• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ? పార్టీలో సీరియస్‌ చర్చ .. మారిన పరిస్ధితులే కారణం..

|

ఏపీలో మారిన పరిస్ధితుల్లో అధికార వైసీపీ వ్యూహాలకు దీటుగా స్పందించడంలో నాలుగు దశాబ్దాల అనుభవమున్న టీడీపీ విఫలమవుతోంది. గతేడాది ఎన్నికల్లో ఎదురైన పరాభవం ఆ పార్టీని ఇప్పటికీ వెంటాడుతోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధినేత చుట్టూ చక్కర్లు కొట్టిన నేతలంతా ఇప్పుడు ఆయనకు మద్దతిచ్చేందుకు సైతం ముందుకు రావడం లేదు. దీంతోపాటు మూడు రాజధానుల వ్యవహారం కూడా ఆ పార్టీని కుదిపేస్తోంది. దీంతో పార్టీకి విధేయతగా ఉంటున్న కింజరాపు కుటుంబానికే బాధ్యతలు అప్పగిస్తే బావుంటుందనే చర్చ టీడీపీలో సీరియస్‌గా సాగుతోంది.

  TDP State President రేసులో Atchannaidu, Ram Mohan Naidu జస్ట్ మిస్ ! || Oneindia Telugu
  వరుస దెబ్బలతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి...

  వరుస దెబ్బలతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి...

  గతేడాది ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమైన టీడీపీకి ఆ తర్వాత అంత కంటే పెద్ద దెబ్బలు తగిలాయి. గెలిచిన 23 మందిలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి వైసీపీకి మద్దతు ప్రకటించడం, గతంలో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేసిన శిద్గా రాఘవరావు వంటి వారు సైతం వైసీపీ జెండా కప్పుకోవడం, మూడు రాజధానుల కారణంగా ఓ వర్గం ప్రజలు దూరం కావడం, అదే సమయంలో ఇద్దరు మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర సీరియస్‌ క్రిమినల్‌ కేసుల్లో ఇరుక్కోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. దీంతో సాధ్యమైనంత త్వరగా పార్టీని గాడిలో పెట్టాల్సిన అవసరం ఇప్పుడు అధినేత చంద్రబాబుకు తప్పనిసరిగా మారింది.

  గతంలో ఎన్నికల్లో ఓటమి తర్వాత కింజరాపు కుటుంబ వారసుడు, యువనేత రామ్మోహన్ నాయుడుకు పగ్గాలు అప్పగించేందుకు అంతా సిద్ధమైనా ప్రస్తుత పరిస్ధితుల్లో ఆయన అనుభవం చాలదని, ఆయన నేతృత్వంలో పనిచేసేందుకు సీనియర్‌ నేతలకూ ఇబ్బంది ఎదురవుతుందని అధిష్టానం భావించింది. దీంతో ఆ ప్రతిపాదన అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు దాని స్ధానంలో మరో ప్రతిపాదన సిద్ధమైంది.

  ఏపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..?

  ఏపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..?

  ఏపీలో మారిన పరిస్ధితుల్లో ఈఎస్‌ఐ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు టీడీపీకి ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. ఆయనపై నమోదైన ఈఎస్‌ఐ స్కాం కేసు ఎలాగో వైసీపీ కక్షసాధింపే అన్న వాదన టీడీపీ తెరపైకి తెచ్చింది. మరోవైపు కింజరాపు కుటుంబానికి చెందిన ఆయన మాజీ మంత్రిగా, సీనియర్‌ నేతగా పార్టీకి అండగా ఉన్నారు. అసెంబ్లీలోనూ, ఉత్తరాంధ్రలోనూ టీడీపీకి ఆయన సేవలు చాలా అవసరం.

  దీంతో అచ్చెన్నాయుడును అధ్యక్షుడిగా ప్రకటిస్తే ఎలా ఉంటుందన్న చర్చ టీడీపీలో సీరియస్‌గా సాగుతోంది. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావును అప్పట్లో సామాజిక సమీకరణాల దృష్ట్యా తెరపైకి తెచ్చారు. కానీ ఇప్పుడు ఆయన గత ఎన్నికల్లో ఓటమి తర్వాత యాక్టివ్‌గా కనిపించడం లేదు. దీంతో అదే ప్రాంతానికి చెందిన అచ్చెన్నాయుడు పేరు అధ్యక్ష రేసులోకి వచ్చింది.

  మూడు రాజధానుల నేపథ్యం...

  మూడు రాజధానుల నేపథ్యం...

  ప్రస్తుతం అమరావతి నుంచి రాజధానిని విశాఖ తరలించేందుకు వైసీపీ సర్కారు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రం కూడా దీనికి వంత పాడుతోంది. ఇవాళ కాకపోయినా రేపయినా రాజధాని విశాఖకు తరలిపోవడం ఖాయమైనే వాదన సాగుతోంది. ఇలాంటి తరుణంలో విశాఖ నగరం నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బాధ్యతలు మోసేందుకు సిద్ధంగా లేరు.

  దీంతో మరోసారి ఉత్తరాంధ్రకు చెందిన అచ్చెన్నాయుడుని అధ్యక్షుడిగా నియమిస్తే స్ధానికంగా పార్టీ బలోపేతం కావడంతో పాటు ఉత్తరాంధ్రలో పునర్‌ వైభవం సాధించేందుకు కూడా వీలు పడుతందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇకపై విశాఖ కేంద్రంగా సాగే రాజకీయాల్లో అచ్చెన్నాయుడు చురుకైన పాత్ర పోషించగలిగితే పార్టీకి భవిష్యత్తు ఉంటుందనే చర్చ సాగుతోంది.

  సామాజిక నేపథ్యం...

  సామాజిక నేపథ్యం...

  సామాజిక సమీకరణాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే టీడీపీలో ప్రస్తుతం ఏపీకి కాపు సామాజిక వర్గానికి చెందిన కళా వెంకట్రావు అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ వాస్తవానికి టీడీపీ బలం బీసీలే. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి బీసీల అండతోనే నెట్టుకొస్తోంది. కానీ తొలిసారిగా కళా రూపంలో అద్యక్ష బాధ్యతలు ఇచ్చినా అది ఫలితం ఇవ్వలేదు.

  కాపులు బలంగా ఉన్న స్ధానాల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. అంతెందుకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు సైతం గత ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఆయనపై నమ్మకం సడలింది. ఇలాంటి పరిస్ధితుల్లో బీసీ సామాజికవర్గానికి చెందిన అచ్చెన్నాయుడుకి పార్టీ బాధ్యతలు ఇవ్వడం ద్వారా తిరిగి ఆయా వర్గాల్లో టీడీపీకి తిరిగి ఆదరణ కల్పించాలనే ఆలోచన కూడా ఆ పార్టీలో కనిపిస్తోంది.

  English summary
  after last year poll debacle and recent developments in the state telugu desam party is considering to give state president post to former minister atchannaidu. tdp yet to take a final call on this.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X