వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

TDP mahanadu 2020... రెండో రోజు షెడ్యూల్ ... పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డిజిటల్ మహానాడు ఈ రోజు రెండో రోజు కూడా కొనసాగనుంది. కరోనా ఎఫెక్ట్ తో ప్రజలు సమూహాలుగా ఉండకూడదన్న కారణంతో, టిడిపి నేతలు, కార్యకర్తల ఆరోగ్యరక్షణ దృష్టిలో పెట్టుకొని డిజిటల్ మహానాడు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. టిడిపి నిన్న మొదటిరోజు జూమ్ యాప్ ద్వారా మహానాడును సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది. ఆన్‌లైన్లోనే తీర్మానాలు పెట్టి ఆ తీర్మానాలను కూడా ఆమోదించింది.

TDP Mahanadu 2020: టెక్నాలజీ వాడటంలో దిట్ట .. దేశంలోనే తొలిసారి డిజిటల్ మహానాడు..!TDP Mahanadu 2020: టెక్నాలజీ వాడటంలో దిట్ట .. దేశంలోనే తొలిసారి డిజిటల్ మహానాడు..!

రెండో రోజు మహానాడుకు రంగం సిద్ధం

రెండో రోజు మహానాడుకు రంగం సిద్ధం

ఇక నేడు రెండవ రోజు టిడిపి డిజిటల్ మహానాడుకు రంగం సిద్ధమైంది. ఈరోజు షెడ్యూల్ చూస్తే ఉదయం 11 గంటలకు టిడిపి నేతలు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కు నివాళులు అర్పించనున్నారు. ఉదయం 11 గంటల 25 నిమిషాలకు పార్టీ సంస్థాగత తీర్మానాన్ని చేయనున్నారు.అలాగే 11 గంటల 40 నిమిషాలకు భూ ఆక్రమణలు,జె టాక్స్, ప్రభుత్వ అవినీతిపై తీర్మానం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ధరల పెంపు, వైసీపీ ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న 50 వేల కోట్ల రూపాయల భారంపై తీర్మానం చేయనున్నారు.

 ఉదయం ఏపీలో పాలనపై , పలు సమస్యలపై తీర్మానాలు

ఉదయం ఏపీలో పాలనపై , పలు సమస్యలపై తీర్మానాలు

మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు ప్రజా రాజధానిగా అమరావతి, అలాగే గాడితప్పిన రాష్ట్రాభివృద్ధి అన్ని అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాలకు ఒక బ్రేక్ ఇచ్చి భోజన విరామ సమయంగా నిర్ణయించారు. ఉదయం అంతా ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై పలు తీర్మానాలు చెయ్యనున్నారు టీడీపీ నేతలు . నేడు కూడా మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి సమావేశాల్లో పాల్గొంటారు.

 మధ్యాహ్నం తెలంగాణాకు సంబంధించిన అంశాలపై తీర్మానాలు

మధ్యాహ్నం తెలంగాణాకు సంబంధించిన అంశాలపై తీర్మానాలు

ఇక ఆ తర్వాత మధ్యాహ్న భోజన విరామం తర్వాత తెలంగాణకు సంబంధించిన వివిధ అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు తెలంగాణ విద్యా, వైద్య రంగాల పై తీర్మానం చేయనున్నారు. 4 గంటల 10 నిమిషాలకు బలిపీఠంపై బడుగుల సంక్షేమం, 34 పథకాల రద్దుపై తీర్మానాలు చేయనున్నారు. 4 గంటల 25 నిమిషాలకు టిఆర్ఎస్ వాగ్దానాలు, వైఫల్యాలపై తీర్మానం చేయనున్నారు. 4 గంటల 30 నిమిషాలకు ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నం పై తీర్మానం, 4 గంటల 50 నిమిషాలకు రాజకీయ తీర్మానం చేయనున్నారు. ఇక చివరగా 5 గంటల 5 నిమిషాలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ముగింపు సమావేశంతో 2020 టిడిపి మహానాడు ముగియనుంది.

మహానాడు ద్వారా పార్టీ నాయకులకు , శ్రేణులకు దిశా నిర్దేశం చెయ్యనున్న చంద్రబాబు

మహానాడు ద్వారా పార్టీ నాయకులకు , శ్రేణులకు దిశా నిర్దేశం చెయ్యనున్న చంద్రబాబు

ఇక మొదటి రోజు మహానాడులో ఆరు తీర్మానాలు ప్రవేశపెట్టారు. పార్టీ కార్యాలయం నుంచి కేవలం చంద్రబాబు సహా ఐదారుగురు సీనియర్లు మహానాడులో పాల్గొంటే ఆన్‌లైన్లో సుమారు 25 వేల మంది పాల్గొన్నారని పార్టీ చెప్తుంది. ఇక నేడు కూడా జూమ్ వెబినార్ ద్వారా జరుగుతున్నటిడిపి డిజిటల్ మహానాడులో వేల మంది టీడీపీ నేతలు ,కార్యకర్తలు , ఎన్నారైలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ మహానాడు ద్వారా టీడీపీ నేతలకు , టీడీపీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చెయ్యనున్నారు అధినేత చంద్రబాబు నాయుడు .

English summary
Telugu Desam Party is holding the TDP Mahanadu for second day . Six resolutions were introduced in Mahanadu on the first day. The party says that participated in the Mahanadu about 25 thousand people through online. Thousands of TDP leaders, activists and NRIs are likely to take part in the TDP Digital Mahanadu, which is still being held today through Zoom Webinar. Chandrababu going to Direct the TDP leaders and TDP activists through this Mahanadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X