వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా స్పందించారంటే..

నంద్యాల బహిరంగ సభలో సీఎం చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, నాయకులు మండిపడ్డారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బోండా ఉమా తమదైన శైలిలో జగన్ పై విరుచుకుపడ్

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి: నంద్యాల బహిరంగ సభలో సీఎం చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, నాయకులు మండిపడ్డారు. తమదైన శైలిలో జగన్ పై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ, చంద్రబాబుపై జగన్ చేసిన ఆరోపణల్లో పస లేదని, అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.

చంద్రబాబు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని, 'నవరత్నాల' కోసం 2019 వరకు ప్రజలు ఆగలేరని, అవన్నీ ఇప్పుడే తాము ప్రజలకు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ap-tdp-leaders

మరో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, జగన్ అధికార దాహంతో మాట్లాడినట్టు అనిపించిందని, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా హుందాతనంతో వ్యవహరించాలని, ప్రజా సమస్యలపై జగన్ ఏ రోజైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు.

సీఎం చంద్రబాబుని నడిరోడ్డుపై కాల్చేయాలన్న జగన్ వ్యాఖ్యలను ప్రజలు గమనించారని, తన ఫ్యాక్షన్ నైజాన్ని ఈ వ్యాఖ్యల రూపంలో జగన్ బయటపెట్టాడని విమర్శించారు. టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ, జగన్ జాగ్రత్తగా మాట్లాడాలని, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు.

English summary
Deputy CM KE Krishna Murthy, Minister Achennaidu, MLA Bonda Uma has come down heavily on YSRCP chief and the leader of opposition YS Jagan Mohan Reddy over his comments against CM Chandrababu Naidu of Andhra Pradesh. While addressing the media at TDP office, They told that people of andhra pradesh are observing the faction oriented comments of jagan. They told YS Jagan should control his tongue while talking about chandrababu naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X