వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొత్తు తెంచుకొంటే మేలే: బిజెపి, రాజకీయ సమీకరణాల్లో మార్పులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:బిజెపి తీరుతో అసంతృప్తితో ఉన్న టిడిపి ఆ పార్టీతో పొత్తును తెగదెంపులు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉంది. బుధవారం నాడు అసెంబ్లీలో చంద్రబాబునాయుడు కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు టిడిపి తెగదెంపులు చేసుకొంటే మేలనే అభిప్రాయంతో ఏపీకి చెందిన బిజెపి నేతలు కూడ అభిప్రాయంతో ఉన్నారు.

అవిశ్వాసంతో ఒక్కరోజుకే, బిజెపిపై అసంతృప్తి: బాబు సంచలనంఅవిశ్వాసంతో ఒక్కరోజుకే, బిజెపిపై అసంతృప్తి: బాబు సంచలనం

2014 ఎన్నికల సమయంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో బిజెపి, టిడిపి కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. కేంద్రంలో టిడిపి, ఏపీలోని టిడిపి ప్రభుత్వంలో బిజెపి చేరింది.ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల సమయంలో బిజెపి హమీ ఇచ్చింది.ఈ హమీలను నెరవేర్చాలని టిడిపి డిమాండ్ చేస్తోంది.

బిజెపితో కటీఫ్: కేంద్రం వివక్ష, రేపు అసెంబ్లీలో బాబు ప్రకటన?బిజెపితో కటీఫ్: కేంద్రం వివక్ష, రేపు అసెంబ్లీలో బాబు ప్రకటన?

ఈ రెండు పార్టీల మధ్య అగాధం పెరుగుతోంది. బిజెపితో తెగదెంపులు చేసుకోవాలని మెజారిటీ టిడిపి ప్రజా ప్రతినిధులు చంద్రబాబునాయుడును కోరారు..ఈ తరుణంలో ఏపీ రాజకీయాల్లో రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కన్పిస్తోంది.

మారనున్న రాజకీయ సమీకరణాలు

మారనున్న రాజకీయ సమీకరణాలు


ఏపీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కన్పిస్తోంది. టిడిపి బిజెపిల మధ్య అగాధం పెరుగుతోంది. బిజెపితో తెగదెంపులు చేసుకొనేందుకు టిడిపి సిద్దంగా ఉన్నట్టు కన్పిస్తోంది. ఈ తరుణంలో ఏపీ రాజకీయాల్లో వేగంగా సమీకరణాలు మారే అవకాశం కన్పిస్తోంది. 2019 ఎన్నికల్లో ఏ పార్టీతో ఏ పార్టీ కలిసి ఉంటుందోననే విషయమై కొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇబ్బందులు తప్పవు

ఇబ్బందులు తప్పవు

బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే కొన్ని ఇబ్బందులు వస్తాయని ఎమ్మెల్యేలకు బాబు వివరించారు. టిడిఎల్పీ సమావేశంలో బాబు ఈ విషయాలను ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు ఆగిపోతాయని చంద్రబాబు చెప్పడంతో.. అయినా సరే ఇబ్బందులు ఎదుర్కొందామని ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ లాంటి నాయకులు ఏపీకి హోదా ఇవ్వాలని కోరిన విషయం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది.

ప్రజల్లో విలన్ గా మారుస్తున్న టిడిపి

ప్రజల్లో విలన్ గా మారుస్తున్న టిడిపి

కేంద్రం నుండి నిధులు వచ్చినా ఆ నిధులకు సరైన లెక్కలు చెప్పకుండా కేంద్రం నుండి నిధులు రాలేదని బిజెపిపై టిడిపి తప్పుడు ప్రచారం చేస్తోందని బిజెపి నేతలు అభిప్రాయంతో ఉన్నారు. కేంద్రం నుండి నిధులు విడుదల చేసినా టిడిపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. బిజెపి నేతలు కూడ టిడిపిపై విరుచుకుపడుతున్నారు. టిడిపి తీరుతో రాజకీయంగా నష్టమే కలుగుతోందని బిజెపి నేతలు తమ అంతర్గత సంభాషణల్లో అభిప్రాయపడుతున్నారు.

ప్రత్యేక హోదా తెరమీదకి

ప్రత్యేక హోదా తెరమీదకి

ప్రత్యేక హోదాను ఇవ్వాలని అన్ని రాజకీయపార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. టిడిపి కూడ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కోరుతున్నాయి. ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల సమయంలో మోడీ హమీ ఇచ్చారు. అయితే సాంకేతిక కారణాలతో హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పింది కేంద్రం. అయితే ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీని ఇచ్చేందుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు ప్రకటించింది. దీంతో ప్యాకేజీకి ఒప్పుకొన్నామని టిడిపి ప్రకటించింది. ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వనందున ప్రత్యేక హోదాను ఇవ్వాలని టిడిపి డిమాండ్ చేస్తోంది.

టిడిపితో తెగదెంపులు మేలు

టిడిపితో తెగదెంపులు మేలు

ఏపీ రాష్ట్రంలో టిడిపితో పొత్తును తెంచుకోవాలని బిజెపి నేతలు కోరుకొంటున్నారు. టిడిపి వైఖరి కారణంగా ఏపీలో తాము రాజకీయంగా బలపడలేకపోతున్నామని ఆ పార్టీ నేతల అభిప్రాయంగా ఉంది. టిడిపితో పొత్తు వల్ల రాజకీయంగా తమకు నష్టమనే అభిప్రాయంతో ఆ పార్టీ నేతలు ఉన్నారు.ఈ తరుణంలో టిడిపి కూడ బిజెపితో తెగదెంపులు చేసుకోవాలనే అభిప్రాయంతో ఉంది. దీంతో టిడిపి నేతలు పొత్తును తెగదెంపులు చేసుకోవాలనే అభిప్రాయంతో ఉండడం కూడ బిజెపి నెత్తిన పాలు పోసినట్టైంది.

English summary
Chandrababu Naidu might go for BJP's jugular on Wednesday after CM's reply to the motion of thanks to Governor's address. If Tuesday's warning of Naidu to the Centre to keep in mind the fate of the Congress for showing disrespect to the sentiments of the people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X