• search
 • Live TV
విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బాలయ్యా ఏందయ్యా : అభిమానులపై దాడి చేయడమే బాలకృష్ణ ధ్యేయంగా పెట్టుకున్నారా..?

|
  AP Assembly Election 2019 : నడిరోడ్డుపై అభిమానిని చితకబాదిన బాలయ్య || Oneindia Telugu

  విజయనగరం: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి రెచ్చి పోయారు. ఇటీవలే ఓ జర్నలిస్టుపై బూతుపురాణం అందుకున్న హిందూపురం ఎమ్మెల్యే... ఆ ఘటన మరవకముందే ఓ అభిమానిపై చేయి చేసుకున్నారు. అలా ఇలా కాదు... పరిగెత్తించి పరిగెత్తించి కొట్టాడు. బాలకృష్ణ తీరుతో టీడీపీ అధినాయకత్వం తలలు పట్టుకుంటోంది. ఓ వైపు చూస్తూ చంద్రబాబు బావమరిది మరోవైపు చినబాబు మామ కావడంతో టీడీపీ నేతలు బాలయ్య తీరుపై అధినాయకత్వానికి ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారు.

  నిజం విత్ శివాజీ, పోలవరం తరలించేందుకు కేసీఆర్,మోడీ కుట్రలు,సిని నటుడు శివాజీ

  ప్రజాప్రతినిధా...ఇంకేమన్నానా..?

  ప్రజాప్రతినిధా...ఇంకేమన్నానా..?

  టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ మళ్లీ వార్తల్లో నిలిచారు. తాను కేవలం సినిమాలోనే హీరో అనే సంగతి మరిచినట్లున్నారు. బయట కూడా ఎక్కడ పడితే అక్కడ అభిమానులపై చేయి చేసుకుంటున్నాడు. కొద్ది రోజుల క్రితమే ఓ జర్నలిస్టును చంపేస్తానంటూ బెదిరిస్తూ బూతు పురాణం అందుకున్న బాలయ్య... తాజాగా మరో అభిమానిపై చేయిచేసుకున్నాడు. దీంతో ఎన్నికల వేళ టీడీపీ చాలా ఇబ్బందులు పడుతోంది.

  అభిమానిపై దాడి చేయడం పరిపాటిగా మార్చుకున్న బాలయ్య

  అభిమానిపై దాడి చేయడం పరిపాటిగా మార్చుకున్న బాలయ్య

  ఇక అసలు విషయానికొస్తే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో టీడీపీ అభ్యర్థి కిమిడి నాగార్జునకు మద్దతుగా బాలయ్య ప్రచారం నిర్వహించారు. ఓ అభిమాని తన ఫోనులో శాతకర్ణి ఫోటో తీసుకుంటుండగా ఆ అభిమాని ఫోనును బాలయ్య లాక్కునే ప్రయత్నం చేశాడు. ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనంతరం తాను ప్రచారం నిర్వహిస్తున్న వాహనం నుంచి దిగొచ్చి అభిమానిపై చేయిచేసుకున్నాడు ఈ నరసింహ నాయుడు. బాలకృష్ణ అభిమాని పై దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  అసెంబ్లీకి పంపిస్తే అక్కడ కూడా ఇలా ప్రవర్తించే అవకాశం: విపక్షాలు

  బాలకృష్ణ తీరుపై ఇటు అభిమానుల్లోను అటు కార్యకర్తల్లోను తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇక సాధారణ ప్రజలైతే ఆయన్ను చీదరించుకుంటున్నారు. బాలయ్య మానసిక పరిస్థితి సరిగ్గా లేదని అతను వెంటనే మానసిక చికిత్సాలయంలో ట్రీట్ మెంట్ తీసుకోవాలని సామాన్య ప్రజలు చెబుతున్నారు. ఓట్లు అడిగేందుకు వచ్చిన బాలయ్య... ఓటు వేయమని అభ్యర్థించాలిగానీ ఇలా నడిరోడ్డుపై స్థాయిని మరిచి ప్రవర్తిస్తున్నాడంటే ఆయన మానసిక పరిస్థితిపై చాలా అనుమానంగా ఉందని ప్రజలు భావిస్తున్నారు. అలాంటి బాలయ్యను అసెంబ్లీకి పంపి ఒకసారి తప్పుచేశామని హిందూపురం ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. మళ్లీ బాలయ్యను అసెంబ్లీకి పంపింతే అదే రౌడీయిజం సభలో చూపే ప్రమాదం ఉందని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.

  మొత్తానికి బాలకృష్ణ తాను రీల్ హీరో అనే ఫీలింగ్ నుంచి బయటపడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక బాలయ్య ప్రవర్తనతో అక్కడి స్థానిక టీడీపీ అభ్యర్థి చాలా ఇబ్బందికి గురయ్యారు. అసలే పోలింగ్‌కు తక్కువ సమయం ఉండటం.... బాలయ్య ఇలాంటి చర్యలకు దిగడంతో తన భవిష్యత్తు ఎలా మారుతుందో అని అక్కడి అభ్యర్థి కిమిడి నాగార్జున తన సన్నిహితుల దగ్గర వాపోయినట్లు సమాచారం.

  English summary
  Yet in another incident TDP MLA Balakrishna lost his cool. The actor turned politician hit one of the TD party worker. The video of Balakrishna running behind the karyakartha and giving punches had gone viral on social media.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X