• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తెలుగు తమ్ముళ్ల అంతర్గత పోరు.. చంద్రబాబును పరేషాన్ చేస్తున్న బెజవాడ టీడీపీ పాలిటిక్స్ !!

|

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ పై పోరాటం చేస్తున్న చంద్రబాబుకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో ఉన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. చాలా ప్రాంతాలలో టిడిపి నేతల మధ్య సఖ్యత లేకపోవడం, కొన్నిచోట్ల కీలకంగా వ్యవహరించాల్సిన నేతలు సైలెంట్ గా పార్టీ కార్యక్రమాల పట్టింపు లేకుండా వ్యవహరించడం చంద్రబాబుకు తలనొప్పిగా తయారైంది. ముఖ్యంగా ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న కృష్ణా జిల్లాలో పరిస్థితి ఇప్పుడు మరింత దారుణంగా తయారైంది. ఇక బెజవాడ పాలిటిక్స్ అధినేత చంద్రబాబుకు సైతం చిరాకు తెప్పిస్తున్నాయి.

బెజవాడ తెలుగు తమ్ముళ్లలో అంతర్గత పోరు

బెజవాడ తెలుగు తమ్ముళ్లలో అంతర్గత పోరు

విజయవాడలో తెలుగుదేశం పార్టీకి కీలక నేతలు ఉన్నా, పార్టీని బలోపేతం చేయడంలో వారి పాత్ర లేకుండా పోతుంది. వారిలో వారికే సఖ్యత లేకపోవడం, పార్టీ కార్యక్రమాలు అంటే అందరు నేతలు కలిసి రాకపోవడమే అందుకు కారణం. పట్టుమని పది మంది నేతలు కూర్చొని మాట్లాడుకుని ఒకే మాట మీద ముందుకు సాగిన పరిస్థితి విజయవాడలో అసలే కనిపించడం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా బెజవాడ టిడిపి పాలిటిక్స్ సాగుతున్నాయి.

ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నా పార్టీకి నానాటికీ తగ్గుతున్న పట్టు

ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నా పార్టీకి నానాటికీ తగ్గుతున్న పట్టు

విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంపీ కేశినేని నాని ఉన్నారు అన్న మాటే కానీ వారు పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఎలాంటి ప్రయత్నం చేయడం లేదన్నది స్థానిక పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారుతోంది.టిడిపికి కంచుకోటగా ఉన్న బెజవాడలో పరిస్థితి రోజురోజుకీ టీడీపీ నేతల తీరుతో దిగజారుతూ వస్తోంది. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ టీడీపీకి గుడ్ బై చెప్పి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు. మాజీ మంత్రిగా పని చేసిన దేవినేని ఉమా గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో, అధికార పార్టీపై గట్టిగా పోరాటం చేయలేకపోతున్నారు.

తనకేమీ పట్టదు అన్నట్టు ఎంపీ కేశినేని నాని తీరు

తనకేమీ పట్టదు అన్నట్టు ఎంపీ కేశినేని నాని తీరు

ఇక ఎంపీ కేశినేని నాని ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు మాత్రమే తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టుగా ప్రవర్తిస్తారు. మిగతా సమయాల్లో పార్టీ కార్యక్రమాలకు తనకు ఏ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తారు. ఇక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మొదటి నుంచి సౌమ్యుడు గానే పేరు తెచ్చుకున్న ఆయన తన పని తాను చేసుకుపోవడం తప్ప అధికార పార్టీ పై పోరాటానికి ముందు వరుసలో ఉండడు. ఇంతమంది నాయకులు ఉంటే అందరూ కలిసి పని చేస్తారా అంటే ఒకరంటే ఒకరికి ఏమాత్రం పడదు.

గత మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లోనే పంచాయితీ .. యాక్టివ్ గా లేని నేతలు

గత మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లోనే పంచాయితీ .. యాక్టివ్ గా లేని నేతలు

విజయవాడ మున్సిపల్ ఎన్నికల సందర్భంలోనే తెలుగు తమ్ముళ్ళ మధ్య ఉన్న వర్గ విభేదాలు బాహాటంగానే చర్చనీయాంశమయ్యాయి. చెప్పులతో కొట్టేవాళ్ళమని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే దాకా వెళ్ళాయి. ఇక ఇటీవల ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాకు ఎంపీ ఉన్న లేనట్టే అని కేశినేని నాని పై చేసిన వ్యాఖ్యలు వారి మధ్య ఉన్న విభేదాలను
అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాయి. ఇక పార్టీ నేతల మధ్య సఖ్యత లేని కారణంగా బోండా ఉమ, నాగుల్ మీరా కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదు.

బెజవాడలో బలహీనంగా మారుతున్న టీడీపీ .. చంద్రబాబుకు పరేషాన్

బెజవాడలో బలహీనంగా మారుతున్న టీడీపీ .. చంద్రబాబుకు పరేషాన్

బుద్ధ వెంకన్న, కేశినేని నాని, దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్, బోండా ఉమ, నాగుల్ మీరా వంటి కీలక నాయకులు ఉన్నప్పటికీ విజయవాడలో తెలుగుదేశం పార్టీ పట్టును నానాటికీ కోల్పోతోంది. వైసీపీ నుండి టీడీపీకి జంప్ అయిన వంగవీటి రాధా అసలు ఏ పార్టీలో ఉన్నారో కూడా అర్ధం కాని పరిస్థితి ఉంది. ఎవర్ని ఏమన్నా పార్టీ వదిలిపోతారేమో అన్న భయం అధినేత చంద్రబాబుకు లేకపోలేదు.

ఇది చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా తయారయింది. ఒకపక్క అధికార పార్టీతో పోరాటం సాగించాలని చంద్రబాబు భావిస్తుంటే, పార్టీ నేతల అంతర్గత కలహాలతో బెజవాడలో టిడిపి కనుమరుగయ్యే ప్రమాదం కనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగి నేతల మధ్య సఖ్యత లేకుంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ బెజవాడ రాజకీయాల్లో మనుగడ సాగించటం కష్టమనే భావన వ్యక్తమవుతోంది.

English summary
The lack of unity among TDP leaders and the silence of the few key leaders has become a headache for Chandrababu. The situation is even worse now, especially in Krishna district. particularly Vijayawada politics are creating tension to Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X