• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసిన టీడీపీ నేతల స్పందన .. ఎస్సీ, ఎస్టీ కమీషన్ ను కలుస్తారట

|

జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను టీడీపీ నేతల బృందం కలిసింది. ఏపీలో పెరిగిపోయిన దాడుల నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని పరిస్థితులను,టిడిపి కార్యకర్తలు హత్యకు గురైన వివిధ ఘటనలను జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు టీడీపీ నేతలు విన్నవించారు. గల్లా జయదేవ్, నక్కా ఆనంద బాబు, అశోక్ బాబు, మద్దాలి గిరి, డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితరులు జాతీయ మానవ హక్కుల కమిషన్ తో మాట్లాడారు. వైసీపీ దాడులకు సంబందించి కొన్ని ఆధారాలను టీడీపీ నేతలు కమిషన్‌కు ఇచ్చారు.

ఏపీలో పరిస్థితులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ

ఏపీలో పరిస్థితులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ

జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు వచ్చిన నేపధ్యంలో కమీషన్ ను కలిసిన టీడీపీ నేతలు ఏపీలో అరాచకపాలనపై మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అరాచకం కొనసాగుతుందని, ఇప్పటి వరకు 800 మంది సానుభూతిపరులపై వైసీపీ శ్రేణులు దాడులు చేశాయని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. ఇప్పటివరకు ఎనిమిది మంది టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారన్నారు. దీనిపై గత నెలలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయగా ఇప్పుడు విచారణకు వచ్చారని పేర్కొన్నారు . ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు.

వైసీపీ అరాచకాలపై ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

వైసీపీ అరాచకాలపై ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

మాజీ మంత్రి, టిడిపి నేత నక్కా ఆనంద బాబు సైతం జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు వచ్చిన నేపథ్యంలో తన స్పందనను తెలియజేశారు. ఐదు నెలల కాలంలో టీడీపీ నేతల పై , కార్యకర్తలపై జరిగిన దాడులను మానవ హక్కుల కమిషన్ కు వివరించామని ఆయన పేర్కొన్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని చేపట్టామని గుర్తు చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే పోలీసులు తమను ఇబ్బందులకు గురి చేశారని కూడా నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. కమిషన్ విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, ప్రజాస్వామ్యానికి భంగం కలగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కానీ ప్రభుత్వం అలా ప్రవర్తించటం లేదని ఆనంద్ బాబు పేర్కొన్నారు.

ఎస్సీ, ఎస్టీ కమీషన్ ను కలుస్తామంటున్న టీడీపీ నేతలు

ఎస్సీ, ఎస్టీ కమీషన్ ను కలుస్తామంటున్న టీడీపీ నేతలు

ఇక టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఏపీ లో జరుగుతున్న దాడులు, అక్రమ కేసులు, కోడెల మృతి తదితర ఘటనలపై తమ వద్ద ఉన్న ఆధారాలను ఇచ్చామని పేర్కొన్నారు. త్వరలో ఎస్సీ ఎస్టీ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసి వైసిపి అరాచకాలను ఎండగడతామని అశోక్ బాబు పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి దాడులు విపరీతంగా పెరిగాయని ఆయన అన్నారు. ఇక ఎన్‌హెచ్‌ఆర్సీ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.

మానవహక్కుల కమీషన్ విచారణపై సర్వత్రా ఆసక్తి

మానవహక్కుల కమీషన్ విచారణపై సర్వత్రా ఆసక్తి

మొత్తానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు వచ్చిన నేపథ్యంలో టిడిపి నాయకులు ఏపీలో కొనసాగుతున్న అరాచకత్వం పై, తమపై, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై కమీషన్ దృష్టికి తీసుకు వెళ్లారు. టీడీపీ నేతలపై కేసులు పెట్టించి వేధింపులకు గురి చేస్తున్నారని కూడా కమీషన్ దృష్టికి తీసుకువెళ్ళారు.తాజా విచారణ నేపధ్యంలో మానవ హక్కుల కమీషన్ ఈ ఘటనలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

English summary
The National Human Rights Commission met with a group of TDP leaders. In the wake of the AP attacks, the TDP leaders have heard the situation in Guntur district and the various incidents in which TDP activists have been killed. The TDP leaders gave some credentials to the Commission regarding the YCP attacks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X