వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాయిరెడ్డికి జగన్ బర్త్ డే గిఫ్ట్ - అంబులెన్స్ ల ఓపెనింగ్ కారణమిదే - టీడీపీ నేతల సెటైర్లు..

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ సన్నిహితుడు, వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి పుట్టిన రోజు ఇవాళ. ఆయన పుట్టినరోజుకు పార్టీ అధినేత కమ్ టీడీపీ నేతలు ముద్దుగా పిలుచుకునే ఆయన అల్లుడు జగన్ ఏం గిఫ్ట్ ఇచ్చి ఉంటారన్న ఆసక్తి సహజంగానే అందరిలోనూ ఉంటుంది. ఇవాళ ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆరోగ్య సేవల్లో సువర్ణాధ్యాయంగా భావిస్తున్న 104, 108 అంబులెన్స్ ల ప్రారంబోత్సవ కార్యక్రమాన్ని విజయవాడలో ఘనంగా నిర్విహించింది. దీంతో సాయిరెడ్డికి జగన్ అంబులెన్స్ లను గిఫ్ట్ గా ఇస్తున్నారంటూ టీడీపీ నేతలు ట్విట్టర్ లో సెటైర్లకు దిగుతున్నారు.

 అందుబాటులో అధునాతన అంబులెన్సులు: ప్రారంభించిన జగన్: జిల్లాల సరిహద్దుల్లో స్వాగత ఏర్పాట్లు అందుబాటులో అధునాతన అంబులెన్సులు: ప్రారంభించిన జగన్: జిల్లాల సరిహద్దుల్లో స్వాగత ఏర్పాట్లు

 సాయిరెడ్డికి జగన్ గిఫ్ట్ అంబులెన్స్ లే..

సాయిరెడ్డికి జగన్ గిఫ్ట్ అంబులెన్స్ లే..

వైసీపీ ఎంపీ, పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డికి అధినేత జగన్ ఈసారి పుట్టినరోజు గిఫ్ట్ గా ఏమిచ్చారో తెలుసా. టీడీపీ నేతలను అడిగితే మాత్రం 104,108 అంబులెన్స్ లను ఇస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయం బయటపెట్టింది ఎవరో కాదు విపక్ష టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, మాజీ మంత్రి అయ్యనపాత్రుడు. సాయిరెడ్డి పుట్టిన రోజును ఇలా అంబులెన్స్ ల ప్రారంభోత్సవానికి లింక్ పెట్టి ట్విట్టర్ లో వీరు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే అంబులెన్స్ ల నిర్వహణ కాంట్రాక్టును సాయిరెడ్డి అల్లుడికి ప్రభుత్వం ఎక్కువ రేట్లకు కట్టబెట్టిందని ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు ఇవాళ వాటి ఓపెనింగ్ సందర్భంగా ట్విట్టర్ లో రెచ్చిపోతున్నారు.

 సాయిరెడ్డికి రూ.300 కోట్ల గిఫ్ట్...

సాయిరెడ్డికి రూ.300 కోట్ల గిఫ్ట్...

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మరో అడుగు ముందుకేసి జగన్ తన అనుచరుడు సాయిరెడ్డికి పుట్టినరోజు సందర్భంగా రూ.300 కోట్ల విలువైన భారీ గిఫ్ట్ ఇచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. 300 కోట్ల ప్రజాధనంతో ఏ2 విజయసాయిరెడ్డికి జన్మదినం సందర్భంగా జగన్ గిఫ్ట్ గా ఇస్తున్నారంటూ ట్విట్టర్ లో విమర్శలకు దిగారు. అప్రూవర్ గా మారకుండా ఉండటానికి ఆ మాత్రం సమర్పించుకోకపోతే ఎలా అంటూ జగన్ ఆస్తుల కేసును కూడా ప్రస్తావించారు. జగన్ ఆస్తుల కేసులో ఏ2గా ఉన్న సాయిరెడ్డి అప్రూవర్ గా మారకుండా ఉండటానికి జగన్ అంబులెన్స్ ల నిర్వహణ పేరుతో రూ.300 కోట్లు ఇస్తున్నారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

Recommended Video

Nellore Tourism Office Incident : దివ్యాంగురాలైన మహిళపై ఇనుప రాడ్డుతో దాడి, బాలీవుడ్ తారల ఆగ్రహం..!!
 అల్లుడి రిటర్న్ గిఫ్ట్...

అల్లుడి రిటర్న్ గిఫ్ట్...

టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరో ట్వీట్ లో సాయిరెడ్డి పుట్టిన రోజు, అంబులెన్స్ ల ఓపెనింగ్ ఒకే రోజు రావడం యాదృచ్ఛికమా లేక మీరు వేసిన రివర్స్ టెండర్ కు అల్లుడిచ్చిన రిటర్న్ గిఫ్టా అంటూ మరింత మసాలా దట్టించారు. 104, 108 అంబులెన్స్ కాంట్రాక్టును రివర్స్ టెండరింగ్ పేరుతో జీవీకే సంస్ధ నుంచి వెనక్కి తీసుకుని సాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి చెందిన అరబిందో ఫౌండేషన్ కు కట్టబెట్టింది. దీన్ని గుర్తు చేస్తూ సాయిరెడ్డిని బుద్దా వెంకన్న ఇరుకున పెట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. చివర్లో ఇప్పటికైనా సాయిరెడ్డి మనసు మార్చుకుని జగన్ ఆస్తుల దొంగ లెక్కల చిట్టా బయటపెట్టాలని బుద్దా సూచించారు. ఫైనల్ గా సాయిరెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు.

English summary
telugu desam party leaders are linking ysrcp mp vijaya sai reddy's birthday occassion to 104 and 108 ambulances opening in andhra pradesh today. earlier tdp leaders alleged that ap govt had given the vehicles maintainance contract to vijaya sai reddy's son-in-law for higher prices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X