వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాలపై బాబు, ఎక్కడ ఎంత మెజార్టీ అంటే? శిల్పా ఇంటిపరిసరాల్లోను టిడిపిదే

నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. అభివృద్ధి, సంక్షేమానికి నంద్యాల ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని చెప్పారు.

నంద్యాలలో టిడిపి గెలుపు, జగన్ అసహనం: అంతా మీవల్లే... అధినేతపై వైసిపి, కారణాలివే..నంద్యాలలో టిడిపి గెలుపు, జగన్ అసహనం: అంతా మీవల్లే... అధినేతపై వైసిపి, కారణాలివే..

నంద్యాలలో టిడిపి గెలుపుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు అన్ని వర్గాల ప్రజలు టిడిపిని ఆదరించారని, ఈ విజయం అభివృద్ధికి నిదర్శనమన్నారు.

జగన్ వ్యాఖ్యలు ఆందోళన కలిగించాయి: చంద్రబాబు

జగన్ వ్యాఖ్యలు ఆందోళన కలిగించాయి: చంద్రబాబు

నంద్యాలలో జగన్‌ పదిహేను రోజుల పాటు బస చేసి ప్రలోభాలకు పాల్పడినా ప్రజలు వైసిపిని తిరస్కరించారని చంద్రబాబు చెప్పారు. ముఖ్యమంత్రిని నడిరోడ్డుపై కాల్చేయాలి, ఉరితీయాలి అని జగన్‌ చేసి వ్యాఖ్యలు ప్రజల్లో ఆందోళన కలిగించాయన్నారు.

Recommended Video

Nandyal Bypoll Results : Silpa Mohan Reddy accepts defeat, Reason Out | Oneindia Telugu
శాశ్వతంగా అధికారంలో ఉండేలా

శాశ్వతంగా అధికారంలో ఉండేలా

నంద్యాల ఫలితం రాబోయే ఎన్నికలకు నిదర్శనమని చంద్రబాబు అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. అవినీతిని నిర్మూలించి ప్రజలు మెచ్చుకునే పాలన అందించి టిడిపి శాశ్వతంగా అధికారంలో ఉండేలా చేస్తామని చెప్పారు.

టిడిపికి ఎక్కడ ఎంత మెజార్టీ అంటే

టిడిపికి ఎక్కడ ఎంత మెజార్టీ అంటే

నంద్యాలలో టిడిపి ఒక్క 16వ రౌండ్ మినహా అన్ని రౌండ్లలోను ఆధిక్యత ప్రదర్శించింది. అన్ని ప్రాంతాల్లో మెజార్టీ ఓట్లు సాధించింది. నంద్యాల రూరల్‌లో 13,056 ఓట్ల మెజార్టీ, అర్బన్‌లో 12,309 ఓట్ల మెజార్టీ, గోస్పాడులో 1788 ఓట్ల మెజార్టీ సాధించింది.

శిల్పా మోహన్ రెడ్డి ఇంటి పరిసరాల్లోను టిడిపిదే

శిల్పా మోహన్ రెడ్డి ఇంటి పరిసరాల్లోను టిడిపిదే

నంద్యాల అర్బన్‌లో శిల్పా మోహన్ రెడ్డి ఇంటి పరిసరాల్లోనూ టిడిపి ఆధిక్యం కనబర్చడం విశేషం. ఇక్కడ కూడా టిడిపి ఎక్కువ ఓట్లు రాబట్టడం గమనార్హం.

English summary
Chief Minister N Chandrababu Naidu's Telugu Desam Party is leading by a big margin in the bitterly fought Nandyal assembly by-election, with its candidate Bhuma Brahmananda Reddy ahead of YSR Congress by over 27,000 votes after 15 rounds of counting this afternoon. The TDP candidate established a quick lead over Silpa Chandra Mohan Reddy of the YSR Congress and has been ahead since.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X