వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శివాజీ చెప్పిన ఆపరేషన్ ద్రవిడ కచ్చితంగా జరుగుతోంది, అమిత్ షా ఎప్పుడో చెప్పారు: బాంబుపేల్చిన టీడీపీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

Operation Dravida : జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ స్విచ్ మోడీ దగ్గర ఉంది

అమరావతి: నటుడు శివాజీ ఆపరేషన్ ద్రవిడ, ఆపరేషన్ గరుడ అంటూ గురువారం మీడియా ఎదుట సంచలన విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌లు స్పందిస్తూ.. సినిమాల్లో చూపించినట్లు రాజకీయ వ్యూహాలు ఉండవని కొట్టిపారేశారు.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

దీనిపై తాజాగా, తెలుగుదేశం కూడా స్పందించింది. టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బుద్దా వెంకన్న తదితరులు మాట్లాడారు. ఆపరేషన్ 7 రాష్ట్రాలని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా 2015లోనే చెప్పారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కానీ తాము బీజేపీని బలోపేతం చేసుకుంటారనుకున్నాం కానీ, కుట్ర పన్నుతారనుకోలేదని ధ్వజమెత్తారు.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

మేం ఎక్కడా గీత దాటలేదు

మేం ఎక్కడా గీత దాటలేదు

తాము నాలుగేళ్లుగా మిత్రధర్మం పాటిస్తున్నామని సోమిరెడ్డి తెలిపారు. తాము యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీయేల్లో భాగస్వాములుగా ఉన్నప్పటికీ ఎక్కడా గీత దాటలేదని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము అన్ని అవమానాలు భరించామన్నారు. కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టలేదని వైసీపీని ఉద్దేశించి అన్నారు.

శివాజీ! ఇది సినిమా కాదు, కళ్యాణ్ జీ చెప్పారని..: టీడీపీ, వైసీపీలపై తేల్చేసిన ఉండవల్లిశివాజీ! ఇది సినిమా కాదు, కళ్యాణ్ జీ చెప్పారని..: టీడీపీ, వైసీపీలపై తేల్చేసిన ఉండవల్లి

 కటీఫ్ చెప్పినా ఇద్దర్ని రాజ్యసభకు పంపించాం

కటీఫ్ చెప్పినా ఇద్దర్ని రాజ్యసభకు పంపించాం

బీజేపీ తెలంగాణలో తనంతట తానే తమ పార్టీతో తెగదెంపులు చేసుకుందని సోమిరెడ్డి చెప్పారు. అయినప్పటికీ తాము నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభులను రాజ్యసభకు పంపించామని చెప్పారు. దేశంలో మరే ప్రాంతీయ పార్టీ కూడా బీజేపీని నమ్మే పరిస్థితుల్లో లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి మిత్రధర్మం తెలుసునని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలకు తాజాగా రూ.3వేల కోట్లు ఇచ్చి ఏపీకి విస్మరించారని చెప్పారు.

పెన్‌డ్రైవ్‌లో జాతీయపార్టీ 'ఆపరేషన్ ద్రవిడ': ఏపీపై 'గరుడ' ప్లాన్ ఇలా.. ఆ ముగ్గురు నేతలకు ఇలా షాక్పెన్‌డ్రైవ్‌లో జాతీయపార్టీ 'ఆపరేషన్ ద్రవిడ': ఏపీపై 'గరుడ' ప్లాన్ ఇలా.. ఆ ముగ్గురు నేతలకు ఇలా షాక్

 వీరంతా మౌనంగా ఉన్నారు కానీ

వీరంతా మౌనంగా ఉన్నారు కానీ

టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాసానికి 160 మంది ఎంపీల మద్దతు ఉందని, దీనికి తోడు వ్యక్తిగతంగా ప్రధాని మోడీపై పలువురు బీజేపీ ఎంపీల్లో వ్యతిరేకత ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఇప్పటిదాకా మౌనంగా ఉన్న వీరంతా అవిశ్వాసం తీర్మానంపై ఓటింగ్ ప్రారంభం కాగానే కేంద్రానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారేమో అన్నారు.

ఓ జాతీయ పార్టీ భారీ ఆపరేషన్, పావుగా కొత్త నాయకుడు, రూ.4800 కోట్లు ఖర్చు: శివాజీ సంచలనంఓ జాతీయ పార్టీ భారీ ఆపరేషన్, పావుగా కొత్త నాయకుడు, రూ.4800 కోట్లు ఖర్చు: శివాజీ సంచలనం

 నరేంద్ర మోడీలో ఆ భయం

నరేంద్ర మోడీలో ఆ భయం

తనపై అసంతృప్తితో ఉన్న బీజేపీ ఎంపీలు కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తారేమోననే భయం ప్రధాని నరేంద్ర మోడీలో ఉందని బుద్ధా వెంకన్న అన్నారు. అందుకే గత ఆరు రోజులుగా అవిశ్వాస తీర్మానాన్ని ఇస్తున్నప్పటికీ లోకసభలో చర్చను చేపట్టలేదన్నారు.

ఏపీ ప్రభుత్వం కూల్చివేత.. రేపు పార్లమెంటులో ఇలా: శివాజీ మరో షాక్, పార్టీ పేరు చెప్పిన మహేష్ కత్తిఏపీ ప్రభుత్వం కూల్చివేత.. రేపు పార్లమెంటులో ఇలా: శివాజీ మరో షాక్, పార్టీ పేరు చెప్పిన మహేష్ కత్తి

శివాజీ చెప్పిన ఆపరేషన్ జరుగుతోంది

శివాజీ చెప్పిన ఆపరేషన్ జరుగుతోంది

హీరో శివాజీ చెప్పిన ఆపరేషన్ ద్రవిడ అనేది కచ్చితంగా జరుగుతోందని బుద్దా వెంకన్న చెప్పారు. ఎదుటి వ్యక్తులను అణిచివేసే ధోరణి మోడీకి ఉందని, అందుకే ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన టీడీపీని ఇబ్బందులపాలు చేసే పనులు చేపట్టారని ధ్వజమెత్తారు. ఆపరేషన్ ద్రవిడకు కేటాయించిన వేల కోట్ల రూపాయలను పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 మోడీ వద్ద జగన్ ఫ్యాన్ స్విచ్

మోడీ వద్ద జగన్ ఫ్యాన్ స్విచ్

నేరగాళ్ల ప్రమేయంతో ప్రధానమంత్రి కార్యాలయం అపవిత్రమవుతోందని మరో టీడీపీ నేత జీవీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ స్విచ్ మోడీ వద్ద ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి ప్రివిలేజ్ మోషన్ పెడతామంటే భయపడమని చెప్పారు.

English summary
Film actor Sivaji has said that a national party has taken up ‘Operation Dravida’ to capture power in South India and is spending Rs 4,800 crore for the purpose.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X