వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోడెలను సీఎం జగన్ హత్య చేసారు : ప్రభుత్వంపై కేసు పెట్టాలి: టీడీపీ నేతల తీవ్ర వ్యాఖ్యలు..!!

|
Google Oneindia TeluguNews

మాజీ స్పీకర్..టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద రావు బలవన్మరణం మీద టీడీపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం మీద మండిపడుతున్నారు. కోడెలను ఆయన కుటుంబ సభ్యులను వెంటాడి వేధించారంటూ ఫైర్ అయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీ నేత కోడెల మరణం పైన తీవ్రంగా స్పందించారు. కోడెలది ఆత్మహత్య కాదని, దారుణహత్య అన్నారు. ఆయనను సీఎం జగన్మోహన్ రెడ్డి దారుణంగా హత్యచేశారని ట్వీట్ చేసారు. మరో నేత వర్ల రామయ్య కోడెల మరణం మీద ప్రభుత్వం మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం కోడెలను ప్రభుత్వం వేధించిందని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయాల మీద పార్టీ జెండాలను అవతనం చేయాలని..పార్టీ కార్యాలయాల్లో సంతాప సభలు నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు. కోడెల ఆత్మహత్య చేసుకొనే అంత పిరికివారు కాదని చెప్పుకొచ్చారు.

కోడెల మరణం మీద రాజకీయ దుమారం..
ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మరణం పైన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు. ఇదే సమయంలో టీడీపీ నేతలు ఏపీ ప్రభుత్వం మీద మండిపడ్డారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేసారు. కోడెలది ఆత్మహత్య కాదని, దారుణహత్య అన్నారు. ఆయనను సీఎం జగన్ దారుణంగా హత్యచేశారని ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా కేశినేని ఈ వ్యాఖ్యలు చేశారు. కోడెల శివ ప్రసాదరావు మరణం విషయంలో ప్రభుత్వం పైన కేసు నమోదు చేయాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేసారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం ఆవేదన వ్యక్తం చేసారు. కోడెలను చనిపోయేంతవరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.

TDP leaders serious comments on YCP govt regarding Kodela suicide

Recommended Video

మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య

కోడెల మెడపై గాట్లు ఉన్నాయని, ఆత్మహత్యగా భావిస్తున్నామని ఆయన అన్నారు. కోడెల బాధ్యతలు నిర్వహించిన బసవతారకం ఆస్పత్రిలోనే.. మృతిచెందడం బాధాకరమని సోమిరెడ్డి విచారం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఆలపాటి రాజా.. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు సైతం కోడెల మరణానికి ప్రభుత్వం కారణమని ఆరోపించారు. కోడెల ఆత్మహత్య చేసుకొనేంత పిరికివారు కాదని చెప్పుకొచ్చారు. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం లో పార్టీ నేతలతో అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రభుత్వం వేధింపులకు గురి చేసిందని..ఆయన మానసిక వేదనకు గురయ్యారని నేతలు అభిప్రాయ పడ్డారు. ఇదే సమయంలో పార్టీ నేతలంగా కోడెల మరణానికి ప్రభుత్వ తీరు కారణమనే ఆరోపణలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం చేసిన వేధింపులే కోడెల మరణానికి కారణమని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు.

రాష్ట్ర వ్యాప్తంగా కోడెల సంతాప సభలు..

పార్టీ అధినేత చంద్రబాబు కోడెల మరణం పట్ల ఆవేదనకు గురయ్యారు. కోడెల మరణం టీడీపీకి తీరని లోటని పేర్కొన్నారు. రాజకీయాల్లో కోడెల తన ముద్ర వేసుకున్నారని లోకేశ్ సంతాపం వ్యక్తం చేసారు. కోడెల సంతాప సభలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు. అదే సమయంలో అన్ని జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండాలను అవనతం చేయాలని నిర్ణయించారు. కోడెల భౌతిక ఖాయం మంగళవారం స్వగ్రామానికి తీసుకురావాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా ముందుగా భారీగా పోలీసు బలగాలను మొహరించారు.

TDP leaders serious comments on YCP govt regarding Kodela suicide

144 సెక్షన్ విధించారు. ఇదే సమయంలో టీడీపీ నేతల విమర్శలకు వైసీపీ చీఫ్ విప్ శ్రీకాంత రెడ్డి ఖండించారు. సీనియర్ నేత మరణించిన సమయంలో రాజకీయాలు చేయటం సరి కాదన్నారు. టీడీపీ ప్రతీదీ రాజకీయంగా చేస్తున్నారని మండిపడ్డారు. కోడెల మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసారు. అంబటి రాంబాబు సైతం కోడెల మరణం పైన అనేక రకాల వార్తలు వస్తున్నాయని..దీని పైన విచారణ జరపాలని అంబటి రాంబాబు కోరారు.

English summary
TDP leaders serious comments on YCP govt regarding Kodela suicide. MP Kesineni Nani in his tweet says JAgan murder Kodela.Varla Ramaiah demanded for file case against Ap Govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X