుతూనే ఉంటా: పవన్ కళ్యాణ్, రాంచరణ్‌పై మంచు మనోజ్ ప్రశంసలు

Recommended Video

Panchayat Elections 2018 : ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు పచ్చ జెండా
పవన్ తీరు అయోమయం

పవన్ తీరు అయోమయం


పవన్ కళ్యాణ్ తీరు అయోమయంగా ఉందని కళావెంకట్రావు మండిపడ్డారు. విజయనగరం జిల్లా సాగునీటికి, తాగు నీటికి ఇబ్బంది లేకుండా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు అధికారుల నుంచి ప్రతిపాదనలు కోరారని చెప్పారు. భోగాపురం విమానాశ్రయానికి త్వరలోనే టెండర్లు పూర్తవుతాయని తెలిపారు.

 బాబు, లోకేష్‌పై దుష్ప్రచారం

బాబు, లోకేష్‌పై దుష్ప్రచారం

ఇది ఇలా ఉండగా, టీడీపీ నేత బుద్ధా వెంకన్న బీజేపీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. అగ్రిగోల్డ్‌ బాధితుల ముసుగులో రాష్ట్ర ద్రోహుల ముఠా హడావుడి చేస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేష్‌పై మోడీ చెంచాలు దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

 జీవీఎల్.. నీకు నేను చాలు.. లోకేష్ ఎందుకు?

జీవీఎల్.. నీకు నేను చాలు.. లోకేష్ ఎందుకు?

సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వస్తే జీవీఎల్‌కు బుద్ధిచెబుతారని బుద్ధా వెంకన్న హెచ్చరించారు. జీవీఎల్‌కు 200 కోట్ల అక్రమాస్తులున్నాయని ఆయన ఆరోపించారు. జీవీఎల్‌ స్థాయికి తాను చాలని.. బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. అగ్రిగోల్డ్ ఆస్తులను అమిత్‌షా కుమారుడికి కట్టబెట్టేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. అమిత్‌షా ఆదేశాలతోనే రాంమాధవ్ రంగంలోకి దిగారన్నారు. ‘రాంమాధవ్‌.. మీకు ధైర్యం ఉంటే నాపై మీపార్టీ అభ్యర్థిని నిలపండి' అంటూ సవాల్ విసిరారు. బీజేపీ అభ్యర్థికి డిపాజిట్‌ వస్తే విజయవాడ వదిలివెళ్తానని ఆయన స్పష్టం చేశారు. సీబీఐకి అవినీతి చీడ పట్టించిన చరిత్ర మోడీ, అమిత్ షాదని విమర్శించారు.

సీబీఐని నాశనం చేస్తున్నారు..

సీబీఐని నాశనం చేస్తున్నారు..

ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు కూడా బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అత్యున్నత విచారణ సంస్థ సీబీఐని బీజేపీ నాశనం చేసిందని విమర్శలు గుప్పించారు. రాజ్యాంగబద్ధ సంస్థలను బీజేపీ పద్ధతి ప్రకారం నాశనం చేస్తోందన్నారు. రాకేష్ ఆస్థానా.. అమిత్‌షా, నరేంద్ర మోడీలకు ఆస్థాన కవి అని ఎద్దేవా చేశారు. ఆస్థానా నియామకాన్ని అలోక్ వర్మ సవాలు చేసినా మోడీ పట్టించుకోలేదని జూపూడి మండిపడ్డారు.

English summary
TDP leader Kala Venkata Rao and Budha Venkanna, Jupudi Prabhakar on Tuesday fired at BJP and YSRCP president YS Jaganmohan Reddy and Janasena President Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X