వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ గుబులు: క్యాలెండర్ లో డేట్ మార్క్ చేసుకుంటున్న నాయకులు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ap Assembly Election 2019 : నిద్రలేని రాత్రులను గడుపుతున్న టీడీపీ నేతలు..కారణం ఇదే ! | Oneindia

అమరావతి: లక్ష్మీస్ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితకథపై తెరకెక్కిన బయోపిక్ ఇది. ఎన్టీ రామారావు జీవితంలో లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరువాత చోటు చేసుకున్న పరిణామాలు, వైస్రాయ్ కుట్ర ఉదంతం, ఎన్టీఆర్ పదవీచ్యుతుడు కావడం, ఆయన మానసిక సంఘర్షణ, మహాభినిష్క్రమణకు ముందు చోటు చేసుకున్న ఘటనలు ఈ సినిమా కథాంశం. సినిమా మొత్తం లక్ష్మీపార్వతి కోణంలో సాగుతుంది.

ఎన్టీ రామారావు జీవితంపై ఇప్పటిదాకా రెండు భాగాలుగా విడుదలైన ఎన్టీఆర్ కథా నాయకుడు, ఎన్టీఆర్ మహా నాయకుడు ఒక ఎత్తయితే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ మరో ఎత్తు. నిజానికి- ఎన్టీ రామారావు తాను జీవితంలో అత్యంత కీలక, క్లిష్టమైన, కఠిన సందర్భాలను ఆధారంగా తెరకెక్కిన మూవీ కావడంతో అందరిలోనూ ఉత్కంఠతకు గురి చేస్తోంది. పైగా- వివాదాస్పద కథాంశాలనగానే ఎగిరి గంతేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దీన్ని చిత్రీకరించడంతో సినిమాపై అనూహ్యమైన అంచనాలు ఉన్నాయి.

సినిమా విడుదలను అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలో..

సినిమా విడుదలను అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలో..

సాధారణ ప్రేక్షకుల సంగతి అటుంచితే.. ఈ సినిమా తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సినిమా విడుదలను అడ్డుకోవడానికి వారు ఎన్ని ప్రయత్నాలు చేయాలో.. అన్నీ చేశారు. అవన్నీ వ్యర్థమయ్యాయి. సినిమా విడుదల ఆపాలని, దర్శకుడిని అరెస్టు చేయాలని.. ఇలా నానా రకాలుగా టీడీపీ నాయకులు ప్రయత్నించి, విఫలమయ్యారు. తమ చివరి అస్త్రంగా న్యాయస్థానాలను ఆశ్రయించారు. అక్కడా వారికి చుక్కెదురైంది. సినిమా విడుదలను అడ్డుకోవడం తమ పరిధిలో లేని అంశమంటూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.. ఈ పిటీషన్ ను కొట్టేసింది. ఇక మిగిలింది- లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల ఒక్కటే. ఈ నెల 29వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 టీడీపీలో ఎందుకింత టెన్షన్?

టీడీపీలో ఎందుకింత టెన్షన్?

ఈ సినిమా విడుదల పట్ల తెలుగుదేశం పార్టీకి చెందిన అగ్ర నాయకులు మొదలుకుని జిల్లా స్థాయి క్యాడర్ వరకూ అంతగా ఆందోళన చెందడానికి గల కారణాన్ని మనం ఇట్టే ఊహించుకోవచ్చు. దీనికోసం పెద్దగా బుర్రకు పదును పెట్టాల్సిన పని లేదు. ఈ సినిమా ద్వారా వాస్తవాన్ని వాస్తవంగా చూపించడమే కారణం. ఎన్టీ రామారావు తన చివరి రోజుల్లో ఎలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నారనేది.. ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు.

1994 ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి, ఎన్టీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చోటు చేసుకున్న సంఘటనలు చీకటిమయం. పార్టీని బతికించుకోవాలనే ఒకే ఒక్క కారణంతో.. లక్ష్మీ పార్వతిని బూచిగా చూపించి, ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేశారు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీని, సైకిల్ గుర్తునూ హైజాక్ చేశారు. దీనికోసం హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలోని వైస్రాయ్ హోటల్ ను ఆయన కేంద్రబిందువుగా చేసుకున్నారు. అసలు కథను ఈ హోటల్ నుంచే నడిపించారు. ఎన్టీఆర్ ను పదవి నుంచి దించేసి, తాను గద్దెనెక్కారు. పదవీచ్యుతుడైన తరువాత ఎన్టీ రామారావు ఎలాంటి మానిసక సంఘర్షణను అనుభవించారనేది లక్ష్మీఎస్ ఎన్టీఆర్ చిత్రం ప్రధాన కథాంశం. సినిమా మొత్తం- దీని చుట్టే తిరుగుతుంది.

