వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంగంలోకి బాబు: పిడిసిసిబికి కొత్త చైర్మెన్ ఎవరు, తెరపైకి పూర్ణచంద్రరావు?

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: ఒంగోలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వ్యవహరంపై టిడిపి నాయకత్వం ఏం చేయాలనే విషయమై మల్లగుల్లాలు పడుతోంది.బ్యాంకు చైర్మెన్‌ను నియమించాలా లేదా ప్రత్యేకాధికారితో పాలన సాగించాలా అనే దానిపై చర్చిస్తున్నారు.

కరణం, జనార్థన్‌ల మధ్య ఆసక్తికరం: ఆత్మాభిమానాన్ని చంపుకోను, చెప్పుడు మాటలు వింటారుకరణం, జనార్థన్‌ల మధ్య ఆసక్తికరం: ఆత్మాభిమానాన్ని చంపుకోను, చెప్పుడు మాటలు వింటారు

జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌కు ఛైర్మెన్‌ పదవికి ఈదర మోహన్ బాబు రాజీనామా చేశారు. అయితే డైరెక్టర్లు చైర్మెన్ ఈదర మోహన్ బాబు‌కు వ్యతిరేకంగా అవిశ్వాస ప్రతిపాదన ముందుకు తీసుకు రావడంతో ఈదర తన పదవికి రాజీనామా చేశారు.

పిడిసిసిబి ఛైర్మెన్ పదవికి ఈదర మోహన్‌ రాజీనామా: తెర వెనుక దామరచర్ల?పిడిసిసిబి ఛైర్మెన్ పదవికి ఈదర మోహన్‌ రాజీనామా: తెర వెనుక దామరచర్ల?

ప్రకాశం జిల్లా డిసిసిబి బ్యాంక్‌కు చైర్మెన్‌గా బాధ్యతలను చేపట్టేందుకు కొందరు తెర వెనుక చక్రం తిప్పుతున్నారు. అయితే ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షుడు దామరచర్ల జనార్థన్ బంధువులు ఈ పదవిపై ఆసక్తిని చూపుతున్నారనే ప్రచారం కూడ సాగుతోంది.

ప్రకాశం 'చిచ్చు': బాబు తీరుపై అసంతృప్తి, టిడిపికి షాకిస్తారా?ప్రకాశం 'చిచ్చు': బాబు తీరుపై అసంతృప్తి, టిడిపికి షాకిస్తారా?

నియోజకవర్గాలవారీగా డేటా సేకరణ, నేతలతో ఇక తాడోపేడో బాబు షాకింగ్ నిర్ణయంనియోజకవర్గాలవారీగా డేటా సేకరణ, నేతలతో ఇక తాడోపేడో బాబు షాకింగ్ నిర్ణయం

 ఒంగోలు బ్యాంక్ ఛైర్మెన్ పదవిపై టిడిపి ఏం చేయనుంది

ఒంగోలు బ్యాంక్ ఛైర్మెన్ పదవిపై టిడిపి ఏం చేయనుంది

జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం తర్జనభర్జన పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంక్‌కు పాలక మండలి, దానికో చైర్మన్‌ అవసరమా? లేకా ప్రత్యేకాధికారిని నియమించడం సమంజసమా అన్న అంశంపై దృష్టి సారించింది.. ఈ విషయంలో అధికారుల ఆలోచనలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోబోతున్నారని అంటున్నారు. అయితే చైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ కూడా జారీ అయిన నేపథ్యంలో ప్రత్యేకాధికారి నియామకం సాధ్యమా? కాదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా, వచ్చిన అవకాశం చేజారుతుందన్న భావనలో కొందరు డైరెక్టర్లు ప్రత్యామ్నాయ వ్యూహం పన్నుతున్నారని సమాచారం.

 బ్యాంక్ చైర్మెన్ పదవికి డిసెంబర్ 5న, ఎన్నికలు

బ్యాంక్ చైర్మెన్ పదవికి డిసెంబర్ 5న, ఎన్నికలు

ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ చైర్మన్‌ పదవికి ఈనెల 5వ తేదీ ఎన్నిక జరగాల్సి ఉంది. ఇటు పార్టీ జిల్లా నేతల నుంచి అటు డైరెక్టర్ల నుంచి అభిప్రాయసేకరణ చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నేతల అభిప్రాయాలను తెలుసుకున్న మంత్రులు శిద్దా రాఘవరావు, నారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌లు ఆ అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు డైరెక్టర్ల అభిప్రాయాలను సేకరించిన రాష్ట్ర నేతలు అభిప్రాయాల సారాంశాన్ని సీఎంకు వివరించారు.

 చైర్మెన్ పదవి గడువు నెలన్నర పదవి

చైర్మెన్ పదవి గడువు నెలన్నర పదవి

ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పదవికి నెలన్నర గడువు మాత్రమే ఉంది. ప్రత్యేకాధికారి నియమిస్తే సరిపోదా అని కూడా సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సీఎం అలా వ్యక్తం చేసిన అభిప్రాయాలపై మంత్రులు, జిల్లా నేతలు మాత్రం వ్యతిరేకించలేదనేది సమాచారం.

న్యాయపరమైన సమస్యలు

న్యాయపరమైన సమస్యలు

ప్రస్తుత పరిస్థితుల్లో పాలక మండలిని రద్దు చేసి ప్రత్యేకాధికారిని నియమించడం సాధ్యమా, కాదా అన్న విషయంపై చర్చ ప్రారంభమైంది. చైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. మరోవైపు ఇన్‌చార్జి చైర్మన్‌ సారథ్యంలో బ్యాంక్‌ పాలక మండలి కొనసాగుతోంది. అందువల్ల నోటిఫికేషన్‌ రద్దు చేయాలన్నా, పాలక మండలిని పక్కనబెట్టాలన్నా చట్టపరంగా కొన్ని సమస్యలు ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

 దామరచర్ల పూర్ణచంద్రరావు పేరు

దామరచర్ల పూర్ణచంద్రరావు పేరు

ప్రకాశం జిల్లా సహకార బ్యాంక్ ఛైర్మెన్ పదవికి దామరచర్ల పూర్ణచంద్రరావు అయితే బాగుంటుందని జిల్లాకు చెందిన మంత్రి సూచించారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ పదవి కోసం మస్తానయ్య కూడ తీవ్రంగా పోటీపడుతున్నారు. అయితే డైరెక్టర్లు ఏ మేరకు సహకరిస్తారనేది మాత్రం ఆసక్తి నెలకొంది.ఇంటలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారంపై కూడ సీఎం చంద్రబాబునాయుడు సీఎంఓ అధికారులతో చర్చించారని సమాచారం.

English summary
Tdp leadership not yet take a decision on Ongole DCCB chairman elections.Tdp leaders and ministers discussed with Chandrababu Naidu on this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X