విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంచలనం:ఎమ్మెల్యే కిడారి హత్య వెనుక టిడిపి నేతలు...పోలీస్ స్టేషన్లపై దాడి వెనక గంజాయి స్మగ్లర్!

|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం:అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య వెనుక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎమ్మెల్యే కిడారి హత్య వెనుక ఇద్దరు టిడిపి నేతలు ఉన్నారట. అయితే ఇది ఏ ప్రతిపక్ష నేతో చేసిన ఆరోపణ కాదు!...

<strong>ఎమ్మెల్యే కిలారిని సన్నిహితులే పట్టించారా?...ఔనంటున్నారు:పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు </strong>ఎమ్మెల్యే కిలారిని సన్నిహితులే పట్టించారా?...ఔనంటున్నారు:పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు

సాక్షాత్తూ పోలీసుల విచారణలో బయటపడిన నిజం. కిడారి హతమార్చాలని నిర్ణయించుకున్న మావోయిస్టులు ఆయన రాకపోకల గురించి తెలుసుకునేందుకు స్థానిక టిడిపి నేతలను సంప్రదించగా, వారు సహకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. వీరు ఇప్పటికే తమ నేరాన్ని అంగీకరించిన నేపథ్యంలో వీరి నుంచి మరిన్ని వివరాలు సేకరించి ఒకటి రెండు రోజుల్లోనే అరెస్ట్ చూపించే అవకాశం ఉందని తెలిసింది.

 టిడిపి నేతల పాత్ర...ఒప్పుకున్నారు

టిడిపి నేతల పాత్ర...ఒప్పుకున్నారు

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హతమార్చిన ఘటనలో మావోయిస్టులకు స్థానికంగా ఇద్దరు టిడిపి నాయకుల నుంచి పూర్తి సహకారం అందినట్లు పోలీసుల విచారణలో నిర్థారణ అయింది. వీరిలో ఒకరు మండల స్థాయి నాయకుడు కాగా, మరొకరు ఎంపిటిసి. ఈ ఇద్దరు నాయకులు కూడా ఎమ్మెల్యే కిడారికి అత్యంత నమ్మకస్తులలాగా వ్యవహరిస్తూనే...మరోవైపు మావోయిస్టుల వ్యూహరచనకు పూర్తి సహకారం అందించినట్లు పోలీసులు గుర్తించారు. మూడు రోజులు క్రితమే వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలో వారి ప్రమేయంపై కీలక ఆధారాలు సైతం సేకరించినట్లు తెలిసింది. వీరు కూడా ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యే జంట హత్యల్లో తమ పాత్ర ఉందని అంగీకరించినట్లు తెలిసింది.

మావోల...సరి కొత్త వ్యూహం

మావోల...సరి కొత్త వ్యూహం

మావోయిస్టులు ఎమ్మెల్యే కిడారిని హతమార్చాలనే నిర్ణయించుకున్న క్రమంలో కేవలం తమ యాక్షన్ టీమ్ కే పని అప్పగించేయడం కాకుండా ఈ దఫా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారని తెలిసింది. కిడారి హత్యకు వ్యూహంలో భాగంగా రాజకీయంగా ఆయనతో ఎవరు విభేదిస్తున్నారో మావోయిస్టులు తొలుత ఆరా తీశారు. మన్యంలో గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్న ఒక వ్యక్తితో మాట్లాడి అతని ద్వారా టిడిపికి ఒక ఎంపీటీసీని ఆగస్టులో రహస్య స్థావరానికి పిలిపించుకుని మాట్లాడారట. ఆ తరువాత దాడి విఫలం కాకుండా ఉండేందుకు ఎమ్మెల్యే రాకపోకలు తెలుసుకునే క్రమంలో ఈ ఎంపిటిసి ద్వారా టీడీపీ మండల స్థాయి నాయకుడిని స్థావరానికి రప్పించి అతడికి ఎమ్మెల్యేను తన పరిధిలోని ప్రాంతానికి పర్యటనకు రప్పించే పని అప్పగించారని, అతడు అలాగే చేశాడని తెలిసింది.

అలా ఆ ప్లాన్ లో...వీళ్ల భాగస్వామ్యం

అలా ఆ ప్లాన్ లో...వీళ్ల భాగస్వామ్యం

ఈ క్రమంలో మావోయిస్టులు ఆ ఎంపీటీసీని ఆగస్టు నెలలో మూడు సార్లు తమ రహస్య స్థావరానికి పిలిపించి మాట్లాడారని తెలిసింది. అతడు అంగీకరించాక ఇదే విషయాన్ని టీడీపీ మండల స్థాయి నాయకుడికి చెప్పాలనగా అతడు ఎంపిపిని ఒప్పించాడు. అలా సెప్టెంబరు 5న మావోయిస్టులు, టిడిపి ఎంపిటిసి, ఎంపిపి సమావేశమై దాడి కి రంగం సిద్దం చేసినట్లు తెలిసింది. ఆ క్రమంలో గ్రామాల్లోకి ఎమ్మెల్యే వచ్చే ముందు సమాచారం తమకు చేరవేయాలని నక్సల్స్‌ వారికి సూచించడంతో పాటు ఎమ్మెల్యేని రప్పించాలని ఎంపిపికి సూచించారు.

