వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయసాయి కూడా దొరికిపోయాడుగా.. నిమ్మగడ్డ భేటీలో తప్పేంటి? అంతా జగన్నాటకమన్న టీడీపీ..

|
Google Oneindia TeluguNews

'పార్క్ హయత్ లీక్స్' వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తుస్తోంది. రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, సీనియర్ నేత కామినేని శ్రీనివాస్ ను రహస్యంగా కలిసిన వీడియో మంగళవారం వెలుగులోకి వచ్చింది. జగన్ సర్కారును అస్థిపర్చేలా కుట్రలు పన్నేందుకే ఆ ముగ్గురూ మంతనాలు జరిపారని, ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సూమోటోగా స్వీకరించి, నిమ్మగడ్డను అరెస్టు చేయాలని అధికార వైసీపీ డిమాండ్ చేసింది. దీనిపై ఎంపీ సుజనా కూడా వివరణ ఇచ్చుకోగా.. అసలీ కలయికలో తప్పేముందని టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఆ క్రమంలో వైసీపీ ముఖ్యనేతల గతాన్ని సైతం తొవ్విపోశారు.

నిమ్మగడ్డ అరెస్టుకు వైసీపీ డిమాండ్.. జగన్ సర్కారు సుమోటోగా.. కమలవనంలో పచ్చ పుష్పాలన్న అంబటి..నిమ్మగడ్డ అరెస్టుకు వైసీపీ డిమాండ్.. జగన్ సర్కారు సుమోటోగా.. కమలవనంలో పచ్చ పుష్పాలన్న అంబటి..

సాయిరెడ్డి పారిపోలేదా..

సాయిరెడ్డి పారిపోలేదా..

నిమ్మగడ్డ రహస్య భేటీ అంటూ ముందుగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించడం తెలిసిందే. సైరా పంచ్ పేరుతో సాయిరెడ్డి చేస్తోన్న కామెంట్లకు అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తోన్న టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత.. నిమ్మగడ్డ వ్యవహారంలోనూ అదే తీరుగా స్పందించారు. గత సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు, ప్రధాని కార్యాలయం వద్ద వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తచ్చాడటాన్ని గుర్తుచేస్తూ.. ‘‘ఎన్నికల ముందు పీఎం ఆఫీస్ లో ఇద్దరు నక్కి, మీడియాని చూసి పారిపోయారు. దాన్ని కూడా దొంగతనంగా కలవటమనేగా అంటారు?''అని అనిత ఫైరయ్యారు.

ఏపీలో కొత్తగా 12 జిల్లాలు.. సీఎం జగన్ స్పష్టీకరణ.. కలెక్టర్లతో కాన్ఫరెన్స్ లో కీలక ఆదేశాలు..ఏపీలో కొత్తగా 12 జిల్లాలు.. సీఎం జగన్ స్పష్టీకరణ.. కలెక్టర్లతో కాన్ఫరెన్స్ లో కీలక ఆదేశాలు..

కనగరాజ్ ను కూడా లాగారు..

కనగరాజ్ ను కూడా లాగారు..

పార్క్ హయత్ హోటల్ లో మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ బీజేపీ నేతల్ని కలవడం సంచనంగా మారిన వేళ.. ఈ వివాదంలోకి మరో మాజీ ఎస్ఈసీ కనగరాజ్ ను కూడా టీడీపీ లాగింది. ‘‘నిమ్మగడ్డ రమేశ్ పదవిలో లేనప్పుడు ఎవరిని కలిస్తే ఏంటి? అలా అయితే లాక్ డౌన్ తీవ్రంగా ఉన్నప్పుడు చెన్నై నుంచి వచ్చిన కనగరాజ్ ను విజయసాయి రెడ్డి దేనికి కలిసినట్లు? ఆయన వైసీపీ నియమించుకున్న ఎన్నికల అధికారి అనేనా? అది తప్పైతే ఇది తప్పే కదా.. ఏంటో జగన్నాటకం..'' అంటూ అనిత పంచ్ విసిరారు.

అందుకే కలిశారేమో..

అందుకే కలిశారేమో..

ఎంపీ సుజనా, మాజీ మంత్రి కామినేనితో నిమ్మగడ్డ భేటీ కావడంపై బీజేపీ కంటే టీడీపీ నేతలే ఎక్కువగా స్పందిస్తుండటం గమనార్హం. ఆ ముగ్గురు సమావేశం కావడంలో తప్పేమీ లేదని, అయినా వాళ్లేమన్నా అసాంఘిక శక్తులా?, కనీసం సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డిలాగా నేరాలు చేసి జైలుకు పోయిన వ్యక్తులు కాదంటూ టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఫైరయ్యారు. నిమ్మగడ్డను ఎస్ఈసీగా కొనసాగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం వైసీపీ సర్కారు లెక్కచేయడం లేదని, బహుశా ఆ అంశంపై చర్చించేందుకే నిమ్మగడ్డ రమేశ్, బీజేపీ నేతలైన సుజనా, కామినేనిని కలుసుకొని ఉండొచ్చని రామయ్య అభిప్రాయపడ్డారు.

ఆ టీవీకి మాత్రమే పుటేజీ ఎలా?

ఆ టీవీకి మాత్రమే పుటేజీ ఎలా?

నిమ్మగడ్డ రహస్య భేటీ పేరుతో వైరలైన వీడియోలపైనా వర్ల రామయ్య అనుమానాలు వ్యక్తం చేశారు. ‘‘సదరు సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు తీసుకెళ్లారని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి పోలీసుల ద్వారా బయటికొచ్చిన వీడియో అన్ని టీవీ చానెళ్లలో రావాలి కదా? కానీ ఒక్క టీవీకే.. అది కూడా ముఖ్యమంత్రికి చెందిన చానెల్ లోనే వీడియోలు ప్రసారం కావడమేంటి? దీన్నిబట్టే ఇదో పెద్ద డ్రామా అని ప్రజలకు అర్థమైపోయింది. త్వరలోనే అన్ని నిజాలు నిగ్గుతేలతాయి''అని రామయ్య అన్నారు.

Recommended Video

Congress Party Workers Celebrated Rahul Gandhi's Birthday By Donating Blood
కుట్రచేశారన్న సుజనా..

కుట్రచేశారన్న సుజనా..

కరోనా కారణంగా కొంతకాలంగా తాను పార్క్ హయత్ హోటల్ నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని, ఈ నెల 13న మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, మరో బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ లను కలసుకున్న మాట వాస్తవమేనని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అంగీకరించారు. అయితే ఆ ఇద్దరితో తాను వేర్వేరు సమయాల్లో మాట్లాడానని, ఆ వీడియోలను కుట్రపూరితంగా కలిపేసి.. ఒకేసారి కలిసినట్లుగా ఎడిట్ చేసి విడుదల చేశారని సుజనా వివరించారు.

English summary
political row erupts in andhra pradesh after videos of former sec nimmagadda ramesh kumar meeting with bjp mp sujana chowdary and kamineni srinivas. tdp leaders varla ramaiah and anitha slams ysrcp mp vijayasai reddy over the issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X