వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ మూలాలపై టిడిపి కన్ను, శిల్పా సోదరుల మధ్య విబేధాలు?

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో శిల్పా సోదరులకు ఊహించని షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్న శిల్పా సోదరులకు ఓటమి ఎదురుకావడం తీవ్ర నైరాశ్యానికి నెట్టింది. ఎన్నికల్లో విజయం సాధించకపోవడంతో సోదరుల మధ్య విబేధాలు తలెత్తాయనే ప్రచారం సాగుతోంది. మరో వైపు శిల్పా సోదరుల మూలాలను దెబ్బతీసేందుకు టిడిపి నాయకత్వం వ్యూహత్మకంగా వ్యవహరిస్తోందని సమాచారం.

నంద్యాల: రిజల్ట్స్‌పై నిద్రపోలేదన్న అచ్చెన్న, దిమ్మతిరిగే జవాబిచ్చిన బాబునంద్యాల: రిజల్ట్స్‌పై నిద్రపోలేదన్న అచ్చెన్న, దిమ్మతిరిగే జవాబిచ్చిన బాబు

నంద్యాల ఉప ఎన్నికలు వైసీపీకి తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టాయి ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధిులు టిడిపిలో టచ్‌లోకి వెళ్ళిపోయారనే ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో వైసీపీని దెబ్బకొట్టేందుకు చంద్రబాబునాయుడు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు.

నంద్యాల: మౌనిక దూకుడు, అదే జరిగితే వైసీపీకి తీవ్ర నష్టమేనా?నంద్యాల: మౌనిక దూకుడు, అదే జరిగితే వైసీపీకి తీవ్ర నష్టమేనా?

వైసీపీ చీఫ్ జగన్ వ్యవహరశైలిపై అసంతృప్తిగా ఉన్న నేతలకు టిడిపి వలస వేస్తోందనే ప్రచారం కూడ ఉంది. అయితే నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు రావడంతో అసంతృప్త నేతలు కూడ ప్రత్యామ్యాయాలను వెతుక్కొంటున్నారు.

గోస్పాడు ఎఫెక్ట్: నంద్యాలలో వైసీపీకి దెబ్బ, జగన్ అంచనాలు తారుమారుగోస్పాడు ఎఫెక్ట్: నంద్యాలలో వైసీపీకి దెబ్బ, జగన్ అంచనాలు తారుమారు

ఎన్నికల సమయంలో శిల్పా సేవా సమితి లక్ష్యంగా టిడిపి నేతలు వ్యవహరించారని శిల్సా కుటుంబ సభ్యులు ఆరోపణలు గుప్పించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తక్కువ ధరకే సరుకులను విక్రయించారు. అయితే పోలీసులు ఆ సమయంలో వస్తువుల విక్రయాన్ని పోలీసులు నిలిపివేశారు.

శిల్పా సోదరుల మధ్య విబేధాలు

శిల్పా సోదరుల మధ్య విబేధాలు

ఏడాది క్రితం నుంచి శిల్పా సోదరుల మధ్య విభేదాలు ఉన్న మాట వాస్తవమే. ‘‘ఇప్పుడు ఇద్దరం ఒకటయ్యాం. మా మధ్య అంతరాలు తొలగిపోయినట్లే'' అని శిల్పా మోహన్‌రెడ్డి చెప్పి నెలైనా గడవక ముందే సోదరుల మధ్య పొరపచ్చాలు రావడంతో శిల్పా కేడర్లో కలవరం మొదలైంది. ఈ నెల 3వ, తేదిన శిల్పా మోహన్‌రెడ్డి సోదరుడు చక్రపాణిరెడ్డి టిడిపిని వీడి వైసీపీలో చేరారు. నంద్యాలలో నిర్వహించిన సభలోనే తన ఎమ్మెల్సీ పదవికి చక్రపాణిరెడ్డి రాజీనామా సమర్పించారు. అయితే నంద్యాల ఉప ఎన్నికల్లో సోదరుడు మోహన్‌రెడ్డి విజయం సాధిస్తారని కుటుంబసభ్యులు భావించారు. కానీ, టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి విజయం సాధించారు.

తారు మారైన అంచనాలు

తారు మారైన అంచనాలు


టిడిపిలో ఉన్న శిల్పా సోదరులు వైసీపీలోకి వచ్చారు. నంద్యాల టిక్కెట్లు కేటాయింపు విషయంలో టిడిపి నాయకత్వం తాత్సారం చేస్తోందని ఆరోపిస్తూ మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఈ నెల 3వ, తేదిన శిల్పా చక్రపాణిరెడ్డి టిడిపిని వీడి వైసీపీలో చేరారు. ‘అంతా నువ్వే చేశావంటూ అన్నను శిల్పా చక్రపాణిరెడ్డి నిలదీశారనే ప్రచారం సాగుతోంది.. టీడీపీలో హాయిగా ప్రశాంతంగా ఉన్న నన్ను వైసీపీలో బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పి లాకొచ్చావు. ఇప్పుడు పదవి పోయింది నా రాజకీయ జీవితం తారుమారైంది'' అంటూ చక్రపాణిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం.

శిల్పా సోదరుల మూలాలపై టిడిపి కన్ను

శిల్పా సోదరుల మూలాలపై టిడిపి కన్ను


నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనే శిల్పా సేవాసమితి కార్యక్రమాలపై టిడిపి కన్నేసింది. నిబంధనలకు విరుద్దంగా ఈ సంస్థ నడుస్తోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సేవాసమితిని కూడ ఉపయోగించుకొన్నారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.టీడీపీపై కయ్యానికి కాలు దువ్విన శిల్పా సోదరులపై టీడీపీ అధినాయకత్వం సీరియస్‌గా ఉంది. వారి మూలాలకు తాళాలు వేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

శాసనమండలి ఛైర్మెన్ పదవి దక్కలేదు

శాసనమండలి ఛైర్మెన్ పదవి దక్కలేదు

నంద్యాల ఉప ఎన్నిక కీలక దశ చేరుకున్న సమయంలో చక్రపాణిరెడ్డి ఉన్న ఫలంగా సైకిల్‌ను వదిలేసి అన్నతో చేతులు కలిపారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామ చేసి జగన్ గూటికి చేరారు. అన్న గెలుపు కోసం పార్టీ మారిన చక్రపాణిరెడ్డికి టీడీపీ నేతలు అడుగడుగునా చెక్ పెట్టారు. టిడిపిలోనే కొనసాగితే చక్రపాణిరెడ్డికి మండలి ఛైర్మెన్ పదవి దక్కేదనే ప్రచారం కూడ ఉంది. మండలి ఛైర్మెన్ పదవులు చక్రపాణిరెడ్డికి దక్కకుండా పోయాయి.వైసీపీలో చేరినందున ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆగష్టు 15వ, తేదిన ఈ రాజీనామాను ఆమోదం దక్కింది.

English summary
Tdp leaders targetted shilpa seva simiti. Shipa brothers running a trust. Ap cm Chandrababu naidu mada allegations on Shipa seva samithi in Election campign .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X