వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇసుక కొరత ఉంటుందని ముందే చెప్పాం.. ప్రజలు స్వీకరించారు.. మంత్రి బోత్స

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ‌లో ఇసుకు కొరత పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగించిన విషయం తెలిసిందే.. అయితే టీడీపీ చేసిన ఆందోళనలపై వైసీసీ నేతలు ఘాటుగా స్పందించారు. ఈనేపథ్యంలోనే టీడీపీ నేతల ఆదాయం పోతుందనే ఆందోళన చేశారని మంత్రి బోత్స సత్యనారయణ ఘాటుగా విమర్శించారు. గత ప్రభుత్వంలో టీడీపీ నేతలు ఇసుకను ఆదాయ వనరుగా మల్చుకున్నారని, ఇప్పుడు ఇసుక పై ప్రభుత్వం నూతన విధానం తీసుకురావడంతోనే వారిలో ఆందోళన మొదలైందని దుయ్యబట్టారు. అందుకే టీడీపీ ఆందోళనలు, నిరసనలు చేశారని ఆయన విమర్శించారు.

ఇక ప్రభుత్వం ఏదైన నూతన విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చిన సంధర్భంలో దాని ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుందని బొత్స చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇసుకపై నూతన విధానం తీసుకురావడంతో ఫలితాలు వచ్చే వరకు ఇబ్బందులు ఉంటాయని ఆయన వివరించారు. ఇక ఇసుకపై తీసుకు వచ్చిన నూతన విధానంతో కొంత ఇబ్బందులు ఉంటాయని ప్రభుత్వం ముందే చెప్పిందని అన్నారు. ఇసుక కొరతపై ఇబ్బందులు ఉన్న విషయాన్ని ప్రజలు అర్ధం చేసుకున్నా..టీడీపీ నేతలు మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారని అన్నారు.

TDP leaders in the previous government have treated sand as a source of income,

మరోవైపు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇసుకను దోచుకున్న నేతలే ధర్నాకు దిగడంతో ప్రజలు నవ్వుకుంటున్నారని ఆమె విమర్శించారు. గత ఐదేళ్లలో ఇసుకపై అక్రమంగా కోట్లు సంపాదించారని ఆమే ఆరోపణ చేశారు.

English summary
TDP leaders in the previous government have treated sand as a source of income,Minister Botsha Satyanarayana lashed out at the TDP leaders who were protested for shortage of sand today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X