వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘పవన్‌కి కౌంట్‌డౌన్! అన్న కాంగ్రెస్‌కి.. తమ్ముడెవరికో?-చిరుతో 20ఏళ్లు వెనక్కి’

|
Google Oneindia TeluguNews

Recommended Video

చిరంజీవి కాంగ్రెస్ కు, పవన్ కళ్యాణ్ ఎవరికో : పవన్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ !

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, మంత్రి లోకేష్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో టీడీపీ కూడా అదే స్థాయిలో అదే స్థాయిలో విరుచుకుపడింది.

హోదా కోసం పోరాడుతున్న తమ పార్టీపై పవన్‌కళ్యాణ్‌ రాళ్లు వేయడం ఎవరికి మేలు చేయడానికని తెలుగుదేశంపార్టీ నిలదీసింది. పవన్‌కళ్యాణ్‌ ఆరోపణలు హోదా ఉద్యమాన్ని నీరుగార్చేలా ఉన్నాయని టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు.

పవన్ కీలు బొమ్మలా..

పవన్ కీలు బొమ్మలా..

చంద్రబాబును తిట్టడమే పనిగా పెట్టుకున్నారని పవన్‌పై ఎమ్మెల్యే అనిత పండిపడ్డారు. పవన్‌ను వెనకుండి ఎవరో నడిపిస్తున్నారని ఆమె ఆరోపించారు. గుంటూరు సభలో పవన్‌కు ఒక్కరాత్రిలోనే జ్ఞానోదయం అయినట్లు మాట్లాడారని అన్నారు. సభలో కనీసం జేఎఫ్‌సీ గురించి మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇన్నాళ్లు ఎక్కడా మాట్లాడని పవన్.. జనసేన ఆవిర్భావ సభలోనే టీడీపీపై విమర్శలు చేయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కేంద్రం చేతుల్లో పవన్ కీలు బొమ్మగా మారారని, ఆయన ఒకసారి పునరాలోచించుకోవాలని సూచించారు.

మోసం చేసిన చిరును అడుగు పవన్..

మోసం చేసిన చిరును అడుగు పవన్..

కాగా, టీడీపీ ఎమ్మెల్యే పీతల సుజాత.. వపన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లకు పవన్‌ క్షమాపణ చెప్పాలని పీతల సుజాత డిమాండ్‌ చేశారు. ప్రశ్నిస్తా అంటున్న పవన్‌ ముందు అన్న(చిరంజీవి)ను ప్రశ్నించాలన్నారు. ఎంతో మంది నాయకులను చిరంజీవి మోసం చేశారని అన్నారు. రాజ్యసభలో పోరాటం చేయనందుకు చిరంజీవిని ప్రశ్నించాలని సూచించారు.

మోడీ! ఎందుకిలా?, వైసీపీ కుట్ర, పవన్‌పై నిఘా, బీజేపీ ఓడిపోయిందని..: బాబు ఆవేదనమోడీ! ఎందుకిలా?, వైసీపీ కుట్ర, పవన్‌పై నిఘా, బీజేపీ ఓడిపోయిందని..: బాబు ఆవేదన

 చిన్న ఇల్లు కోసమే 2 ఎకరాలైతే?.. కౌంట్ డౌన్..

చిన్న ఇల్లు కోసమే 2 ఎకరాలైతే?.. కౌంట్ డౌన్..

పవన్‌ కల్యాణ్‌ చిన్న ఇల్లు కోసం రెండు ఎకరాలు కావాలి కానీ.. రాష్ట్ర రాజధానికి ఇన్ని ఎకరాలు అవసరం అంటారా? అని పీతల ప్రశ్నించారు. పవన్‌కు రాజకీయ కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందన్నారు. మరో నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. మోడీ ఇచ్చిన స్క్రిప్టునే పవన్ చదివారని అన్నారు. చంద్రబాబుపై ఆరోపణలతో పవన్‌కు కౌంట్ డౌన్ మొదలైందని అన్నారు.

పవన్! ఆంతర్యమేంటి? మమ్మల్నే తిడతారా? లోకేష్‌పై విమర్శలా?: తొలిసారి బాబు ఆగ్రహంపవన్! ఆంతర్యమేంటి? మమ్మల్నే తిడతారా? లోకేష్‌పై విమర్శలా?: తొలిసారి బాబు ఆగ్రహం

ప్రజల గొంతునొక్కేందుకే..

ప్రజల గొంతునొక్కేందుకే..

మంత్రి నారాయణ మాట్లాడుతూ.. విభజన చట్టాన్ని అమలు చేయాలనే బీజేపీతో నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. టీడీపీని అవినీతి పార్టీ అంటారా? అని పవన్ కళ్యాణ్‌పై నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిలో నెం.1గా ఉన్న ఏపీని 13వ స్థానానికి తీసుకొచ్చామని తెలిపారు. పవన్‌కు ఏం మాట్లాడుతున్నారో.. ఆయనకే తెలియదని నారాయణ ఎద్దేవా చేశారు. పవన్ దీక్ష ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని, ఇన్నాళ్లు ఏం పోరాటం చేశారని.. ఏపీ ప్రజల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

 చిరు కాంగ్రెస్‌కు.. తమ్ముడెవరికో..

చిరు కాంగ్రెస్‌కు.. తమ్ముడెవరికో..

ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి వల్ల కాపులు 20ఏళ్ల వెనక్కి వెళ్లారని నారాయణ మండిపడ్డారు. అంతేగాక, చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ కు తాకట్టు పెట్టారని.. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్.. ఎవరికి తాకట్టు పెడతారో అంటూ ఎద్దేవా చేశారు. పవన్‌ను చూసి కాపులంతా భయపడుతున్నారని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే జనసేనకు కూడా పడుతుందని నారాయణ అన్నారు.

 బాబు రాత్రి రాత్రికే చెడ్డోడా?.. పవన్‌కు మతిభ్రమించింది

బాబు రాత్రి రాత్రికే చెడ్డోడా?.. పవన్‌కు మతిభ్రమించింది

నిన్నటి వరకు పవన్‌కు మంచిగా కనిపించిన చంద్రబాబు రాత్రికి రాత్రే చెడ్డోడు అయ్యాడా? అని మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ప్రజల అండ ఉన్నంతకాలం పవనే కాదు ఎలాంటి వాళ్ళు వచ్చిన టీడీపీకి ఇబ్బంది లేదని టీడీపీ ఎమ్మెల్యే బికె పార్థసారధి అన్నారు. అజ్ఞాతవాసి సినిమా ప్లాప్ కావడంతో పవన్‌కు మతిభ్రమించిందని.. అందుకే ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదన్నారు.

English summary
TDP leaders Narayana and peetala Sujatha and Ayyannapatrudu on Thursday fired at Janasena president Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X