వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కవాతు: పవన్‌పై టీడీపీ నేతల మూకుమ్మడి దాడి, 'బొత్స అలా చెబితే జగన్ సీరియస్‌గా చూశారట'

|
Google Oneindia TeluguNews

ధవళేశ్వరం: జనసేన కవాతు, జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన తెలుగుదేశం పార్టీ నేతలు సోమవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కవాతుకు బదులు శ్రీకాకుళం జిల్లాలో వచ్చిన టిట్లీ తుఫాను బాధితులను పరామర్శించాల్సిందని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు.

చదవండి: నన్ను గుర్తుంచుకోండి: అభిమానులకు పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు చురకలు

Recommended Video

నన్ను సీఎం అనండి అని అడిగి పిలిపించుకున్న పవన్

మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ మహిళా ఎమ్మెల్యే వంగలపూడి అనిత జనసేనాని తీరును తప్పుబట్టారు. అదే సమయంలో వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై కూడా విమర్శలు గుప్పించారు.

చదవండి: ఇప్పటి వరకు పవన్ ఒంటరి పోరాటం, ఇది చూసి ఆయన కళ్లలో ఆనందం: హైపర్ ఆది

సందుల్లో, గొందుల్లో కాదు జాతీయ రహదారిపై సభ పెట్టాలి

సందుల్లో, గొందుల్లో కాదు జాతీయ రహదారిపై సభ పెట్టాలి

రాజకీయ పార్టీలు విజ్ఞతతో వ్యవహరించాలని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. డ్యాముల పైన బలప్రదర్శన ఏమాత్రం తగదని చెప్పారు. సందుల్లో, గొందుల్లో సభలు పెట్టి జనం ఎక్కువగా వచ్చినట్లు చూపుతున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే జాతీయ రహదారులపై పెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్‌లను సవాల్ చేశారు. దవళేశ్వరం బ్యారేజీ పైన జగన్ డ్రోన్ల సాయంతో సినిమా చూపిస్తే, దానికి పోటీగా పవన్ కవాతు నిర్వహించారన్నారు. చిన్న చిన్న దారుల్లో సభలు పెట్టి ఎక్కువ మంది వచ్చినట్లుగా చూపిస్తున్నారనేది టీడీపీ వాదన.

బొత్స అలా చెబితే జగన్ సీరియస్‌గా చూశారట

బొత్స అలా చెబితే జగన్ సీరియస్‌గా చూశారట

ఉద్దానం.. ఉద్దానం అని పలకరించిన నేతలు ఇప్పుడు ఎక్కడికి పోయారని పవన్‌ను ఉద్దేశించి దేవినేని అన్నారు. మావోయిస్టుల దాడి విషయంలో జగన్ ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. మావోయిస్టుల చర్యలకు వ్యతిరేకంగా ధర్నా చేద్దామని బొత్స సత్యనారాయణ అంటే జగన్ ఆయన వైపు సీరియస్‌గా చూశారట అన్నారు.

పవన్ జనంతో పూలు చల్లించుకుంటున్నారు

పవన్ జనంతో పూలు చల్లించుకుంటున్నారు

రాజకీయాలకు జగన్, పవన్ కళ్యాణ్‌లు వేరే అర్థాలు చెబుతున్నారని మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షాలు సాయం చేయాలి లేదా మౌనంగా ఉండాలని హితవు పలికారు. విజయనగరంలో ఉన్నప్పటికీ జగన్ తుఫాను బాధితులను పరామర్శించలేదని చెప్పారు. జనంతో పవన్ కళ్యాణ్ పూలు చల్లించుకుంటున్నారని మండిపడ్డారు. ఉద్దానంలో రక్షిత మంచినీరు అందిస్తున్నామని చెప్పారు.

పవన్ కవాతు వాయిదా వేసుకోవాల్సింది

పవన్ కవాతు వాయిదా వేసుకోవాల్సింది

టిట్లీ తుఫాను బాధితులను పవన్ కళ్యాణ్ ఇంత వరకు పరామర్శించలేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు. కవాతును వాయిదా వేసుకొని శ్రీకాకుళం జిల్లాలో పర్యటించవచ్చు కదా అని సూచించారు. పవన్ కవాతు ఎందుకు నిర్వహిస్తున్నారో కూడా ఎవరికీ తెలియదన్నారు. కవాతు కోసం ఖర్చు చేసిన దాంట్లో సగమైనా తుఫాన్ బాధితులకు ఇవ్వాల్సింది అన్నారు.

English summary
Telugudesam Party leaders and Ministers fired at Jana Sena chief Pawan Kalyan for Kavathu and Public meeting in East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X