ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహానాడు విందు - పసందు : స్పెషల్ రుచులతో..!!

|
Google Oneindia TeluguNews

మహానాడు సంబరాలు మొదలయ్యాయి. రెండు రోజుల పాటు పసుపు పండగ కోసం భారీ సంఖ్యలో చంద్రన్న దళం తరలి వస్తోంది. రెండు రోజులు జరిగే ఈ మహానాడు లో ప్రతీ ఏటా ఇక్కడ అతిధులకు అందించే విందు ఎప్పుడూ ప్రత్యేకమే. టీడీపీలో ఏ కార్యక్రమం జరిగినా ఏర్పాటు చేసే విందు గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఈ సారి సైతం మహానాడు కమిటీల్లో భాగంగా 12 మందితో ఆహార కమిటీ ఏర్పాటు చేసింది. ఈ రోజు మహానాడు ప్రారంభం నుంచి రేపు సాయంత్రం ముగిసే వరకూ అయిదు విడతలుగా పసందైన రుచులతో ఆతిథ్యం ఇచ్చేందుకు ప్రత్యేకంగా మెనూ సిద్దమైంది.

తెలుగు స్పెషల్ వంటకాలతో ఈ మెనూను రెడీ చేసారు. అందులో భాగంగా.. ఈ రోజు బ్రేక్ ఫాస్టులో భాగంగా.. రవ్వకేసరి.. ఇడ్లీ..మైసూరు బోండా.. టమోటా బాత్..కొబ్బరి చట్నీ.. అల్లం చట్నీ..కారం పొడి..నెయ్యి..సాంబారు.. టీ , కాఫీ అందిస్తున్నారు. మధ్నాహ్నం లంచ్ లో భాగంగా.. యాపిల్ హల్వా..జిలేబీ..ఆజ్వాన్ పకోడీ.. వెజిటిబుల్ బుట్లెట్..కొబ్బరి అన్నం..కడాయి వెజిటబుల్ కూర్మా.. రైతా.. మామిడికాయ పప్పు..వంకాయ పకోడీ.. అరటికాయ మీల మేకర్ ఫ్రై ..మునగకాయ డబుల్ బీన్స్ కర్రీ.. బంగాళదుంప కర్రీ .. బీరకాయ శనగపప్పు కర్రీ.. దోసకాయ - వంకాయ చట్నీ.. మామిడికాయ పచ్చడి.. డైమండ్ చిప్స్.. అప్పడాలు.. సాంబారు.. పచ్చి పులుసు.. మజ్జిగ చారు..వైట్ రైస్.. నెయ్యి.. పెరుగు..ఐస్ క్రీం ఏర్పాటు చేస్తున్నారు.

TDP Mahanadu sepcial food items ready for invitees for two days

ఇక, ఈ సాయంత్రం స్నాక్స్ గా అల్లూరయ్య మైసూరు పాక్.. సమోసా..పకోడి..టీ- కాఫీ ఇవ్వనున్నారు. రాత్రి డిన్నర్ లో భాగంగా సేమియా కేసరి.. అరటికాయ బజ్జీ.. టమోటా పప్పు..బంగాళదుంప ఫ్రై, మిక్స్ఢ్ వెజిటబుల్ కర్రీ, దొండకాయ చట్నీ, పప్పు చారు, అప్పడాలు, వడియాలు, వైట్ రైస్, పెరుగు ఖరారు చేసారు. రెండో రోజున ఎన్టీఆర్ జన్మదినం కావటంతో..ఆ రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కింద నేరేడు హల్వా.. ఇడ్లీ..గారె..పొంగల్.. కొబ్బరి చెట్నీ.. కారం పొడి - నెయ్యితో అందించన్నారు.

రెండో రోజు లంచ్ లో భాగంగా.. చక్ర పొంగలి.. తాపేశ్వరం కాజా .. మసాలా వడ.. పుదీనా ఫింగర్.. వెజిటబుల్ బిర్యానీ..వెజ్ జై పూర్ కూర్మా.. రైతా..దోసకాయ పప్పు..దొండకాయ పకోడీ ఫ్రై.. బెండకాయ కొబ్బరి ఫ్రై..అరటికాయ గ్రేవీ కర్రీ.. గుత్తి వంకాయ కర్రీ..గోంగూర ఉల్లిపాయ చట్నీ..మక్సిడ్ వెజిటబుల్ చట్నీ.. డైమండ్ చిప్స్ తో సహా 19 రకాల వెరైటీలు వడ్డించనున్నారు. ఈ ఆహార కమిటీ సభ్యుల్లో ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప.. అనగాని సత్యప్రసాద్.. గొట్టిపాటి రవి కుమార్ .. మాజీ మంత్రి దేవినేని ఉమా.. చింతమనేని ప్రభాకర్.. వేగేశ్న నరేంద్రవర్మ..కందుల నారాయణ రెడ్డి..గొట్టిపాటి వెంకట ప్రసాద్.. మన్నవ మోహన క్రిష్ణ..పర్చూరి క్రిష్ణ తో పాటుగా మరి కొందరు సభ్యులుగా ఉన్నారు.

English summary
TDP Mahanadu special food menu for invitees and party volunteers for tow days, committee making arrangements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X