• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీడీపీ నాయకుల కార్ఖానా .. ఒక్కరు పోతే వంద మందిని తయారు చేస్తా.. చంద్రబాబు ఉద్వేగం

|

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు . పార్టీ సీనియర్ నేతలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, పార్టీని వీడి వెళ్తున్న ఎమ్మెల్యేలు, నేతలపై చాలా ఎమోషనల్ అయ్యారు. ఒక నేత పార్టీని వీడితే 100 మంది లీడర్లను తయారు చేస్తా అంటూ ఆయన చాలా ఎమోషనల్ గా మాట్లాడినట్లుగా సమాచారం.

ఆ పదవుల ప్రకటనపై చంద్రబాబు జాప్యం .. ఆంతర్యం ఏమిటో ? టీడీపీలో ఆసక్తికర చర్చ

టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు

టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి ముందుకు నడిపించాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబు ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలతో సంభాషించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తోందని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. తెలుగుదేశం పార్టీని వీడి వైసిపి బాట పడుతున్న ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకుల కార్ఖానా అంటూ పేర్కొన్నారు.

 టీడీపీకి కార్యకర్తలే పెట్టని కోట

టీడీపీకి కార్యకర్తలే పెట్టని కోట

ఒకరు పోతే వందమందిని తయారు చేసే సత్తా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ తెలిపిన చంద్రబాబు కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి పెట్టనికోట అని వ్యాఖ్యానించారు.

ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని, వైసిపి అరాచకాలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. రామచంద్ర పై దాడికి రాజకీయాలతో సంబంధం లేదని ఎస్పి, డిఎస్పి ఎదుటి చెప్పారని దాడి జరిగిన రోజు కుమార్ రెడ్డి, తోపాటు మరో ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.

రామచంద్ర దాడిలో వైసీపీ నేత పేరు మార్చి టీడీపీ నాయకుడి పేరు పెట్టారని ఫైర్

రామచంద్ర దాడిలో వైసీపీ నేత పేరు మార్చి టీడీపీ నాయకుడి పేరు పెట్టారని ఫైర్

ఆ తర్వాత సాయంత్రానికల్లా కుమార్ రెడ్డి పేరుకు బదులుగా ప్రతాపరెడ్డి పేరు తీసుకు వచ్చారని వైసిపి నాయకుడి స్థానంలో టిడిపి నాయకుడి పేరు చేర్చారని ఆయన ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలను మేనేజ్ చేస్తుందని చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఏ నేరం చేయకపోయినా టిడిపి నాయకులు పై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు చంద్రబాబు. దుర్మార్గులకు లైసెన్స్ ఇచ్చి మరి అరాచకాలు చేయిస్తున్నారు అంటూ వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.

మేం సాక్ష్యాలిస్తే మీరు దర్యాప్తు చేసేదేంటి ? డీజీపీ లేఖపై చంద్రబాబు

మేం సాక్ష్యాలిస్తే మీరు దర్యాప్తు చేసేదేంటి ? డీజీపీ లేఖపై చంద్రబాబు

బాధితులకు పోలీసులు అండగా ఉండాల్సిన చోట నేరగాళ్లకు వత్తాసు పలుకుతున్నారని, అది తప్పు అంటూ మండిపడ్డారు చంద్రబాబు. డీజీపీ గౌతమ్ సవాంగ్ సీల్డ్ కవర్ లో సాక్ష్యాధారాలను పంపాలని లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. తాను సాక్ష్యాధారాలు ఇస్తే వాళ్ళు దర్యాప్తు చేస్తారట .. ఇన్వెస్టిగేషన్ బాధ్యత పోలీసులదా ప్రతిపక్షాలదా ..అని ప్రశ్నించారు చంద్రబాబు.

రాష్ట్రంలో ఏ సమస్యలను పరిష్కరించే లేదని, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారంటూ ఆరోపించారు.

  YCP MLA Ambati Rambabu Says 'The Decision Of The Chairman Of The Council Is Undemocratic'
   వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఎమోషనల్

  వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఎమోషనల్

  కరోనా విజృంభిస్తుంటే కరోనా నివారణ చర్యలు లేవని, ప్రభుత్వం పట్టింపులేని తనంతో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో వర్షాభావ ప్రాంతాలను కరువు మండలాలుగా ప్రకటించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు . టీడీపీ నేతలు ప్రజా క్షేత్రంలో నిత్యం ప్రజల కోసం పోరాటం సాగించాలని ఆయన తెలిపారు. పార్టీ వీడి వెళ్తున్న వారిపై వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఎమోషనల్ కావడం ప్రస్తుతం టిడిపి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

  English summary
  Telugu Desam party chief Chandrababu Naidu held a video conference with party leaders in the wake of the latest political developments in the state. Chandrababu emotional on the MLAs who were leaving the party . He said very emotionally if one leader leaves the party then we will make100 leaders.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X