వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కు మద్దతుగా టీడీపీ నేతలు: మాజీ జేడీ వ్యాఖ్యలకు భిన్నంగా: మారుతున్న సమీకరణాలు..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జనసేనలోనే ఉంటూ కొంత కాలంగా దూరంగా ఉంటున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేసారు. పవన్ తిరిగి సినిమాల్లో నటించ టాన్ని ఆయన తప్పు బట్టారు. దీనికి పవన్ సైతం సమాధానం ఇచ్చారు. తనకు సిమెంటు ఫ్యాక్టరీలు.. పవర్‌ ప్రాజెక్టులు.. గనులు.. పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏవీ లేవని..తనకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే అని స్పష్టం చేసారు.

తన కుటుంబం కోసం.. పార్టీకి ఆర్థిక పుష్టి కోసం తనకు సినిమాలు చేయడం తప్పనిసరి అని వివరించారు. ఇక, ఇప్పుడు బీజేపీ..టీడీపీ నేతలు సైతం పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. లక్ష్మీనారాయణ రాజీనామా సమయంలో పవన్ పైన చేసిన వ్యాఖ్యలను తప్పు బడుతున్నారు. పవన్ కు మద్దతుగా నిలుస్తున్నారు. పవన్ కు మద్దతుగా టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కలిగిస్తోంది. ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది.

TDP leaders supported Pawan Kalyan against CBi ex JD Lakshmi Nayaraya comments

పవన్ నటిస్తే నష్టమేం లేదు..
మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేయడంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పందించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వాళ్లే రాజకీయాల్లోకి వచ్చాక కూడా సినిమాల్లో నటించారని .. పవన్ నటిస్తే రాష్ట్రానికి వచ్చిన నష్టమేమీ లేదంటూ సోమిరెడ్డి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. లక్ష్మీ నారాయణ గారూ.. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వాళ్లే రాజకీయాల్లోకి వచ్చాక కూడా కొన్ని సినిమాల్లో నటించడం చూశాం... పవన్ కల్యాణ్ ఒకటి, రెండు సినిమాల్లో నటిస్తే రాష్ట్రానికొచ్చిన నష్టమేం లేదు కానీ... రాజకీయ నాయకులు నిజ జీవితంలో నటిస్తేనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం.. అని సోమిరెడ్డి ట్వీట్‌ చేశారు. ఇప్పుడు ఇది చర్చకు కారణమైంది.

ఇప్పటి వరకు జనసేనలో ఉంటూ..పవన్ కు అత్యంత సన్నిహితుడుగా కొనసాగుతూ..రాజీనామా చేసిన లక్ష్మీ నారాయణకు గతంలో టీడీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. ఇప్పుడు టీడీపీ నేతలు పవన్ వెళ్లి బిజేపీతో కలిసిన తరువాత ...ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వెనుక మతలబు ఏంటనే చర్చ మొదలైంది.

జేడీ వ్యాఖ్యలపైన పవన్ సైతం..
లక్ష్మీనారాయణ రాజీనామాను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆమోదించారు. ఆయన భావాలను గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. సినిమాల్లో నటించనంటూ గతంలో అనేకసార్లు ప్రకటించి, ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకోవడం ద్వారా నిలకడైన విధానాలు లేవంటూ రాజీనామా లేఖలో పవన్‌ను ఉద్దేశించి లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలకు పవన్ బదులిచ్చారు. తనకు సిమెంటు ఫ్యాక్టరీలు..పవర్‌ ప్రాజెక్టులు.. గనులు.. పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏవీ లేవని వివరించారు.

అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినీ కాదన్నారు. తనకు తెలిసిందల్లా సినిమా ఒక్కటేనని..తన మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. వారి కోసం..తన కుటుంబం కోసం.. పార్టీకి ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పనిసరి అంటూ తేల్చి చెప్పారు. ఇవన్నీ లక్ష్మీనారాయణ తెలుసుకొని తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే బాగుండేదని పవన్ అభిప్రాయ పడ్డారు. లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేసినా వ్యక్తిగతంగా తనకు.. జనసైనికులకు ఆయనపై ఉన్న గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుందని.. ఆయనకు శుభాభినందనలు..అంటూ తన పవన్ పేర్కొన్నారు.

English summary
tdp senior leader somireddy Chandramohan Reddy supported Pawan Kalyan against CBi ex JD Lakshmi Nayaraya comments at the time of resignation.Somireddy says acting not at all problem for politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X