వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌పై టీడీపీ గుర్రు, 'అదీ బాబు.. మోడీ వెళ్తుంటేనే వారిని కలిశారు'

|
Google Oneindia TeluguNews

Recommended Video

హోదా ధర్మ పోరాటానికి 5కోట్ల మంది ప్రజలు రాజకీయాలకు అతీతంగా సిద్ధం కావాలి...!

గుంటూరు/అమరావతి: రాజకీయ నాయకులు ఎవరైనా తమ పార్టీ బలంగా ఉందని చెబుతారని, కానీ మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు మాణిక్యాల రావు మాత్రం పవన్‌ కళ్యాణ్ బలంగా ఉన్నారని చెప్పడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేత, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు.

పవన్‌ వెనుక బీజేపీ ఉందన్న విషయం మాణిక్యాల రావు మాటలతో తేలిపోయిందన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందినవారిలో 80 శాతం మంది పవన్‌ వెనుక ఉన్నారని మాణిక్యాల రావు చెప్పడంలో అర్థం లేదన్నారు. ముద్రగడ పద్మనాభం వెనుక ఎంతమంది కాపులున్నారో, పవన్‌ వెనుకా అంతేమంది ఉన్నారని చెప్పారు.

'చంద్రబాబు ఢిల్లీలో హేమమాలిని సహా బీజేపీ నేతలను ఎందుకు కలుస్తున్నారు''చంద్రబాబు ఢిల్లీలో హేమమాలిని సహా బీజేపీ నేతలను ఎందుకు కలుస్తున్నారు'

రాష్ట్రం కోసం మాట్లాడక తప్పడం లేదు

రాష్ట్రం కోసం మాట్లాడక తప్పడం లేదు

విభజన సయంలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ, అధికారం చేపట్టాక ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో దగాకోరు రాజకీయాలు చేస్తోందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు వేరుగా మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ విషయంపై మాట్లాడక తప్పడం లేదన్నారు.

 తెలుగు ప్రజలు అలాంటి పరిస్థితులో లేరు

తెలుగు ప్రజలు అలాంటి పరిస్థితులో లేరు

హోదా ధర్మ పోరాటానికి 5కోట్ల మంది ప్రజలు రాజకీయాలకు అతీతంగా సిద్ధం కావాలని కోడెల పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితిలో తెలుగు ప్రజలు లేరని చెప్పారు. రాష్ట్రానికి ఓ పక్క కేంద్రం ఇంత అన్యాయం చేస్తుంటే హోదా పేరుతో వైసీపీ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా రాజకీయాలు చేయడం బాధ కలిగిస్తోందన్నారు. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందన్నారు.

చంద్రబాబు పూర్తిగా విజయం సాధించారు

చంద్రబాబు పూర్తిగా విజయం సాధించారు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రస్తుతం దళితవర్గాలపై దాడులు 66 శాతం పెరిగాయన్నారు. మరోవైపు, చంద్రబాబు రెండురోజుల ఢిల్లీ పర్యటన విజయం సాధించిందని టీడీపీ పార్లమెంటరీ పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. కేంద్రం ఏపీకి చేసిన అన్యాయాన్ని జాతీయ పార్టీలు, మీడియాకు చెప్పే ఉద్దేశంతో వచ్చిన ముఖ్యమంత్రి ఆ విషయంలో పూర్తిగా విజయం సాధించినట్లు పేర్కొన్నాయి.

 భయపడకుండా బాబును కలవడం మామూలు విషయం కాదు

భయపడకుండా బాబును కలవడం మామూలు విషయం కాదు

ఒక్క రోజులో చంద్రబాబు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో దాదాపు 25 పార్టీలకు చెందిన ఫ్లోర్‌ లీడర్లు, 50మందికి పైగా ఎంపీలతో కలిసి మాట్లాడటం మంచి పరిణామం అని టీడీపీ పేర్కొంది. ఎన్డీయే మిత్రపక్షాలు, బీజేపీలోని కొందరు వ్యక్తులు భయపడకుండా వచ్చి చంద్రబాబుతో మాట్లాడటం, ఫొటోలు దిగడం సాధారణ విషయం కాదన్నారు. మోడీ ప్రభుత్వం ఏపీకి చేసిన అన్యాయాన్ని పూసగుచ్చినట్లు, పవర్ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో వివరించడం ద్వారా టీడీపీ వాదనలో బలం ఉందని చాటి చెప్పారన్నారు. ఢిల్లీ, అమరావతిలో మోడీ మాట్లాడిన మాటలను జాతీయ మీడియా ముందు వీడియో రూపంలో ప్రదర్శించి ఏ విధంగా ప్రధాని మాట తప్పారన్నది చాలా స్పష్టంగా బట్టబయలు చేయగలిగారన్నారు.

ప్రధాని వెళ్తుంటేనే విపక్ష నేతలను కలిసిన బాబు

ప్రధాని వెళ్తుంటేనే విపక్ష నేతలను కలిసిన బాబు

గత నాలుగేళ్లలో తెలిసింది ఏమంటే.. మోడీ బయటికి కనిపించేటంత ధైర్యవంతుడు కాదని, చంద్రబాబు అందరికీ అనిపించేటంత భయస్తుడు కాదని ఢిల్లీ పర్యటనతో నిరూపితమైందని టీడీపీ ఎంపీలు అభిప్రాయపడ్డారు. పార్లమెంటు సెంట్రల్ హాల్‌ మీదుగా ప్రధాని వెళ్తుండగానే ఆయన ముందే చంద్రబాబు విపక్షనేతలను కలిసి మద్దతు కూడగట్టారని, కేంద్రంపై పోరాటానికి ఇంతకంటే ఇంకేం కావాలని వ్యాఖ్యానించారు.

English summary
Telugudesam Party leaders target BJP and Jana Sena chief Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X