మెయిన్ విలన్ గా చంద్రబాబు? ఉన్నది ఉన్నట్టుగా చిత్రీకరణ

మెయిన్ విలన్ గా చంద్రబాబు? ఉన్నది ఉన్నట్టుగా చిత్రీకరణ


ఈ ఎపిసోడ్ మొత్తంలో మెయిన్ విలన్ గా.. చంద్రబాబు నాయుడును చూపారు. వాస్తవ కథను ఎక్కడా రాజీ పడకుండా.. ఉన్నది ఉన్నట్టుగా తెరకెక్కించారు రామ్ గోపాల్ వర్మ. ఈ పాయింట్.. టీడీపీ నాయకులకు మింగుడు పడట్లేదు. ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా విడుదలైతే.. కొత్త తరం ఓటర్లకు పార్టీ పట్ల, పార్టీ నాయకత్వం పట్ల వ్యతిరేక భావం పడుతుందనే భయం టీడీపీ నేతల్లో వ్యక్తమౌతోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఎక్కడ గానీ.. కల్పిత ఘటనలు, పాత్రలు, చిత్రీకరణలు లేవని, ఉన్న పరిస్థితులనే తాను తెరకెక్కించానంటూ రామ్ గోపాల్ వర్మ చెబుతున్నారు. ఇప్పటిదాకా విడుదలైన అన్ని ప్రోమోలు, టీజర్లు, ట్రైలర్లు చూస్తే.. సినిమాలో ఏ రేంజ్ డెప్త్ ఉందనే విషయం ప్రేక్షకులకు అర్థమైంది. ఇక సినిమా ప్రింట్లు థియేటర్లకు చేరుకుంటే పరిస్థితేమిటనే విషయాన్ని ఊహించుకోవడానికి భయపడుతున్నారు టీడీపీ నాయకులు. సినిమా విడుదలను అడ్డుకోవడానికి విశ్వప్రయత్నాలు చేయడం, చేస్తుండటమే దీనికి నిదర్శనం.

తెలుగు చిత్రపరిశ్రమ ఏమంటోంది?

తెలుగు చిత్రపరిశ్రమ ఏమంటోంది?

తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం గుంభనంగా ఉంటోంది. టీడీపీ క్యాంప్ లో కొనసాగుతున్న కె రాఘవేంద్ర రావు, అశ్వనీదత్ వంటి వారిని పక్కన పెడితే.. మిగిలిన నటులు గానీ, టెక్నీషియన్లు గానీ, దర్శకులు గానీ.. ఏ పార్టీ వైపు మొగ్గు చూపట్లేదు. మెగాస్టార్ కాంపౌండ్ కు చెందిన పవన్ కల్యాణ్, నాగబాబు స్వయంగా ఎన్నికల బరిలో నిల్చున్నా.. సినీ పెద్దలు మాత్రం తమ వైఖరిని బయట పెట్టట్లేదు. పోసాని కృష్ణమురళి, పృథ్వీ, అలీ, భానుచందర్, జయసుధ, ఛోటా కె నాయుడు వంటి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఈ కొద్దిమందిని టాలీవుడ్ ప్రతినిధులుగా భావించలేం.

థియేటర్లు దొరకడం కష్టమా? అదొక్కటే ఛాన్స్ ఉందా?

ఈ పరిస్థితుల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు టీడీపీ థియేటర్లు దొరక్కుండా చేయగలుగుతుందా? అనే ప్రశ్నకు కూడా సరైన సమాధానం దొరకదు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ కంటే వైఎస్ఆర్ సీపీ వైపే ఉన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ కు థియేటర్లు దొరకకుండా చేసినా, యూట్యూబ్ లోనైనా విడుదల చేయడానికి రెడీగా ఉన్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమా ప్రోమోలు, పాటలు, ట్రైలర్లను లక్షల సంఖ్యలో వీక్షించారు ప్రజలు. యూబ్యూబ్ లో విడుదల చేసినా, దీనికి ఏ మాత్రం తగ్గని ప్రజాదరణ ఉంటుంది ఈ సినిమాకు. న్యాయస్థానాలను ఆశ్రయించినప్పటికీ.. మొట్టికాయలు పడ్డాయే తప్ప విడుదలను ఆపలేకపోయారు. ఎటొచ్చీ.. ఈ నెల 29వ తేదీన సినిమా విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. దీనితో టీడీపీ నాయకులు నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు.

English summary
A latest Biopic of Teludu Desam Party founder and Former Chief Minister of Andhra Pradesh Lakshmi's NTR, directed by Ram Gopal Varma is all set to hit theaters on 29 of March in both Telugu States and Overseas also. Court also gave green signal to release the Movie. This is creates tension over TDP leaders in the row of General Elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X