ఫస్ట్ ఎటెంప్ట్ ...వర్కౌట్ కాలేదు

ఫస్ట్ ఎటెంప్ట్ ...వర్కౌట్ కాలేదు

మావోయిస్టుల సూచన ప్రకారం ఆ ఎంపిపి సెప్టెంబరు 19న గ్రామదర్శినికి రావాలని ఎమ్మెల్యే కిడారిని ఆహ్వానించాడు. ఆయన వస్తానని చెప్పడంతో ఆ విషయం మావోయిస్టులకు చేరవేశాడు. దీంతో మావోయిస్టులు రెండు రోజులు ముందుగా గ్రామానికి చేరుకుని దాడికి సిద్ధమయ్యారు. అదే విషయం మావోయిస్టు మిలిటరీ కమిటీ విభాగానికి తెలిపి అనుకూలతలు, ప్రతికూలతలు చర్చించుకున్నారు. ఈ క్రమంలో మావోయిస్టు నాయకురాలు అరుణ తన బృందంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించి వెళ్లింది. సెప్టెంబరు 19న దాడికి రంగం సిద్ధమైంది. అయితే అదే సమయంలో అనూహ్యంగా ఎమ్మెల్యే భార్య అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చి ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నారు. దీంతో ఆ రోజు మావోయిస్టుల ప్లాన్‌ వర్కౌట్ కాలేదు.

రెండో ప్రయత్నం...టార్గెట్ ఫినిష్

రెండో ప్రయత్నం...టార్గెట్ ఫినిష్

అయితే ఆ తరువాత ఎమ్మెల్యే కిడారి ఎంపిపి,ఇతర నేతలకి ఫోన్ చేసి తన భార్య అనారోగ్యం కారణంగా గ్రామదర్శిని రాలేక పోయానని...సెప్టెంబరు 23న ఖచ్చితంగా వస్తానని చెప్పారు. అలా ఆ విషయం కూడా మావోయిస్టులకు చేరడంతో వారు ఈ మార్గంపై నిఘావేసి ఉంచారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కిడారి...మాజీ ఎమ్మెల్యే సివేరి సోమతో కలిసి అనుచరులతో ఆ మార్గంలో వెళుతుండగా లిపిటిపుట్టు వద్ద ఆ రెండు వాహనాల రాకను గమనించిన ఒక మావోయిస్టుల బృందం ఆ విషయాన్ని ఊరి బయట చిన్న గిరిజన తండా వద్ద మాటు వేసి ఉన్న మరో సాయుధ మావోయిస్టు దళానికి చేరవేశారు. దీంతో వెంటనే అలెర్ట్ అయిన ఆ దళం ముందు ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డగించి ఆయన్ను కిందకు దించింది. అదే సమయంలో సారాయి గూడెం వైపు నుంచి వస్తున్న వాహనాలను, పాదచారులను అక్కడున్న మరో దళం అడ్డుకోగా...గ్రామంలో ముందుగా వాహనాలను చూసి సమాచారం ఇచ్చిన మావోల బృందం గ్రామంలోని గిరిజనులు అటువైపు వెళ్లకుండా అడ్డుకుంది. అలా ఇక్కడి మావోలు ముందు మాజీ ఎమ్మెల్యే సివేరి, ఆ తరువాత ఎమ్మెల్యే కిడారితో మాట్లాడిన మావోయిస్టులు వారిని అక్కడికక్కడే కాల్చిచంపారు.

పిఎస్ లపై దాడి...గంజాయి స్మగ్లర్ హస్తం

పిఎస్ లపై దాడి...గంజాయి స్మగ్లర్ హస్తం

ఈ క్రమంలో ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు మట్టుబెట్టేశారన్న విషయం తెలియడంతోనే ఈ వ్యూహంలో ముందునుంచి పాలుపంచుకుంటున్న గంజాయి స్మగ్లర్ తన స్మగ్లింగ్ కార్యకలాపాల విషయమై పోలీసుల తీరుకు వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. అందుకే ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి హత్యల విషయంపై వారి అనుచరులను రెచ్చగొట్టి పోలీసులపై దాడికి ఉసిగొల్పాడు. పోలీసులు మనల్ని ఇబ్బంది పెట్టడమే తప్ప మన నాయకులను ఏ మాత్రం కాపాడలేకపోయారంటూ రెచ్చగొట్టాడు. దీంతో ఆగ్రహంతో మండిపడిన గిరిజనులు పోలీసులపై, పోలీసు స్టేషన్లపై దాడి చేశారు. వీటన్నింటిని ఈ ఇద్దరు టీడీపీ నేతలు, ఆ స్మగ్లర్‌ అంగీకరించడంతో వారిని ఒకటి రెండు రోజుల్లో అరెస్టు చూపే అవకాశాలున్నాయని తెలిసింది.

English summary
Visakhapatnam:The Maoists have gunned down MLA Kidari Sarveswara Rao and also ex- MLA Soma at Araku agency in Visakhapatnam District. It is now found by the police, that two TDP leaders were also involved in Kidari Sarveswara Rao murder, by helping the maoists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X