వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ నేతలు 400 కోట్లు కొట్టేశారనబోయి వేరే పదం వాడిన మంత్రి.. తప్పన్న స్పీకర్ , టీడీపీ

|
Google Oneindia TeluguNews

ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తొలి రోజు సమావేశంలో మంత్రి అనీల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్య సభాపర్వంలో రచ్చకు కారణం అయ్యింది . ఒక ప్రజా ప్రతినిధిగా ఉండి అందులోనూ ఒక బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉండి సభలో ఆయన వాడకూడని అసభ్య పదజాలాన్ని వాడారు. దీంతో అటు టీడీపీ ఎమ్మెల్యేలు, స్పీకర్ దాన్ని తప్పు పట్టారు. వెంటనే ఆయన దాన్ని ఉపసంహరించుకోవటం తో అసెంబ్లీ రికార్డుల నుండి తొలగించారు.

ఈడీ, సీబీఐ కేసులున్న మీరెలా వ్యవస్థను కడుగుతారు ? జగన్ కు కేశినేని సూటి ప్రశ్నఈడీ, సీబీఐ కేసులున్న మీరెలా వ్యవస్థను కడుగుతారు ? జగన్ కు కేశినేని సూటి ప్రశ్న

ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు .. తొలిరోజే మంత్రి వ్యాఖ్యతో టీడీపీ నిరసన

ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు .. తొలిరోజే మంత్రి వ్యాఖ్యతో టీడీపీ నిరసన

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి . తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ నడిచింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపించే అవకాశం ఉంది. ఇవాళ ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు జులై 30 వరకు కొనసాగుతాయి. మొత్తంగా 14 రోజుల పాటు అసెంబ్లీ నడవనుంది. జులై 12వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి బడ్జెట్‌ను, మంత్రి కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. నవరత్నాల అమలే ప్రధాన ఎజెండాగా బడ్జెట్ ఉండనుంది. జులై 15, 16, 17 తేదీల్లో మూడు రోజుల పాటు బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. జులై 17వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌పై సమాధానమిస్తారు. అయితే తొలిరోజునే జలవనరుల శాఖామంత్రి అనీల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యతో సభలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయ్యింది.

పోలవరం ప్రాజెక్ట్ లో టీడీపీ నేతలు రూ.400 కోట్లు కొట్టేశారని చెప్పబోయి మరోలా వ్యాఖ్యానించిన మంత్రి అనీల్

పోలవరం ప్రాజెక్ట్ లో టీడీపీ నేతలు రూ.400 కోట్లు కొట్టేశారని చెప్పబోయి మరోలా వ్యాఖ్యానించిన మంత్రి అనీల్

సభలో పోలవరం ప్రాజెక్ట్ అంశంపై మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఎవరి హయాంలో వచ్చాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. కేంద్రం నుంచి అనుమతులను తీసుకురావడం దగ్గరి నుంచి, కాలువ పనుల వరకూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడిన అనీల్ పోలవరం ప్రాజెక్టు కోసం వైఎస్ తవ్వించిన కాలువలకే రెండు లిఫ్టులు పెట్టి టీడీపీ నేతలు రూ.400 కోట్లు కొట్టేశారు అని చెప్పే స్థానంలో ఆయన అసెంబ్లీలో వాడకూడని పదం వాడారు.

టీడీపీ ఆగ్రహం , పదం వెనక్కు తీసుకోవాలన్న స్పీకర్ .. తన వ్యాఖ్యను వెనక్కు తీసుకున్న మంత్రి

టీడీపీ ఆగ్రహం , పదం వెనక్కు తీసుకోవాలన్న స్పీకర్ .. తన వ్యాఖ్యను వెనక్కు తీసుకున్న మంత్రి

దీంతో మంత్రి అనీల్ సభలో వాడకూడని పదాన్ని వాడటంపై టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. సభలో మాట్లాడే భాష ఇదేనా అంటూ మండిపడ్డారు. ఇక స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఈ ఆన్ పార్లమెంటరీ పదాన్ని వెనక్కు తీసుకోవాలని మంత్రికి సూచించారు. దీంతో చివరికి తన వ్యాఖ్యను ఆయన ఉపసంహరించుకుంటున్నట్టు మంత్రి అనిల్ తెలిపారు . పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని హక్కులు వైఎస్ కే ఉన్నాయనీ, ఈ ప్రాజెక్టును పూర్తిచేయబోయేది కూడా తామేనని స్పష్టం చేశారు. మధ్యలో టీడీపీ చేసింది ఏమీ లేదని , దోచుకు తినటం తప్ప అని మంత్రి అనీల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.

English summary
Speaking on the subject of the Polavaram Project, AP Water Resources Minister Anil Kumar said that the people of the state are aware of all the approvals for the Polavaram project. Recall that the late leader YS Rajasekhara Reddy brought the permits from the center to the canal.Speaking during the budget session of the AP Assembly, Anil said that the YS digs the canals for the Polavaram project and two lifts constructed by the TDP leaders were earning Rs 400 crore by theft. Minister Anil used the word 'dobbeyatam ' to protest the TDP members. This is the language spoken in the House. Speaker Tammeneni Sitaram also advised the minister to withdraw the un-parliamentary word.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X