వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అజ్ఞాతవాసి.. అజ్ఞానం వీడు, బాబే తనకు పోటీ అని అణగదొక్కేందుకు: మోడీపై టీడీపీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

పవన్ పై విరుచుపడుతున్న నేతలు..!

అమరావతి: విళంబి నామ సంవత్సరం కొత్తగా ఉన్నట్లే రాజకీయాలు కూడా విచిత్రంగా ఉంటాయని టీడీపీ ఎంపీ శివప్రసాద్ అన్నారు. సీఎం చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న గొప్పన నేత అన్నారు. టీడీపీ అవిశ్వాసానికి రోజురోజుకు మద్దతు పెరుగుతోందన్నారు.

చంద్రబాబును అణగదొక్కాలని ప్రధాని నరేంద్ర మోడీ చూస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోజుకో మాట, పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్‌పై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కూడా విమర్శలు గుప్పించారు.

వెంకయ్య మాటేమిటి, హఠాత్తుగా యూటర్న్ తీసుకోలేదు, జగన్‌ను అనొద్దన్నారు: బాబుకు పవన్ దిమ్మతిరిగే షాక్వెంకయ్య మాటేమిటి, హఠాత్తుగా యూటర్న్ తీసుకోలేదు, జగన్‌ను అనొద్దన్నారు: బాబుకు పవన్ దిమ్మతిరిగే షాక్

అజ్ఞాతం వీడిన అజ్ఞాతవాసి అజ్ఞానం

అజ్ఞాతం వీడిన అజ్ఞాతవాసి అజ్ఞానం

పవన్ అజ్ఞాతవాసి అని కేఈ నిప్పులు చెరిగారు. ఆయన అజ్ఞాతం వీడి, ఇప్పుడు వెంటనే అజ్ఞానంతో ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే గంటలో 16 పార్టీలు మద్దతు పలికాయని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీని తిరస్కరించి రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. మరో ఇరవై ఏళ్ల పాటు ప్రజలు చంద్రబాబును ఆదరిస్తారని చెప్పారు.

చంద్రబాబు తనకు పోటీ అని మోడీ కక్షకట్టారు

చంద్రబాబు తనకు పోటీ అని మోడీ కక్షకట్టారు

ప్రధాని నరేంద్ర మోడీపై మంత్రి అమర్నాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో చంద్రబాబు నాయుడే తనకు పోటీ అని భావించిన మోడీ ఏపీపై కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నారన్నారు. ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు.

గుజరాత్‌ను ఏపీ మించిపోతుందనే ఆందోళన

గుజరాత్‌ను ఏపీ మించిపోతుందనే ఆందోళన

గుజరాత్‌ను ఏపీ మించిపోతుందేమోనని మోడీ భావిస్తున్నారని అమర్నాథ్ రెడ్డి అన్నారు. తమిళనాడులో పట్టులేకున్నా కల్పించుకొని అక్కడ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఏపీలోను అలాంటి రాజకీయాలు కుదరవన్నారు.

టీడీపీ ఎదురుతిరగడంతో బీజేపీకి తీవ్ర పరిణామాలు

టీడీపీ ఎదురుతిరగడంతో బీజేపీకి తీవ్ర పరిణామాలు

తాము బీజేపీకి ఎదురు తిరగడంతో కేంద్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటోందని అమర్నాథ్ రెడ్డి అన్నారు. జనసేన, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కలిసి రాకుండా కేంద్ర సర్కారుకు అనుకూలంగా ఉంటున్నాయని ఆరోపించారు. సీఎంపై, లోకేష్‌పై పవన్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడటం వల్లే వెంకయ్యను పథకం ప్రకారం మంత్రివర్గం నుంచి తప్పించారన్నారు.

English summary
Telugu Desam Party leaders targetted Prime Minister Narendra Modi and Jana sena chief Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X