వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతమాటా, జగన్‌కు పెళ్లి యావ, అందుకే ఆ అక్రమ సంబంధం!!: వైయస్ పెళ్లిళ్లంటూ టీడీపీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ అధినేత వైయస్ జగన్‌కు చెందిన సాక్షి పత్రిక తప్పుదారి పట్టిస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. బుధవారం వారు జగన్, సాక్షి, వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Recommended Video

చంద్రబాబు అలా చేస్తే అంతకంటే దుర్మార్గం ఉండదు: కేఈ, అయ్యన్న

కాబోయే ప్రధానిని టీడీపీయే నిర్ణయిస్తుందని, బీజేపీ, కాంగ్రెస్సేతర పార్టీలను ఏకం చేసేది తామేనని, తమను విమర్శించే నైతిక హక్కు జగన్‌కు లేదని మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యనమల రామకృష్ణుడు వేర్వేరుగా నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు చేశారు.

పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి కానీ, కేసీఆర్-బాబు కలిస్తే: మురళీ మోహన్ ఆసక్తికరంపవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి కానీ, కేసీఆర్-బాబు కలిస్తే: మురళీ మోహన్ ఆసక్తికరం

చంద్రబాబు యథాలాపంగా మాట్లాడారు

చంద్రబాబు యథాలాపంగా మాట్లాడారు

జాతీయ రాజకీయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యథాలాపంగా మాట్లాడారని యనమల తెలిపారు. దానిని చిలువలు పలవలుగా ప్రచారం చేయడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తగదని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేది టీడీపీయే అన్నారు. ఎవరి పంచననో చేరాల్సిన అవసరం, ఆ దుస్థితి టిడిపికి లేదన్నారు. రాబోయే ప్రధానిని నిర్ణయించేది తెలుగుదేశం పార్టీయే అన్నారు. 2019లో ఏర్పడేది బీజేపీయేతర, కాంగ్రెస్సేతర ప్రభుత్వమే అన్నారు. 2014లో తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వాత జగన్, సాక్షి రెండూ కనిపించవన్నారు. అసత్య ప్రచారంలో సాక్షి గోబెల్స్‌ను మించిందన్నారు. దుష్ప్రచారాలతో అసత్యాలు సృష్టించాలనుకున్న వైసీపీ కలలు నెరవేరవన్నారు.

పవన్‌కు నాలుగు పెళ్లిళ్లు, టీడీపీ ఆరు పెళ్లిళ్లు అంటూ..

పవన్‌కు నాలుగు పెళ్లిళ్లు, టీడీపీ ఆరు పెళ్లిళ్లు అంటూ..

టీడీపీని విమర్శించే నైతిక హక్కు జగన్‌కు లేదని యనమల అన్నారు. జనసేన అధినేత పవన్‌కు నాలుగు పెళ్లిళ్లు, టీడీపీకి ఆరు పెళ్లిళ్లు అని వ్యాఖ్యానించిన జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. జగన్ పెళ్లిళ్ల విమర్శలను పక్కన పెట్టి రాష్ట్రం గురించి ఆలోచించాలన్నారు. తాను యాంటీ బీజేపీ, యాంటీ కాంగ్రెస్ అని జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు.

 మోడీతో 45 నిమిషాల ఏం మాట్లాడారో చెప్పాలి

మోడీతో 45 నిమిషాల ఏం మాట్లాడారో చెప్పాలి

జగన్‌కు సిద్ధాంతాలు ఏమీ తెలియవని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలో ముఖ్యమని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీతో 45 నిమిషాల పాటు ఏం చర్చలు జరిపారో చెప్పాలన్నారు. రాష్ట్రం నాశనం అవ్వాలనేది జగన్ ఆలోచన అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉన్నా, రాష్ట్ర, దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ అధికారంలోకి రాకుండా చేయడమే తమ టార్గెట్ అన్నారు. తాను యాంటీ బీజేపీ అని జగన్ చెప్పగలడా అని సవాల్ చేశారు.

పవన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం

పవన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం

పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడంటూ జగన్ ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేశారని, ఇప్పుడు చంద్రబాబుపై పొత్తుల పరంగా విమర్శలు గుప్పించారని సోమిరెడ్డి మండిపడ్డారు. జగన్‌కు పెళ్లిళ్ల యావ ఎక్కువైందని విమర్శించారు.

వైయస్ పెళ్లిళ్ల గురించి తెలుసుకో

వైయస్ పెళ్లిళ్ల గురించి తెలుసుకో

జగన్ వాడే భాష పరిధిని దాటుతోందని సోమిరెడ్డి మండిపడ్డారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయంగా ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడో జగన్ తెలుసుకోవాలన్నారు. 2004లో వైయస్ దాదాపు ఆరు పెళ్లిళ్లు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు జగన్ తాజాగా మోడీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

English summary
Telugudesam party leaders fired at YSR Congress Party chief YS Jagan Mohan Reddy for Marriages allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X