• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విజయసాయిరెడ్డి ..ఓ దావూద్ ఇబ్రహిం, నీ వాటా ఎంత ? మీ ఏ1 వాటా ఎంత ? : టీడీపీ నేతల ధ్వజం

|

సోషల్ మీడియాలో టీడీపీ అధినేత చంద్రబాబుపై, టిడిపి నేతలపై విమర్శనాస్త్రాలు స్పందించే రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నేత విజయసాయిరెడ్డిని టిడిపి నేతలు టార్గెట్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఫ్యాక్షనిజం రాజ్యమేలుతోంది అంటూ మండిపడుతున్నారు. విశాఖలో భూములు కబ్జా చేయడం కోసమే విశాఖ లో రాజధాని పేరుతో వైసీపీ నాయకులు డ్రామాలాడుతున్నారని నిప్పులు చెరుగుతున్నారు.

సీఎం జగన్ .. రంగులకి ఓ మంత్రిత్వ శాఖ కేటాయిస్తే బాగుంటుంది... టీడీపీ నేత గోరంట్ల సెటైర్సీఎం జగన్ .. రంగులకి ఓ మంత్రిత్వ శాఖ కేటాయిస్తే బాగుంటుంది... టీడీపీ నేత గోరంట్ల సెటైర్

మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ముగ్గురికి రాష్ట్రాన్ని అప్పజెప్పారు : బుద్దావెంకన్న

మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ముగ్గురికి రాష్ట్రాన్ని అప్పజెప్పారు : బుద్దావెంకన్న

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ని టార్గెట్ చేసిన బుద్దా వెంకన్న రాష్ట్రంలో మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ముగ్గురికి రాష్ట్రాన్ని అప్పజెప్పారు అని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర లో అందరు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారని పేర్కొన్న బుద్ధా వెంకన్న ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి దావూద్ ఇబ్రహీం లా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. వైసిపి హయాంలో రాష్ట్రంలో ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు బుద్ధా వెంకన్న.

 జె టాక్స్ వసూలు చేసి వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి వైసిపి ప్రయత్నాలు : బుద్దా వెంకన్న

జె టాక్స్ వసూలు చేసి వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి వైసిపి ప్రయత్నాలు : బుద్దా వెంకన్న

2022 లో జమిలి ఎన్నికలు వస్తాయని మళ్లీ సీఎం చంద్రబాబు అవుతారని ఆశాభావం వ్యక్తం చేసిన బుద్దా వెంకన్న,జీవీఎంసీ ఎన్నికలలో టిడిపి విజయం సాధిస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు.విశాఖలో వైసీపీ నాయకుల ఆగడాలు అందుకు కారణం అవుతాయి అంటూ పేర్కొన్నారు. జె టాక్స్ వసూలు చేసి వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి వైసిపి ప్రయత్నం చేస్తోందని బుద్దా వెంకన్న విమర్శల వర్షం కురిపించారు. వైసీపీ నేతల తీరు మారకుంటే ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు .

 ఏ2 విజయసాయి రెడ్డి, విశాఖలో వేల ఎకరాలు కబ్జా : అయ్యన్నపాత్రుడు

ఏ2 విజయసాయి రెడ్డి, విశాఖలో వేల ఎకరాలు కబ్జా : అయ్యన్నపాత్రుడు

టిడిపి సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు కూడా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ని ఏ2 అని సంబోధిస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఏ2 విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో విశాఖలో వేల ఎకరాలు కబ్జా చేశారని మండిపడిన అయ్యన్నపాత్రుడు ప్రజలు రాజధాని రైతులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. అమరావతి విషయంలో ప్రధాని మౌనం వీడాలని పేర్కొన్న అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయంగా మూడు రాజధానుల నిర్ణయాన్ని అభివర్ణించారు.

ఆ డబ్బు ఏమైంది నీ వాటా ఎంత .. మీ ఏ1 వాటా ఎంత ? : అయ్యన్న

ఆ డబ్బు ఏమైంది నీ వాటా ఎంత .. మీ ఏ1 వాటా ఎంత ? : అయ్యన్న

భూములు ఇచ్చిన రైతులను శోకసంద్రంలో ముంచి ఘనత వైయస్ జగన్ కే దక్కుతుంది అంటూ వ్యాఖ్యానించారు. రైతు దీక్షకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు సంఘీభావంగా నిలవాలని కోరారు అయ్యన్నపాత్రుడు. చంద్రబాబును విమర్శిస్తూ కాగ్ వాతలు పెట్టినా సిగ్గు లేదంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా అయ్యన్నపాత్రుడు ఎంపీ విజయసాయి రెడ్డి ని రివర్స్ ఎటాక్ చేశారు. ఆరు నెలలకే 55 వేల కోట్లు అప్పు చేశారని కాగ్ చెబుతుంది. ఆ డబ్బులు ఏమై పోతున్నాయి ఏ2 ? నీ వాటా ఎంత ? మీ ఏ1 వాటా ఎంత ? అంటూ చురకలు అంటించారు .

 అప్పులు చేసి మీరు రాష్ట్రాన్ని ముంచుతున్నారు : అయ్యన్నపాత్రుడు

అప్పులు చేసి మీరు రాష్ట్రాన్ని ముంచుతున్నారు : అయ్యన్నపాత్రుడు

రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చడం లేదు, డ్రైనేజీలు ఎత్తటం లేదు, వాటర్ ట్యాంకులు శుభ్రం చేయటం లేదు, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు లేదు.. ఒక సాగునీటి ప్రాజెక్టు నిర్మాణము లేదు.. ఈ డబ్బులన్నీ ఎటు పోతున్నాయి? సంపాదన చేతకాని మీలాంటి గాలి మంద ఎలా సంపాదించాలో తెలియక ,అప్పులు చేసి ఇంటిని ముంచేస్తారు మీరు రాష్ట్రాన్ని ముంచుతున్నారు అంటూ వైయస్ జగన్, విజయ్ సాయి రెడ్డి లను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు అయ్యన్నపాత్రుడు.

English summary
Buddha Venkanna, and Ayyanna patrudu targeted YCP MP Vijayasai Reddy, said jagan announced three capitals in the state and handed over the state to three.Vijayasaireddy was incensed that he is like Dawood Ibrahim . The CAG says it has borrowed Rs 55,000 crore in just six months. What's going on with that money? What is your share? What is your A1 share? ayyanna asked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X